HOMEMADE SCRUBS TO SOFTEN HANDS: ఈ స్క్రబ్‌తో అందమైన చేతులు మీ సొందం.. మృదువుగా మారిపోతాయి..

Homemade scrubs to soften Hands: సాధారణంగా ముఖానికి మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. అయితే, చేతులను కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దీంతో అవి అందంగా కనిపిస్తాయి. ఇంట్లో తయారు చేసుకునే స్క్రబ్‌తో మీ చేతులు మరింత అందంగా కనిపిస్తాయి. అది ఎలానో తెలుసుకుందాం.కొన్ని రకాల స్క్రబ్స్‌ ఇంట్లో తయారు చేసుకుంటే మృదువైన చేతులు మీ సొంతమవుతాయి. 

ఆలివ్ ఆయిల్, చక్కెర..

రెండు టేబుల్ స్పూన్ల చక్కెరలో ఒక స్పూన్‌ ఆలివ్ ఆయిల్ కలపాలి. మీకు కావాలంటే ఏదైనా పరిమళభరితమైన నూనె కూడా కలుపుకోవచ్చు. వీటిని బాగా కలిపి చేతులకు మృదువుగా స్క్రబ్‌ చేసుకోవాలి. కాసేపైన తర్వాత గోరు వెచ్చని నీటితో హ్యాండ్‌ వాష్ చేసుకోవాలి.

ఇదీ చదవండి: పీచు పండు తింటే ఈ శక్తివంతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. గర్భిణులకు సుఖప్రసవం ఖాయం

ఓట్మీల్‌, తేనె..

ఒక బౌల్‌లో రెండు స్పూన్ల ఓట్స్, ఒక స్పూన్ తేనె కలుపుకోవాలి. ఈ రెండిటినీ బాగా పేస్ట్ మాదిరి కలుపుకోవాల్సి ఉంటుంది.  ఆ  తర్వాత ఈ స్క్రబ్‌ను చేతులపై స్క్రబ్ చేసుకోవాలి. దీన్ని సర్క్యూలర్‌ మోషన్లో చేతులపై మృదువుగా స్క్రబ్‌ చేయాలి. ఇది చేతులను ఎక్స్‌ఫోలియేట్‌ చేస్తుంది. ఆ తర్వాత కొంత సమయం తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

కాఫీ, కొబ్బరినూనె..

రెండు స్పూన్ల కాఫీ, ఒక టేబుల్‌ స్పూన్‌ కొబ్బరినూనె వేసి బాగా కలపాలి. ఇందులో బ్రౌన్ షుగర్ కలిపితే మంచి ఎక్స్‌ఫోలియేషన్‌ ఇస్తుంది. చేతులకు ఈ పేస్ట్‌ను మృదువుగా రుద్దుకోవాలి. ఆ తర్వాత హ్యాండ్ వాష్ చేసుకుని మాయిశ్చరైజర్ రాసుకోవాలి.

నిమ్మకాయ, ఉప్పు..

నిమ్మరసం ఒక కప్పలో పిండుకోవాలి ఇందులో రెండు టేబుల్‌ స్పూన్ల ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ స్క్రబ్‌ను మోచేతులకు కూడా సున్నితంగా రుద్దాలి. ఇది మంచి ఎక్స్‌ఫోలియేషన్ ఇస్తుంది. నిమ్మకాయలోని విటమిన్ సీ చర్మాన్ని మెరిపిస్తుంది. ఉప్పు, నిమ్మకాయ రెండూ కలిపి మసాజ్‌ చేస్తే చర్మాన్ని మరింత కాంతివంతం చేస్తుంది.

ఇదీ చదవండి: జామపండుతో 5 ఆరోగ్య ప్రయోజనాలు.. కేన్సర్‌కు చెక్‌

పెరుగు, బాదం స్క్రబ్..

రెండు టేబుల్‌ స్పూన్ల పెరుగుతోల ఒక బేబుల్ సూన్న సన్నగా కట్‌ చేసిన బాదం తీసుకోవాలి. ఇందులో కాస్త తేనె వేసి కలపాలి. ఈ స్క్రబ్ చేతులకు సర్క్యూలర్‌ మోషన్లో రుద్దాలి. కాసేపు ఇలానే మసాజ్‌ చేసి గోరువెచ్చని నీటితో చేతులను శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

2024-04-30T08:35:07Z dg43tfdfdgfd