GOLD WASTAGE: బంగారం ఆభరణంలో తరుగు ఎలా తీస్తారో తెలుసా..

బంగారంతో ఆభరణాలు తయారు చేసేటప్పుడు తరుగు ఎందుకు వస్తుంది. బంగారం నాణ్యత లేదా స్వచ్ఛతను సున్నా నుంచి 24 క్యారెట్ల రూపంలో చెబుతారు. అసలు ప్యూర్ గోల్డ్‌లో తరుగు ఎంత ఉంటుందనే విషయని కరీంనగర్ కు చెందిన స్వర్ణకారుడు నగేష్ కుమార్ ను లోకల్ 18 పలకరించే ప్రయత్నం చేసింది. స్వర్ణకారుడు నగేష్ మాట్లాడుతూ 24 క్యారెట్ల బంగారంఅంటే అది 99.99 శాతం స్వచ్ఛమైనదని అర్థం. ఇందులో లెక్కలోకి తీసుకోలేనంత మోతదులో ఇతర లోహలు ఉంటాయి. 24 క్యారెట్స్ బంగారం సున్నితంగా ఉండడంతో దీనితో ఆభరణాలు తయారు చేయడం కష్టం.దీనికి గట్టిదనం చేకూర్చడం కోసం రాగి, వెండి, కాడ్మియం, జింక్ వంటి ఇతర లోహలను కలుపుతారు. ఈ లోహాలు కలిసిన శాతం ఆధారంగా బంగారం స్వచ్ఛత 22 క్యారెట్ 18 క్యారెట్ నిర్ణయిస్తారు.

22 క్యారెట్ల బంగారం అంటే అందులో 91.6% బంగారం 8 శాతం ఇతర లోహాలు కలుస్తాయి. అదే విధంగా 18 క్యారెట్ల బంగారు ఆభరణాల్లో అయితే బంగారు శాతం 75% ఇతర లోహాలు 25% ఉన్నాయని అర్ధం. ఎక్కువగా 22 క్యారెట్ల బంగారం తోటి ఆభరణాలు తయారు చేస్తారు. 10గ్రాముల బంగారని 70700 వేల రూపాయలకు కొని స్వర్ణకరునికి ఇస్తే ఆభరణం తయారై కస్టమర్ చేతికి వచ్చే సరికి దాని బరువు తగ్గుతుంది.

అన్ని సమస్యలకు ఏకైక పరిష్కారం గుమ్మడికాయ దీపారదన.. ఎలా చేయాలంటే..

10 గ్రాముల బంగారానికి దాదాపు 200 మిల్లి గ్రాముల తరుగు లేదా వేస్టేజ్ పోతుంది. ఆభరణం తయారు చేస్తున్నపుడు వివిధ దశలలో ఆభరణానికి స్వర్ణకారుడు తీసుకునే 400 మిల్లి గ్రామ్స్ లో 200మిల్లి గ్రామ్స్ వారి తయారీకి లేదా మజురిలో ఖర్చుచేసుకుంటారు. అంటే 10గ్రాములో 400మిల్లి గ్రాముల బంగారం పోతుందని అంటే కస్టమర్ ఇచ్చే బంగారం లో 9.6 గ్రాముల బంగారం మాత్రమే ఉంటుందని స్వయంగా నగలు తయారు చేసే స్వర్ణకారులు చెబుతున్న మాట. అయితే తరుగు ఎందుకు పోతుందనే విషయాన్ని స్వర్ణకాలను అడిగితే తరుగు తీయడం అనేది స్వర్ణ కారులకు అనవాయితీగా వస్తుందన్నారు.

2024-05-04T06:52:14Z dg43tfdfdgfd