FULL MOON: ఏప్రిల్‌ 23న పౌర్ణమి.. ఈ రాశులకు అలర్ట్.. ఇలాంటి తప్పులు చేయొద్దు

Full Moon:  జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు ఆయా రాశులపై ప్రభావం చూపుతాయి. అలానే ఈ నెల 23న రానున్న పౌర్ణమి, వృశ్చికంలో తీవ్రమైన భావోద్వేగాలను, మూడ్ స్వింగ్‌లను తీసుకొస్తుంది. సూర్యుడు, ప్లూటో ఒకదానికొకటి సవాలు చేసే కోణంలో ఉండటం వల్ల తీవ్రత పెరుగుతుంది. బుధుడు తిరోగమనం నుంచి నేరుగా మేషరాశికి మారుతోంది, వృషభం వైపు కదులుతుంది, అక్కడ మళ్లీ సూర్యుడిని కలుస్తుంది. ఇది కొన్ని అస్తవ్యస్తమైన భావోద్వేగ స్థితులకు దారి తీస్తుంది.

ఈ గ్రహాల కదిలకల్లో అంతా అశుభం కాదు. వృశ్చికంలోని పౌర్ణమి పరివర్తనను ప్రోత్సహిస్తుంది, మన లోతైన భావోద్వేగాలను కలిగిస్తుంది. మన నమ్మకాలను సవాలు చేస్తుంది, నిజంగా మనకు ఏ విధంగానూ సహాయం చేయని మన నమూనాలను మార్చుకోవడంలో సహాయపడుతుంది. కొందరు తమ సన్నిహిత సంబంధాలను కూడా ప్రశ్నించవచ్చు.

---- Polls module would be displayed here ----

పాత నమూనాల నుంచి విముక్తి పొందడం, మార్పును స్వీకరించడం ఉజ్వల భవిష్యత్తుకు కీలకం. పౌర్ణమి తర్వాత కమ్యూనికేషన్ మెరుగుపడుతుంది, రహస్యాలు వెలుగులోకి రావచ్చు. ఇది ప్రియమైన వారితో లేదా సహచరులతో ఓపెన్‌ డిస్కషన్‌లకు దారి తీస్తుంది. ఏప్రిల్ 23న పౌర్ణమి తర్వాత మనలో చాలా మంది జీవితాల్లో బాధ్యత వహిస్తారు. స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే, ఇది వృద్ధికి అవకాశంగా ఉంటుంది. ఈ ప్రభావం ఏ రాశులపై ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.

వృశ్చికం (Scorpio):

పౌర్ణమి, ముఖ్యంగా మీ రాశిలో, శక్తిని ప్రేరేపిస్తుంది. ఇది మీ గతం, అలవాట్లను ప్రతిబింబించేలా చేస్తుంది. మీ భావోద్వేగాలు, అంతర దృష్టి ఎక్కువగా పనిచేస్తాయి, కాబట్టి వాటిని తెలివిగా ఉపయోగించండి. అవసరమైన చోట మార్పులు చేయండి, మిమ్మల్ని నిలువరించే వాటిని వదిలేయండి. కొన్ని కొత్త కర్టెన్‌లు లేదా రెన్నోవేషన్‌తో మీ స్థలాన్ని అలంకరించుకోవచ్చు.

కర్కాటకం (Cancer):

నీటికి సంకేతంగా, వృశ్చికరాశిలో పౌర్ణమి లోతైన ఆత్మపరిశీలనకు సమయం. మీ సృజనాత్మకత పెరుగుతుంది. కళలు, థియేటర్ లేదా సంగీతాన్ని అన్వేషించడానికి ఇది సరైన క్షణం. మిమ్మల్ని మీరు ఎక్స్‌ప్రెస్‌ చేయండి, మీ కోసం కొత్త మార్గాన్ని సృష్టించండి. అయితే మీ ఆర్థిక స్థితిని జాగ్రత్తగా చూసుకోండి.

వృషభం (Taurus):

రాశిలో అంశాలు తగ్గుముఖం పడుతున్నాయి, అంటే మీరు ఆఫీసులో లేదా ఇంట్లో అధికార పోరాటాలను ఎదుర్కోవచ్చు. మీ ఉద్యోగంలో మార్పులు రావచ్చు. మీరు మీ పార్ట్‌నర్‌తో రొమాంటిక్‌ లేదా బిజినెస్‌ పరంగా డిస్‌కనెక్ట్ అయినట్లు భావిస్తే, నిరాశ చెందకుండా ప్రయత్నించండి. రిలేషన్‌షిప్‌లో పరీక్షలు ఎదురవుతాయి. మీ ఎదుగుదలను అడ్డుకునేందుకు ఎవరైనా మిమ్మల్ని కిందికి లాగినా, వారిని క్షమించి వదిలేయాల్సిన సమయం.

మిథునం (Gemini):

మీ దినచర్యను పరిశీలించండి. మీరు వ్యాయామం చేయడం లేదా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంలో అలసత్వం వహిస్తే, తిరిగి ట్రాక్‌లోకి రావడానికి ఇది సమయం. ప్రశాంతత కోసం ధ్యానం చేయడం ప్రారంభించండి. ఒత్తిడి వల్ల అతిగా తినడం తగ్గించండి. మీ నైపుణ్యాలను పెంచుకొనే ఆలోచనలో ఉంటే, అందుకు ఇదే సరైన సమయం. మిమ్మల్ని మీరు అప్‌గ్రేడ్ చేసుకోవడానికి ఎగ్జిక్యూటివ్ మేనేజ్‌మెంట్ కోర్సును తీసుకోవడాన్ని పరిగణించండి.

కుంభం (Aquarius):

ఇది కుంభరాశి వారు ప్రకాశించే సమయం. గుర్తింపు, ప్రమోషన్‌లు లేదా అవార్డులతో మీ కష్టానికి ఫలితం దక్కనుంది. షాడో నుంచి బయటపడి, మిమ్మల్ని మీరు మార్చుకోండి. మీ సోషల్ మీడియా ప్రెజెన్స్‌ని అప్‌డేట్‌ చేయండి, ఎందుకంటే మీకు గుర్తింపు లభిస్తుంది. భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకోవడానికి, కొన్ని కొత్త లక్ష్యాలను నిర్దేశించడానికి కూడా ఇది గొప్ప సమయం.

తుల (Libra):

తులారాశి వారు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తమ ఆర్థిక వ్యూహాలను పునరాలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. వ్యక్తిగతంగా చెప్పాలంటే, మీ సంబంధం ఎటువైపు దారితీస్తుందనే దాని గురించి చర్చించడానికి ఇది సమయం కావచ్చు. మీరు పిల్లల గురించి కొన్ని వార్తలు కూడా వినవచ్చు. వారు తమ పాఠ్యాంశాలను మారుస్తున్నట్లు లేదా రిలేషన్‌ గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలియవచ్చు.

(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ) (ప్రతీకాత్మక చిత్రం)

2024-04-20T08:20:47Z dg43tfdfdgfd