GARELU RECIPE: మరమరాలతో ఇలా గారెలు చేసుకోండి, సాయంత్రం స్నాక్స్ గా తినవచ్చు

Garelu Recipe: కరకరలాడే మరమరాలతో క్రంచీ గారెలు చేసుకుంటే రుచి అదిరిపోతుంది. వీటిని ఇన్‌స్టెంట్‌గా చేసుకోవచ్చు. ముందుగానే గంటల పాటు పప్పును నానబెట్టాల్సిన అవసరం లేదు. అప్పటికప్పుడు ఈ గారెలను వండుకొని తినేయొచ్చు. వీటిని చేయడం చాలా సులువు. క్రంచీగా ఉండే ఈ గాలిలో పిల్లలకు బాగా నచ్చుతాయి. మరమరాలతో గారెలు ఎలా చేయాలో తెలుసుకోండి.

మరమరాల గారెలు రెసిపీకి కావలసిన పదార్థాలు

మరమరాలు - మూడు కప్పులు

గోధుమ పిండి - పావు కప్పు

అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను

పెరుగు - మూడు స్పూన్లు

నువ్వులు - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

గరం మసాలా - పావు స్పూను

కారం - ఒక స్పూను

నిమ్మరసం - ఒక స్పూను

నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా

కొత్తిమీర తురుము - రెండు స్పూన్లు

మరమరాలా గారెలు రెసిపీ

1. ముందుగానే మరమరాలను నీటిలో వేసి నానబెట్టుకోవాలి.

2. ఇవి ఐదు నిమిషాల్లోనే నానిపోతాయి. వాటిని చేత్తోనే పిండి తీసి పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగు వేసుకొని, ఆ పెరుగులో ఈ మరమరాలను వేసి కలుపుకోవాలి. పావుగంట పాటు వదిలేయాలి.

4. ఆ తర్వాత అందులోనే గోధుమపిండి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూను నువ్వులు, పచ్చిమిర్చి తరుగు, గరం మసాలా, కారం, ఉప్పు, నిమ్మరసం, కొత్తిమీర తరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి.

5. ఒక స్పూన్ నూనెను కూడా వేసి బాగా కలపాలి.

6. ఇదంతా గట్టిగా ముద్దలా వచ్చేలా కలుపుకోవాలి.

7. మరీ మందంగా ఉందనుకుంటే కాస్త నీళ్లు పోసుకోవచ్చు.

8. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

9. డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేసి ఆ నూనె వేడెక్కాక ఈ ముద్దను గారెల్లా ఒత్తుకొని నూనెలో వేయాలి.

10. రెండు వైపులా ఎర్రగా కాల్చుకొని తీసి పక్కన పెట్టుకోవాలి.

11. నువ్వులు చల్లుకుంటే టేస్టీగా ఉంటాయి.

12. ఈ గారెలను చేయడం చాలా సులువు పిల్లలు.

13. స్నాక్స్ అడిగినప్పుడు వీటిని అరగంటలో చేసి పెట్టొచ్చు.

14. ఇవి క్రంచీగా ఉంటాయి. కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు.

15. ఈ గారెలతో సైడ్ చట్నీలు కూడా అవసరం.

మరమరాలను కూడా బియ్యంతోనే తయారు చేస్తారు. కాబట్టి ఈ ఆరోగ్యానికి మేలే చేస్తాయి. సాయంత్రం పూట త్వరగా అయ్యే స్నాక్స్ లో ఇవి ఒకటి. ఎప్పుడూ ఒకేలాంటి స్నాక్స్ తినకుండా ఇలా అప్పుడప్పుడు కొత్తగా ట్రై చేసి చూడండి. ఈ మరమరాల గారెలు అందరికీ కచ్చితంగా నచ్చుతాయి.

2024-05-04T10:25:53Z dg43tfdfdgfd