LEMON HOT WATER: వేడి నీళ్లలో నిమ్మకాయ కలిపి తాగితే... ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Lemon And Hot Water Benefits: ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ రసం, గోరువెచ్చని నీటిలో కలుపుకొని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.   

lemon and hot water benefits: ప్రతిరోజు ఉదయం పరగడుపున గోరు వెచ్చని నీరు తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు పొందవచ్చు. ముఖ్యంగా వేడి నీటిలో కొద్దిగా నిమ్మరసం తీసుకోవడం వల్ల కలిగే లాభాలు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మనలో చాలా మందికి ఉదయాన్నే వేడినీళ్లను తాగే అలవాట్ల ఉంటుంది. వేడి నీళ్లు తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే కేవలం వేడి నీళ్లు మాత్రమే కాకుండా నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు ఉంటాయి. నిమ్మకాయలో ఉండే విటమిన్‌ సి, ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. 

ఉదయాన్నే ఒక గ్లాస్‌ గోరువెచ్చని నీటిలో నిమ్మకాయతో పాటు ఉప్పు లేదా తేనెను కలుపుకొని తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. ఈ వాటర్ తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు జరుగుతాయి. ముఖ్యంగా అధిక బరువు సమస్యలతో బాధపడేవారు ఈ వాటర్‌ను తప్పకుండా తీసుకోవడం వల్ల అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఈ వాటర్‌ శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో ఎంతో సహాయపడుతుంది. 

అంతేకాకుండా ఈ వాటర్‌ చర్మం ఆరోగ్యంగా ఉంచడంలో కూడా ఉపయోగపడుతుంది. నిమ్మరసంను గోరువెచ్చని నీటిలో కలుపుకొని తీసుకోవడం వల్ల మొటిమలు, మచ్చలు, నల్ల మచ్చలు తగ్గుతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. 

వేసవిలో చాలా మంది డీహైడ్రేషన్ సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. ఈ సమయంలో చల్లటి పానీయం కంటే ఈ లెమన్, హట్‌ వాటర్‌ ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల బాడీ హైడ్రేట్‌గా ఉంటుంది. అలాగే రీఫ్రెష్‌మెంట్‌ గా కూడా ఉంటుంది.

గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ రసం తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్‌ మెరుగుపడుతుంది. అలాగే సీజనల్‌ వ్యాధులను తగ్గించడంలో కూడా ఎంతో సహాయపడుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అలాగే అంటువ్యాధులు, ఇతర రోగాల నుంచి బయట పడటంలో సహాయపడుతుంది. 

ఆధునిక జీవనశైలిలో మారిన ఆహార అలవాట్ల కారణంగా చాలా మంది ఎసిడిటీ, గ్యాస్‌, అజీర్ణం, మలబద్ధం వంటి సమస్యలతో  ఇబ్బంది పడుతుంటారు. కానీ ఈ గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ రసం తీసుకోవడం వల్ల ఈ సమస్యలు అన్ని మాయం అవుతాయి. ఈ వాటర్ గ్యాస్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 

ఈ విధంగా లెమన్‌ వాటర్ ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. మీరు కూడా ఈ వాటర్‌ను ప్రతిరోజు తీసుకోవడం మంచిది.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

2024-05-03T10:17:10Z dg43tfdfdgfd