EYES HEALTH: మీ కళ్లు బాగా కనపడాలంటే ఇవి తినండి.. జీవితాంతం చక్కటి చూపు

Eyes Health: మన శరీరంలో కన్ను కీలక అవయవం. కంటి ఆరోగ్యం బాగా ఉంటేనే చాలా పనులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసుకోగలం. అయితే ఇటీవల కాలంలో చాలామంది కంటి సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా వేసవిలో కళ్లు పొడిబారడం, దురద చూపు మందగించడం వంటి ఇబ్బందులు అన్ని వయసుల వారిలో కనిపిస్తున్నాయి. ఈ సమస్యలకు కారణాలు, వీటికి ఎలా చెక్ పెట్టాలో తెలుసుకుందాం.

కంటి పరిశుభ్రత పాటించకపోవడం, కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో తిరగడం, స్క్రీన్ మీద ఎక్కువ సమయం గడపడం వంటి పర్యావరణ కారణాల వల్ల కళ్లు పొడిబారడం, దురద వంటి సమస్యలు రావచ్చు. సాధారణంగా వయసు పెరిగేకొద్దీ కంటిచూపు మందగిస్తుంది. మారిన జీవనశైలి కారణంగా కూడా చాలామందికి ఈ సమస్య ఎదురవుతోంది. చాలా మంది బైక్‌ రైడింగ్ సమయంలో కళ్లకు ఎలాంటి ప్రొటెక్షన్ తీసుకోరు. సన్ గ్లాసెస్ లేదా ఇతర ప్రొటెక్టివ్ కళ్లద్దాలను ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఫలితంగా హానికర యూవీ కిరణాలు, దుమ్ము, ధూళి కారణంగా కంటి ఆరోగ్యం దెబ్బతినవచ్చు. దీంతో కళ్లు పొడిబారడంతో పాటు దురద రావచ్చు.

* పోషకాహార లోపాలు

రెగ్యులర్ డైట్‌లో పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాలు చేర్చుకోకపోవడం కూడా కంటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. చాలా మంది జంక్ ఫుడ్స్‌కు అలవాటుపడ్డారు. దీంతో శరీరానికి విటమిన్స్, మినరల్స్ తగినంతగా అందడం లేదు. ఇది కంటి సమస్యలకు కారణం కావచ్చు.

---- Polls module would be displayed here ----

* సమస్యకు చెక్ పెట్టే టిప్స్

కంటి దురద, పొడిబారడం వంటి సమస్యల నుంచి ఉపశమనం కోసం కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటంటే..

- కంటి వ్యాయామాలు

బ్లింకింగ్ ఎక్స్‌సర్‌సైజ్‌లు రెటీనాను యాక్టివేట్ చేస్తాయి. కన్నీటి ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. దీంతో కళ్లు పొడిబారడం నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే దృష్టి సమస్యలు తగ్గుతాయి.

* సన్ గ్లాసెస్ ధరించడం

బయటకు వెళ్లినప్పుడు సన్ గ్లాసెస్ ధరించాలి. దీంతో హానికర యూవీ కిరణాల నుంచి కళ్లను రక్షించుకోవచ్చు. దుమ్ము, ధూళి కళ్లలో చేరదు కాబట్టి కళ్లు పొడిబారడం, దురద, చికాకు వంటి రిస్క్ తగ్గుతుంది.

* స్క్రీన్ టైమ్ మేనేజ్‌మెంట్

డెస్క్ జాబ్స్ చేసేవారు స్క్రీన్ యూసేజ్ నుంచి అప్పుడప్పుడు బ్రేక్స్ తీసుకోవాలి. స్క్రీన్ బ్రైట్‌నెస్‌ను సర్దుబాటు చేయడం, స్క్రీన్‌ తగినంత దూరంలో ఉండేలా చూసుకోవడంతో పాటు ఇతర జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతో కంటిపై ఒత్తిడి తగ్గుతుంది.

* హైడ్రేషన్

ఈ సీజన్‌లో మంచినీరు ఎక్కువగా తాగాలి. దీంతో శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. ఫలితంగా కళ్లలో కన్నీటి ఉత్పత్తి పెరుగుతుంది. ఇది కళ్లను పొడిబారకుండా నిరోధిస్తుంది.

* పరిశుభ్రత

కళ్లను రెగ్యులర్‌గా శుభ్రమైన నీటితో కడగాలి. దీంతో కంటి దురద, ఇన్‌ఫెక్షన్స్ తగ్గుతాయి. దురదగా ఉంటే అదేపనిగా కళ్లను రుద్దకూడదు. దీనివల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది.

* కోల్డ్ కంప్రెస్

కనురెప్పలను మూసి వాటిపై ఐస్‌ క్యూబ్స్‌తో కోల్డ్ కంప్రెస్ చేయడం వల్ల దురద, మంట నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. కంటి చికాకు తగ్గుతుంది.

* హెల్తీ డైట్

మనం తినే ఆహారంలో విటమిన్ ఎ, సీ, ఈ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. తాజా ఆకుకూరలు, చేపలు, గింజలు, విత్తనాలు వంటి వాటిలో ఈ పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని డైట్‌లో చేర్చుకుంటే కంటి సమస్యల ముప్పు తగ్గుతుంది. ఇలాంటి జాగ్రత్తలు అన్నీ తీసుకున్నా నిరంతరంగా తీవ్రమైన కంటి సమస్యలు వేధిస్తుంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం బెటర్.

2024-04-19T06:35:09Z dg43tfdfdgfd