GOLDEN SHOWER: ఎండాకాలంలో మాత్రమే వచ్చే చెట్టు.. దీని ఔషధ గుణాలు తెలిస్తే అసలు వదలరు

Golden Shower Health Benefits: ఈ వేసవికాలంలో ఎండలకి చాలావరకు మొక్కలు వాడిపోతూ ఉంటాయి. ఆఖరికి చెట్లు కూడా ఎండిపోతూ ఉంటాయి. వాటి ఆకులు రాలిపోయి.. కేవలం కొమ్మలు మాత్రమే మిగులుతూ ఉంటాయి. కానీ ఇలాంటి వేసవికాలంలో కూడా.. ఒక చెట్టు అందమైన పువ్వులను పూజిస్తూ ఉంటుంది. అదే గోల్డెన్ షవర్. మార్చి నుంచి జూలై దాకా మాత్రమే ఈ చెట్టుకి పువ్వులు పూస్తాయి. పసుపు రంగు పువ్వులతో ఈ చెట్టు ఎండాకాలంలో కూడా అందమైన కళకళలాడుతూ కనిపిస్తుంది. 

కేవలం చూడటానికి మాత్రమే అందంగా ఉండటం కాకుండా.. ఈ చెట్టులోని ప్రతి అణువణువు మనకి ఔషధంగా పనిచేస్తూ ఉంటుంది. చూసేందుకు కనువిందు చేసే ఈ చెట్టులో ఎన్నో ఆయుర్వేద లక్షణాలు కలిగి ఉన్నాయి. ఆకుల నుంచి మూలాల వరకు.. ఈ చెట్టు ఎన్నో వ్యాధులకు నివారణిగా పనిచేస్తుంది. ఆఖరికి ఈ చెట్టు సోరియాసిస్ ను కూడా నయం చేయగలదు. 

తెలుగులో ఈ చెట్టుని రేలాచెట్టు అని పిలుస్తారు. దీని వల్ల అల్సర్లు, గుండె జబ్బులు, కామెర్లు కూడా తగ్గిపోతాయి. ఏదైనా విషపూరితమైన జంతువులు కాటు వేసినప్పుడు.. ఆ నొప్పిని తగ్గించడానికి కూడా ఈ చెట్టుని ఉపయోగిస్తారు. రేలచెట్టు బెరడుని తురిమి పౌడర్ గా చేసుకొని ఉంచుకుంటే.. మన ఇంట్లో అన్నీ రోగాలకి మందు ఉన్నట్టే. 

జ్వరం, మధుమేహం, వంటి వాటికే కాకుండా కుష్టి వ్యాధికి కూడా ఈ చెట్టు అద్భుతమైన ప్రయోజనాలను ఇస్తుంది. రేల చెట్టు ఆకులను మెత్తగా నూరి.. మజ్జిగలో కలిపి తాగితే ఊబకాయం కూడా తగ్గిపోతుంది. దానివల్ల గుండెల్లో మంట, కడుపులో నొప్పి వంటి రోగాలు కూడా మన దరిచేరవు. 

గోల్డెన్ షవర్ చెట్టు ఆకులు జ్యూస్ చేసుకుని తాగడం వల్ల.. షుగర్ కూడా కంట్రోల్ లోకి వస్తుంది ఇక రేలా పువ్వులు కూడా.. ఆరోగ్యానికి ఎంతో మంచిది. రేలా పువ్వులను పేస్ట్ చేసి తిన్నా కూడా.. మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇక రేల ఆకుల పేస్టుతో కొందరు టీ కూడా చేస్తారు. దాని వల్ల కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. 

మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఈ చెట్టు కనిపిస్తే వదలకుండా కొన్ని ఆకులు, పువ్వులు తెచ్చుకుంటే సరిపోతుంది. భారతదేశంలో ఇది కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. ముఖ్యంగా హిమాలయాల దగ్గరలో ఈ చెట్టు కనిపిస్తుంది. 

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ గోల్డెన్ షవర్.. థాయిలాండ్ యొక్క నేషనల్ చెట్టుగా గుర్తింపబడింది. ఇందులో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ కారుణంగా.. ఇప్పుడు ఇది ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్ అయిపోయింది.

గమనిక: పైన చెప్పిన సమాచారం, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా పాటించే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

Also Read: Trisha Top Movies: త్రిష కెరీర్‌లో టాప్ చిత్రాలు ఇవే..

Also Read: Hamida banu: భారత్ తొలి రెజ్లర్ .. గూగుల్ డూడుల్ హమీదా భాను గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

2024-05-04T17:07:05Z dg43tfdfdgfd