FREE FOOD: ప్రతి రోజూ 1,000 మందికి ఉచితంగానే భోజనాలు.. ఎక్కడంటే..

ఈ రోజుల్లో ఒకరికి ఒకరు సహాయం చేయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి.కన్న తల్లిదండ్రులను సైతం అనాథ ఆశ్రమంలో వదిలే పిల్లలు, ఒక్క పూట తిండి పెట్టలేక రోడ్డుపై వదిలేబంధువులు, రోడ్డుపై యాక్సిడెంట్ జరిగి పడిపోతే కనీసం కొన్ని కొన్ని సార్లు పట్టించుకోని జనం. ఇలాంటి పరిస్థితులు ఉన్న ఈ రోజుల్లో ఎలాంటి లాభా పేక్షఆశించకుండా నిస్వార్థంతో ఉచితంగా సేవ చేస్తూ పదిమంది మన్ననలు పొందుతున్నారు సద్గురు దాత కృపాలయం సంస్థ.

కర్నూలు జిల్లాకు చెందిన కే.చంద్రశేఖర్ రెడ్డి, కే కృష్ణకుమారి దంపతులిద్దరూ గత 13 సంవత్సరాలుగా కర్నూలు జిల్లాలో పేద ప్రజలకు ఉచిత సేవలను అందిస్తున్నారు. సద్గురు దత్త కృపాలయం పేరుతో మీరు సేవలు ప్రారంభించారు. ప్రతిరోజు వెయ్యి మందికి పైగా ఉచితంగా భోజనాన్ని అందిస్తున్న వీరు. కర్నూలు ప్రభుత్వాసుపత్రికి వైద్యం కోసం వచ్చే రోగులకు ఉచితంగానే మధ్యాహ్నం పూట భోజనాన్ని అందిస్తున్నారు.

మే నెలలో తిరుమల వెళ్తున్నారా.. ఈ 7 ముఖ్యమైన తేదీలు గుర్తుపెట్టుకోండి, ఏ రోజున ఏం జరుగుతుందంటే..

అంతేకాకుండా. కర్నూల్ పట్టణ ప్రాంతంలో చనిపోయిన వారిని పట్టణంలోని పాతబస్తీ సమీపంలో ఉన్న జోరాపురం దగ్గర స్మశాన వాటిక వద్దకుచనిపోయిన పార్థివ దేహాన్ని తీసుకెళ్లేందుకు వైకుంఠ రథాలను ఏర్పాటుచేశారు. అంతేకాకుండా చనిపోయిన పార్థివ దేహాలను ఉంచేందుకు ఉచితంగానే ఫ్రీజర్ బాక్స్ లను సైతం ఏర్పాటు చేస్తున్నారు. అడిగినవారికి లేదు కాదు అనకుండా స్మశాన వాటిక వరకు వెళ్లేందుకు వైకుంఠ రథాలను, అదే విధంగా స్మశాన వాటికలో అంత్యక్రియలు చేసేందుకు ఎలక్ట్రికల్ క్రిమిసన్ మిషను ఉచితంగానే అందిస్తున్నారు.

శుభవార్త.. రూ.1,300కు పైగా పతనమైన బంగారం ధర, వెండి రూ.2,500 ఢమాల్!

ప్రస్తుతం హిందూ స్మశాన వాటికలో చనిపోయిన వారికి కర్మకాండలు జరిపించేందుకు అపర కర్మల గదులను సైతం ఏర్పాటు చేశారు. కర్నూల్ పట్టణంలోని జమ్మిచెట్టు సమీపంలో ఉన్న హిందూ స్మశాన వాటికలో దాదాపుగా కోటి రూపాయలు వెచ్చించి అపర కర్మల రూముల భవనాన్ని నిర్మించారు. ఈ కార్యక్రమాలన్నీ గత 13 సంవత్సరాలుగా ఉచితంగా చేస్తున్న వీరిని చూసి ఎంతోమంది వీరిని ఆదర్శంగా తీసుకుని తాము సైతం ఈ సేవలో భాగమవుతామంటూ స్వచ్ఛందంగా సేవ చేయడానికి ముందుకు వస్తున్నారు.

2024-04-28T06:43:39Z dg43tfdfdgfd