GOOD HEALTH: ఏ వయస్సు వారు ఎంతదూరం వాకింగ్​ చేయాలో తెలుసా...

Good Health: ఏ వయస్సు వారు ఎంతదూరం వాకింగ్​ చేయాలో తెలుసా...

సాధారణంగా బరువు తగ్గడానికి, ఫిట్‌గా ఉండడానికి వ్యాయామం, వాకింగ్, స్కిప్పింగ్, సైక్లింగ్ వంటివి చేస్తుంటారు. అయితే ఇందులో వాకింగ్ అనేది చాలా పవర్ ఫుల్ అని నిపుణులు అంటున్నారు. వాకింగ్ చేయడం వల్ల శరీరం ఫిట్ గా, ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అంతేకాదు రోజంతా ఉత్సాహంగా, యాక్టివ్‌గా ఉండాలంటే కూడా వాకింగ్ సహాయపడుతుంది. ఈ తరుణంలో వాకింగ్ చేయడానికి ఒక్కో వయసు వారికి ఒక్కో లిమిట్ ఉంటుంది. అయితే ఏ వయస్సు వారు ఎంత దూరం వాకింగ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

  • వాకింగ్ అంటే ప్రతీరోజూ అరగంట సేపు నడవాలి. దీనివల్ల శరీరంలోని అనేక సమస్యలు తొలగిపోతాయి. సాధారణంగా అయితే ఒక వ్యక్తి రోజుకు 10వేల అడుగులు నడవాల్సి ఉంటుంది.
  •  ఇందులో 5 నుండి 7 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలు రోజూ 12 వేల నుంచి 15వేల అడుగులు నడవాల్సి ఉంటుంది.
  • 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసున్న వారైతే 12 వేల అడుగులు నడవాలి.
  •  40 సంవత్సరాలు దాటిన వ్యక్తులు అయితే 11 వేల అడుగులు నడవాల్సి ఉంటుంది.
  •  50 సంవత్సరాలు దాటిన వారైతే 10 వేల అడుగులు నడవాల్సి ఉంటుంది.
  • 60 సంవత్సరాలు పైబడిన వ్యక్తులైతే 8వేల అడుగులు నడవాల్సి ఉంటుంది

వయసు ప్రకారం వాకింగ్ చేస్తే శరీరంలో రక్తప్రసరణ సరిగ్గా జరుగుతుందట. వాకింగ్ చేసే అలవాటు ఉన్న వారికి గుండె జబ్బుల సమస్యలు దరికి చేరవని అంటారు. వీరికి గుండె సమస్యలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. రోజుకు 30 నుంచి 45 నిమిషాల పాటు వాకింగ్ చేయడం ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు

  ©️ VIL Media Pvt Ltd.

2024-05-02T15:01:33Z dg43tfdfdgfd