KEERADOSA CHUTNEY: కీరాదోస పెరుగు పచ్చడి వేసవిలో తిన్నారంటే శరీరానికి ఎంతో చలువ, దీన్ని వండాల్సిన అవసరమే లేదు

keeradosa Chutney: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. శరీర ఉష్ణోగ్రత పెరగకుండా చూసుకోవాలంటే చలువచేసే ఆహారాలను తినాలి. శరీర ఉష్ణోగ్రత పెరిగింది... అంటే వడదెబ్బ తగలడం ఖాయం. మన శరీరానికి చలువచేసే ఆహారాలలో ఒకటి... అదే కీరాదోస పెరుగు పచ్చడి. వేసవిలో దీన్ని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పచ్చడి అనగానే రోట్లో వేసి రుబ్బేదో, మిక్సీలో వేసి తిప్పేదో కాదు. ఇది చక్కగా స్పూన్ వేసుకొని తినొచ్చు. దీన్ని తినే కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది. దీన్ని వండాల్సిన అవసరం లేదు.

కీరాదోస పెరుగు పచ్చడి రెసిపీ

కీరాదోస పెరుగు పచ్చడి చేయడం చాలా సులువు. కీరాదోసను తీసుకొని సన్నగా తురుముకోవాలి. అలాగే ఒక కప్పు పెరుగును తీసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులో పెరుగును వేసి బాగా గిలకొట్టాలి. ఆ పెరుగులోనే సన్నగా తురుముకున్న కీరా దోస ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, అల్లం తరుగు, పుదీనా తరుగు, క్యారెట్ తరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అలాగే జీలకర్రను వేసి కూడా బాగా కలపాలి. దీన్ని కొంతమంది కీరదోస రైతా అని కూడా పిలుస్తారు. దీన్ని తయారు చేసుకున్నాక స్పూన్ తో తినేస్తే చాలా రుచిగా ఉంటుంది. లేదా అన్నంలో కాస్త కలుపుకొని తిన్నా చలవ చేస్తుంది. ప్రతిరోజూ కనీసం ఒక చిన్న కప్పుతో ఈ కీరాదోస పచ్చడిని తినేందుకు ప్రయత్నించండి. ఇది ఎంతో ఆరోగ్యకరం.

దక్షిణ భారతదేశ సంప్రదాయ వంటకాల్లో కీరాదోస పెరుగు పచ్చడి ఒకటి. దోసకాయ పెరుగుపచ్చడికి తాళింపు కూడా వేసుకోవచ్చు. దోసకాయలో నీరు సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి డిహైడ్రేషన్ సమస్య రాకుండా అడ్డుకుంటుంది. అలాగే దీనిలో విటమిన్ కే, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. పెరుగులో ప్రోటీన్, క్యాల్షియం, ప్రోబయోటిక్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కలిసి జీర్ణక్రియకు పేగు ఆరోగ్యానికి సహాయపడతాయి.

కీరాదోస పెరుగు పచ్చడితో ఆరోగ్యం

కీరాదోస పెరుగు పచ్చడిలో కొవ్వు తక్కువగా ఉంటుంది. కేలరీలు తక్కువే... కాబట్టి ఎంత తిన్నా మీరు బరువు పెరగరు. ఇది తిన్న వెంటనే కాస్త రిఫ్రెష్ గా అనిపిస్తుంది. ఈ కీరాదోస పెరుగు పచ్చడి తినడం వల్ల పొటాషియం, మెగ్నీషియం, ఎలక్ట్రోలైట్స్ అధికంగా అందుతాయి. వేడి వాతావరణంలో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఇవి సహాయపడతాయి. దోసకాయ పచ్చడిలో అల్లం, కరివేపాకు వంటి వాటితో కలిపి తింటే ఎంతో మంచిది. ఇవి జీర్ణ అసౌకర్యం కలగకుండా అడ్డుకుంటాయి. దోసకాయ పెరుగు కలయిక వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు లభిస్తాయి. శరీరంలో ఇన్ఫ్లమే షన్ లేకుండా అడ్డుకుంటాయి. తేమను బయటికి పోకుండా కాపాడతాయి. దోసకాయ పచ్చడి తినడం వల్ల నోటి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. దోసకాయలో సహజంగానే యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి. ఇవి హానికరమైన బ్యాక్టీరియాను చంపడానికి సహాయపడతాయి. శ్వాస, నోరూ తాజాగా అనిపిస్తుంది.

దోసకాయ పెరుగు పచ్చడి తినడం వల్ల మూత్ర విసర్జన సవ్యంగా జరుగుతుంది. శరీరం నుండి వ్యర్ధాలు, విషాలు బయటకు పోతాయి. దోసకాయలు సోడియం తక్కువగా ఉంటుంది. పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు ఈ కీరాదోస పెరుగుపచ్చడిని కచ్చితంగా తినాలి. దోసకాయలో నీటి కంటెంట్ అధికంగా ఉంటుంది. కాబట్టి చర్మాన్ని లోపల నుండి హైడ్రేట్ చేస్తుంది. దీనివల్ల చర్మం రంగు పెరుగుతుంది. ముఖ్యంగా వేసవిలో డిహైడ్రేషన్ సమస్య రాకుండా ఉంటుంది. దోసకాయ పచ్చడిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి, ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ కాలం పాటు ఇవి పొట్ట నిండుగా ఉండేలా చేస్తాయి. బరువును అదుపులో ఉంచుతాయి.

2024-04-18T06:12:52Z dg43tfdfdgfd