HEALTHY RAGI SOUP: రాగి సూప్‌.. ఆరోగ్యవంతంగా.. రుచిగా ఇలా తయారుచేసుకోండి..

Healthy Ragi Soup: రాగిపిండితో మనం సాధారణంగా అంబలి, రాగి ముద్ద తయారు చేసుకుంటాం. ఆరోగ్యవంతమైన రాగి పిండితో సూప్‌ కూడా తయారు చేసుకోవచ్చు. ఎండకాలం రాగులను మన డైట్లో చేర్చుకోవాలి.

Healthy Ragi Soup: రాగిపిండితో మనం సాధారణంగా అంబలి, రాగి ముద్ద తయారు చేసుకుంటాం. ఆరోగ్యవంతమైన రాగి పిండితో సూప్‌ కూడా తయారు చేసుకోవచ్చు. ఎండకాలం రాగులను మన డైట్లో చేర్చుకోవాలి. దీంతో ఆరోగ్యం పుష్కలం ఆరోగ్యవంతమైన రాగి సూప్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు..

రాగి పిండి-1/2 కప్పు

నీళ్లు-2 కప్పులు

సన్నగా తరిగిన ఉల్లిపాయలు-1

ఆలీవ్ ఆయిల్-1TBSP

వెల్లుల్లి రెబ్బలు-2

క్యారట్-1

బంగాళదుంప-1

టమాట-1

వెజిటేబుల్ బ్రాత్ -4 కప్పులు

జీలకర్ర పొడి-1TBSP

ధనియాల పొడి-1TBSp

పసుపు-1/2 TBSP

ఉప్పు- రుచికి సరిపడా

ఇదీ చదవండి:  నిమ్మకాయ పులిహోర ఒకసారి ఇలా చేసి చూడండి.. అద్భుతమైన రుచి!

రుచికరమైన రాగి సూప్‌ తయారు చేసుకునే విధానం..

ఒక చిన్న బౌల్‌ తీసుకుని అందులో రాగిపిండిలో ఒక కప్పు నీరు వేసుకుని స్మూత్‌ పేస్ట్ చేయాలి. ఒక మందపాటి ప్యాన్ పెట్టి అందులో ఆలీవ్ ఆయిల్ వేసి వేడిచేయాలి. అందులో ఉల్లిపాయలు, వెల్లుల్లి వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత క్యారట్, ఆలుగడ్డ, టమాట కూడా వేసి ఓ 5 నిమిషాలపాటు వేయించుకోవాలి.

ఇప్పుడు అందులో వెజిటేబుల్ బ్రాత్ కూడా పోసుకుని ఒక కప్పు నీళ్లు కూడా పోయాలి. ఈ సూప్‌ మరిగించుకోవాలి. రాగి మిశ్రమాన్ని బాగా కలుపుతు ఉండాలి. ఉండలు కట్టకుండా బాగా కలపాలి. ఇప్పుడు జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, మిరియాల పొడి వేసుకుని బాగా కలపాలి.

ఇదీ చదవండి: మటన్‌ కుర్మా రిసిపీ.. ఈ రుచికరమైన కర్రీ ఎంతో టేస్టీగా ఉంటుంది..

ఆ తర్వాత మంట తగ్గించుకుని మూత పెట్టాలి. స్టవ్ సిమ్మర్‌ లో పెట్టి ఓ 20 నిమిషాలు ఉడికించుకోవాలి. కూరగాయలను బాగా ఉడికేవరకు మరిగించుకోవాలి. ఇప్పుడు సూప్ రుచి చూసుకోవాలి. వేడివేడిగా వడ్డించుకోవాలి రుచి బాగుంటుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

2024-04-25T11:00:26Z dg43tfdfdgfd