EGGS: వేసవికాలంలో గుడ్లు ఎక్కువగా తింటున్నారా? తస్మాత్ జాగ్రత్త!

Eating Eggs in Summer: ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ఆహార పదార్థాలలో గుడ్డు కూడా ఒకటి. గుడ్డులో ఉండే విటమిన్ ఏ, విటమిన్ బి12, విటమిన్ డి, ప్రోటీన్, క్యాల్షియం, జింక్, ఫోలేట్, ఫాస్ఫరస్ వంటి ఎన్నో పోషకాలు మన శరీరానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఆహారాలలో గుడ్డు ముందే ఉంటుంది. 

అందుకే చాలామంది గుడ్లు తింటుంటారు. ఆఖరికి మాంసాహారం తినని కొందరు కూడా కేవలం గుడ్డు మాత్రం తింటూ ఉంటారు. కానీ గుడ్డు వల్ల ఆరోగ్యానికి కేవలం ప్రయోజనాలు మాత్రమే ఉంటాయా అంటే కాదు అని చెప్పుకోవాలి. గుడ్డు వల్ల మనకి కలిగే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అది కూడా వేసవి కాలంలో గుడ్డు తీసుకోవడం వల్ల ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అనే విషయం కూడా ఆలోచించాలి.

వేసవికాలంలో గుడ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్టు వేసవి కాలంలో గుడ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా కొన్ని నష్టాలు ఉంటాయి. అందుకే గుడ్లను మితంగా తీసుకుంటే మంచిది.

ముఖ్యంగా వేసవిలో గుడ్లు తీసుకోవడం వల్ల కడుపులో కూడా వేడి పెరుగుతుంది. గుడ్లలో వేడిని పెంచే లక్షణం ఉంటుంది. అందుకే గుడ్లు ఎక్కువగా తీసుకుంటే మన శరీరంలో కూడా వేడి ఎక్కువై ముఖం మీద మొటిమలు రావడం వంటివి జరుగుతాయి. కొన్ని సందర్భాల్లో ఎసడిటీ, బర్నింగ్ సెన్సేషన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. 

గుడ్ల వల్ల జీర్ణ సమస్యలు కూడా రావచ్చు. గుడ్లను అరిగించుకోవడానికి శరీరానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల జీర్ణ సమస్యలు ఏర్పడి కడుపులో నొప్పి రావడం అజీర్ణం గా అనిపించడం తోపాటు గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు కూడా వచ్చి పడతాయి.

గుడ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాలపై కూడా చెడు ప్రభావం ఉంటుంది. కిడ్నీ ఆరోగ్యం బాగా పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకే వీలైనంత వరకు గుడ్లను మితంగానే తినాలి.  గుడ్లలో కొలెస్ట్రాల్ లెవెల్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గుడ్లు తినడం వల్ల మన శరీరంలో కూడా కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. అప్పటికే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వారు గుడ్లను తింటే వారికి గుండె పోటు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.

Read More: Happy Sri Rama Navami 2024: శ్రీ రాముడి స్పెషల్ కోట్స్, శక్తివంతమైన స్తోత్రాలు మీకోసం..

Read More: Sri Rama navami 2024: శ్రీరామ నవమి రోజు, సీతారామ కళ్యాణం జరిపిస్తారు.. దీని వెనుక ఉన్న ఈ విశేషం మీకు తెలుసా..?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

2024-04-17T06:42:13Z dg43tfdfdgfd