GURU GOCHAR 2024: బృహస్పతి రాశి ప్రవేశం..మే 1 నుంచి ఈ రాశులవారికి లాభాలే, లాభాలు!

Jupiter Transit 2024 In Telugu: జ్యోతిష్య శాస్త్రంలో బృహస్పతి గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహం చాలా నెమ్మదిగా రాశి సంచారం చేసంతుంది. అయితే ఈ గ్రహం త్వరలోనే ఒక రాశిని వదిలి మరో రాశిలోకి సంచారం చేయబోతున్నట్లు తెలుస్తోంది. పోయిన సంవత్సరం ఏప్రిల్ 22న ఈ బృహస్పతి గ్రహం మేష రాశిలోకి సంచారం చేయగా..దాదాపు 12 నెలల తర్వాత ఈ సంవత్సరంలో మే నెలలో రాశి సంచారం చేయబోతోంది. ఈ బృహస్పతి గ్రహం శుక్రుని వృషభ రాశిలోకి ప్రవేశించబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. దీంతో పాటు జాతకంలో ఈ గ్రహం ప్రత్యేక స్థానంలో ఉన్నవారికి ఆనందంతో పాటు అదృష్టం కూడా పెరగబోతోంది. 

ఈ రాశులవారిపై బృహస్పతి ప్రభావం:

కన్యా రాశి:

కన్యా రాశి వారికి బృహస్పతి సంచారం కారణంగా విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. దీంతో పాటు వీరికి ఇంతకముందు ఆగిపోయిన పనులు కూడా ప్రారంభమవుతాయి. అలాగే కెరీర్‌కి సంబంధించిన విషయాల్లో ప్రమోషన్స్‌ పొందే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారు ఈ సమయంలో విదేశి పర్యాటనలు కూడా చేసే అవకాశాలు ఉన్నట్లు తెలస్తోంది. దీంతో పాటు పిల్లల నుంచి కూడా మంచి వార్తలు వింటారు. ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన గొప్ప విజయాలు సాధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

సింహ రాశి:

బృహస్పతి సంచారం చేయడం కారణంగా సింహ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే వ్యాపారాలు చేసేవారు విదేశి ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారు. దీంతో పాటు జీవిత భాగస్వామితో ఎంతో ఆనందంగా ఉంటారు. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. అలాగే ఆర్థిక సమస్యలున్నవారికి ఈ సమయంలో ఊహించని ధన లాభాలు కూడా కలుగుతాయి. 

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

వృషభ రాశి:

బృహస్పతి సంచారంతో వృషభ రాశివారికి కూడా అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో వీరికి వవాహాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఆర్థిక పరిస్థితులు కూగా మెరుగుపడే ఛాన్స్‌ ఉంది. దీంతో పాటు ఈ సమయంలో ఎలాంటి కొత్త పనులు ప్రారంభించిన ఊహించని విజయాలు సాధిస్తారు. అలాగే వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు కూడా దూరమవుతాయి. ఖర్చులు కూడా సులభంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. 

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

2024-04-18T05:12:59Z dg43tfdfdgfd