HEALTH TIPS: గోధుమపిండి కాకుండా ఈసారి ఈ పిండి ట్రై చేయండి.. రుచి ఆకాశంలో.. బరువు అదుపులో..

Healthy Flour‌ Snacks : ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా బోలెడు వంటలు చేస్తూ ఉంటాం. ముఖ్యంగా స్నాక్స్ టైంలో ఏం చేయాలి అని.. ఎప్పటికప్పుడు ఆలోచిస్తూనే ఉంటాం. ఆ టైంలో చపాతి, రోటి అని ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. కానీ ప్రతిసారి గోధుమ పిండి తోనే కాకుండా ఆరోగ్యవంతంగా ఉండటానికి వేరే పిండి కూడా వాడొచ్చు. అలా గోధుమపిండితో పాటు ఇంకా ఏమి వాడొచ్చో ఒకసారి చూసేయండి. 

రాగులు:

రాగులలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా రాగిగింజల్లో ఉండే కాల్షియం, ఐరన్, అమినో యాసిడ్స్ మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అది మన జీర్ణక్రియకి చాలా బాగా సహాయపడుతుంది. అంతేకాకుండా రాగుల్లో కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గించే శక్తి కూడా ఉంది. కాబట్టి, షుగర్ ఉన్నవారికి రాగులు దివ్య ఔషధంగా చెప్పుకోవచ్చు. రాగి పిండి కూడా చేసి దానితో ఇడ్లీ, దోశ వంటి టిఫిన్ కూడా వేసుకోవచ్చు. రాగితో స్వీట్ చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. 

సజ్జలు: 

సజ్జల్లో ఉండే మెగ్నీషియం ఫాస్ఫరస్ మన గుండె ఆరోగ్యానికి బాగా పనిచేస్తాయి. ముఖ్యంగా అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. మన రోగా నిరోధక శక్తిని పెంచుతాయి. సజ్జల వల్ల జీర్ణ సమస్యలు కూడా దూరం అవుతాయి. తేలికైన ఆహారం కాబట్టి త్వరగా జీర్ణం అవుతుంది. కానీ ఎక్కువ ఎనర్జీ ఇస్తుంది.

 

బుక్వీట్ పిండి:

బుక్వీట్ లో కూడా బోలెడు పోషకాలు దాగి ఉంటాయి. ముఖ్యంగా బుక్వీట్ గ్లూటెన్ పడని వారికి చాలా మంచిది. దీంట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే మెగ్నీషియం, ఐరన్ మన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జీర్ణక్రియని కూడా వేగవంతం చేస్తాయి. రోజంతా ఉండగలిగే శక్తిని కూడా ఇస్తుంది.

శనగపిండి: 

శనగపిండిలో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అవి కండరాల వ్యాధులను దూరం చేస్తాయి. ఆకలిని కంట్రోల్ చేసి షుగర్ లెవెల్స్ ని కూడా తగ్గిస్తాయి. కాబట్టి షుగర్ ఉన్నవారు కూడా శనగపిండిని భయం లేకుండా తినేయచ్చు. 

ఓట్స్:

ఓట్స్ లో పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే పొట్ట నిండుగా అనిపిస్తుంది. ఆరోగ్యానికి కూడా ఓట్స్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.  అందులో ఉండే మాంగనీస్, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు మన జీర్ణక్రియని మెరుగ్గా చేసి.. కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తాయి.

ఈసారి ఏదైనా స్నాక్స్ చేసేటప్పుడు.. ఇలాంటి వాటితో చేసుకుంటే రుచితో పాటు మంచి ఆరోగ్యం కూడా వస్తుంది.

Also read: Supreme Court: 'రాహుల్ గాంధీ' పేరుందని ఎన్నికల్లో పోటీ చేయోద్దంటే ఎలా ? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

2024-05-04T15:06:46Z dg43tfdfdgfd