CUCUMBER HAIR BENEFITS: మీ జుట్టు స్పీడ్‌గా.. ఒత్తుగా పెరగాలంటే ఈ రసం రాయండి చాలు..

Benefits of cucumber juice for hair: ఈరోజుల్లో జుట్టు రాలడం, డ్యాండ్రఫ్‌ పేరుకుపోవడం సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా మంచి ఫలితాలు పొందలేకున్నారు.

Benefits of cucumber juice for hair: ఈరోజుల్లో జుట్టు రాలడం, డ్యాండ్రఫ్‌ పేరుకుపోవడం సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా మంచి ఫలితాలు పొందలేకున్నారు. ముఖ్యంగా కొన్ని రకాల కెమికల్‌ ఉత్పత్తులతో జుట్టు రాలే సమస్య మరింత ఉధృతం అయ్యే అవకాశాలు లేకపోలేదు. జుట్టును సహజసిద్ధంగా ఆరోగ్యకరంగా సమస్యలను తగ్గించుకునే ఎటువంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ ఉండవు.

సాధారణంగా ఎండకాలంలో మార్కెట్లో నీరు అధికశాతం ఉండే ఆహారాలు తీసుకుంటాం. అలాగే కీరదోసకాయలు కూడా తీసుకుంటాం. ఇందులో నీటి శాతం అధికంగా ఉంటుంది. మన శరీర ఉష్ణోగ్రతను చల్లబరుస్తుంది.  అందుకే ఎండకాలం వీటిని ఎక్కువగా తీసుకుంటే శరీరానికి మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. అయితే, జుట్టుకు కూడా కీరదోసకాయ మేలు చేస్తుంది. దీంతో మీ జుట్టులో పేరుకున్న డ్యాండ్రఫ్ పోతుంది. జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది. కీరదోసకాయతో కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.కీరదోసకాయ ఆరోగ్యానికే కాదు అందానికి ఎంతో మంచిది. ఇది ర్యాషెస్‌ తగ్గించి చర్మానికి ఈవెన్‌ టోన్‌ అందిస్తుంది. కుదుళ్లను క్లెన్స్‌ చేస్తుంది. జుట్టు రాలకుండా సహాయపడుతుంది.

మాయిశ్చరైజ్‌..

మీ కుదుళ్లు పొడిబారితే జుట్టుకు కీరదోసకాయ రసం అప్లై చేసుకోండి. ఈ రసాన్ని జుట్టు కుదుళ్లకు చేతి వేళ్ల సహాయంతో బాగా మర్దన చేయండి. ఇది జుట్టు కుదుళ్లకు మాయిశ్చర్‌ నిలుపుతుంది. ఇలా చేయడం వల్ల జుట్టు మృదువుగా ఆరోగ్యంగా పెరుగుతుంది.

జుట్టు మళ్లీ పెరుగుతుంది..

కీరదోసకాయంలో విటమిన్ కే ఉంటుంది. ఇది జుట్టు తిరిగి పెరగడానికి ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. కీరదోసకాయ రసం జుట్టు కుదుళ్లకు అప్లై చేయడం వల్ల జుట్టు నిండుగా బాగా పెరుగుతుంది.  ఇది జుట్టును కాల్సిఫికేషన్‌ బారినుంచి కాపాడుతుంది. కాల్సిఫికేషన్ అనేది జుట్టుకుదుళ్లపై ఓ కాల్షియం లేయర్‌ ఏర్పడుతుంది. ఇది కొత్త జుట్టు పెరగడాన్ని నివారిస్తుంది.

జుట్టు ఆరోగ్యం..

కీరదోసకాయలో విటిమిన్‌ ఏ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది జుట్టు త్వరగా పెరగడానికి సహాయపడుతుంది. విటమిన్ ఏ జుట్టు కుదుళ్లకు కావాల్సిన పోషకాలను అందిస్తుంది. దీంతో జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. అంతేకాదు కీరదోసకాయను డైట్లో చేర్చుకోవడం వల్ల సెబం ఉత్పత్తికి కూడా ప్రేరేపిస్తుంది.ఇది జుట్టును హైడ్రేటెడ్‌గా, మాయిశ్చర్‌గా ఉండటానికి కూడా సహాయపడుతుంది.

ఇదీ చదవండి: మండే ఎండలకు ముఖానికి చల్లదనాన్ని అందించే కూలింగ్‌ మాస్కులు..

జింక్‌..

కీరదోసకాయను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మన శరీరంలో జింక్‌ లేమి కూడా తగ్గిపోతుంది. మన శరీరంలో జింక్ తగ్గిపోతే హెయిర్‌ ఫొలికల్స్‌ కూడా బలహీనమైపోతాయి. దీంతో జుట్టు పలుచబడి పోతుంది. కీరదోసకాయలో జింక్‌ అధికంగా ఉంటుంది. ఇది జుట్టును డ్యామేజ్‌ నుంచి రిపెయిర్‌ చేస్తుంది. జుట్టు ఆరోగ్యకరమైన పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది.

ఇదీ చదవండి: మీ జుట్టుకు ఈ నేచురల్‌ ఆయిల్‌ పెట్టండి.. నమ్మలేని పెరుగుదలను చూస్తారు..

హెయిర్ ఫొలికల్స్..

కీరదోసకాయలో ఉండే పొటాషియం, సల్ఫర్ జుట్టు రాలే సమస్యను నివారిస్తాయి. జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా సహాయపడతాయి. కీరదోసకాయ రసం మన జుట్టు పెరుగుదలకు కావాల్సిన సిలికాన్, సోడియం, కాల్షియం, సల్ఫర్‌ను అందిస్తాయి.ఇది హెయిర్‌ ఫొలికల్‌ను అందంగా కనిపించేలా చేస్తుంది. బలంగా కూడా మారుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

2024-05-07T05:46:23Z dg43tfdfdgfd