LUCKY RASI PHALALU: ఒకే రాశిలోకి రాహు, కుజ గ్రహాలు.. ఈ రాశుల వారికి డబ్బే, డబ్బు!

Rahu And Mars Conjunction: ఎంతో ప్రత్యేకమైన రాహు, కుజ గ్రహాలు మీనరాశిలో కలవబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.

 

Rahu And Mars Conjunction: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 9 గ్రహాలు ఒక రాశి నుంచి ఒక రాశికి సంచారం చేయడం కారణంగా ఎంతో ప్రత్యేకమైన ప్రభావం ఏర్పడుతూ ఉంటుంది. దీని కారణంగా జాతకంలో గ్రహాలు శుభస్థానంలో ఉన్నవారికి ప్రయోజనాలు, అశుభ స్థానంలో ఉన్నవారికి దుష్ప్రభావాలు కలుగుతూ ఉంటాయి. అయితే కొన్ని శక్తివంతమైన గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశి సంచారం చేసినప్పుడు మాత్రం దాని ప్రభావం జాతకాలపై సుదీర్ఘంగా కొనసాగుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన రాహువు గ్రహం మీన రాశిలో సంచార దశలో ఉండగా.. అయితే ఇదే రాశిలోకి కుజుడు సంచారం చేశాడు. దీని కారణంగా ఎంతో శక్తివంతమైన రెండు గ్రహాలు కలిసాయి.

ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా ఎంతో శక్తివంతమైన ప్రభావం ఏర్పడింది. ఈ ప్రభావంతో కొన్ని రాశుల వారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే ఎప్పటినుంచో సమస్యలతో బాధపడుతున్న కొన్ని రాశుల వారికి ఈ సమయంలో పరిష్కారం లభించబోతోంది. అలాగే రాహువు కుజ గ్రహాలు మీన రాశిలో కలవడం కారణంగా కొన్ని సందర్భాల్లో ప్రత్యేక యోగాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఈ యోగాలు కూడా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా మారుతాయి. 

కర్కాటక రాశి:

ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా కర్కాటక రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్నవారు ఈ సమయంలో విపరీతమైన ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా కార్యాలయాలు మారే అవకాశాలు కూడా ఉన్నాయి. దీని కారణంగా ప్రమోషన్స్ కూడా పొందవచ్చు. అలాగే జీవితం కూడా ఎంతో ఆనందకరంగా సంతోషమయం అవుతుంది.

సింహరాశి:

కుజుడు రాహు గ్రహాల కలయిక కారణంగా సింహ రాశి వారికి విపరీతమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీరు ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన అనుకూలంగా ఉంటుంది. ఎప్పటినుంచో విదేశాలకు వెళ్లాలనుకునే వారి కళ సులభంగా నెరవేరుతుంది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

కుంభరాశి:

ఈ రెండు గ్రహాలు కలయిక కారణంగా ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనం లభించబోతోంది. అలాగే వీరికి ఆకస్మిక ధన లాభాలు కూడా కలుగుతాయి. ముఖ్యంగా విద్యార్థులకు ఈ సమయంలో అనుకున్న పనులు జరుగుతాయి.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

2024-05-02T17:59:34Z dg43tfdfdgfd