LAXMI DEVI: మే 10న ఈ పని చేస్తే లక్ష్మీ దేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది.. కనక వర్షమే

ఈ సంవత్సరం అక్షయ తృతీయ శుక్రవారం మే 10న జరుపుకోనున్నారు. అక్షయ తృతీయ రోజు లక్ష్మీ దేవికి సంబంధం ఉంటుంది. అందుకే ఈ రోజున లక్ష్మీ దేవికి పూజలు చేసి ఆమె ఆశీర్వాదం కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటారు. లక్ష్మీ దేవి అనుగ్రహం వల్ల లభించే సంపద ఎప్పటికీ కోల్పోకుండా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తారు.ఐతే లక్ష్మి దేవిని అక్షయ తృతీయ రోజు పూజించడం వలన కుటుంబ సభ్యులు ఎల్లవేళలా సుఖశాంతులు, సంతోషం, సంపద, ఆస్తి, శ్రేయస్సుతో నిండి ఉంటారని అర్చకులు రాపెల్లి వామన శర్మ లొకల్ 18కు తెలిపారు.

ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నివసించాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలను చేస్తారు. అక్షయ తృతీయ రోజున ఏ పని చేసినా దాని ఫలితాలు శాశ్వతంగా ఉంటాయని.. సిరి సంపదల్లో ఎలాంటి తగ్గుదల ఉండదని విశ్వసిస్తారు.అందుకే అక్షయ తృతీయ రోజు బంగారం కొంటె సాక్షత్తు లక్ష్మి దేవి ఇంటికి వచ్చిందని పూజిస్తారు.. కాబట్టి అక్షయ తృతీయ రోజున బంగారం,కాని వెండి, కానీ తప్ప కుండా కొనుకుంటే అంత మంచిదని అంటున్నారు అర్చకులు వామన శర్మ.

రేషన్ కార్డు ఉండి 18 ఏళ్లు నిండిన వారికి అదిరే శుభవార్త.. ఉచితంగానే..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అక్షయ తృతీయ రోజున లక్ష్మి తల్లిని కుంకుమ, పసుపుతో పూజించాలి.ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. దీంతో పాటు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. డబ్బు వచ్చే మార్గాలు తెరుచుకుంటాయి అని అంటున్నారు అర్చకులు. మీరు అక్షయ పుణ్యాన్ని పొందాలనుకుంటే, అక్షయ తృతీయ రోజున నీటితో నింపిన కలశం దానం చేయండి. అలాగే కలశాన్ని దానం చేసే ముందు అందులో గంగాజలం కలపాలి. అప్పుడు కలశాన్ని బ్రాహ్మణుడికి లేదా పేదవారికి దానం చేయండి.

ప్రజలకు చల్లటి కబురు.. ఈ జిల్లాల్లో వర్షాలు, ఎప్పటి నుంచంటే..

పురాణాల ప్రకారం, బ్రహ్మదేవుని కుమారుడు అక్షయ్ కుమార్ వైశాఖ మాసం శుక్ల తృతీయ నాడు జన్మించాడు. అప్పటి నుండి ఈ రోజును అక్షయ తృతీయ అని పిలుస్తారు. అందుకే ఈ రోజున పూర్వీకులకు నైవేద్యం పెట్టి శ్రాద్ధం చేస్తే సుఖసంతోషాలు, ఐశ్వర్యం లభిస్తాయి. దీంతో పాటు పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి. మరోవైపు, ఈ రోజున బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి.మరి శుభ పరిణామాలు కలుగుతాయట.

2024-05-04T10:22:55Z dg43tfdfdgfd