MEMORY AFFECTS THE BRAIN : ఒక్కో జ్ఞాపకం ఒక్కో బ్రెయిన్​ సెల్​ని కరాబ్ చేస్తుందట.. న్యూ స్టడీలో షాకింగ్ విషయాలు

Lasting Memories Come at a Cost : జ్ఞాపకాలే సంతృప్తినిస్తాయని అంటారు కానీ.. ఇప్పుడు ఆ జ్ఞాపకాలే మెదడుకు హాని కలిగిస్తున్నాయట. మనం చూసిన వస్తువునో.. విన్నమాటనో.. చేసే పనినో గుర్తుపెట్టుకుని పని చేస్తూ ఉంటాము. అమ్మో ఇది ఎలా అయినా గుర్తుపెట్టుకోవాలని మీరు ట్రై చేసిన ప్రతిసారి మీ మెదడు కణాలు దెబ్బతింటున్నాయని మీకు తెలుసా? తాజా అధ్యయనం ఇదే చెప్పింది. మనం కొత్త జ్ఞాపకాలు ఏర్పచుకున్న ప్రతిసారి.. అది మెదడు కణాలపై ప్రతికూలంగా ప్రభావం చూపిస్తుందని గుర్తించారు. మరి ఈ కొత్త అధ్యయనం సంగతులేంటో చూసేద్దాం. 

మెదడుపై ప్రతికూల ప్రభావం..

న్యూయార్క్​లోని ఆల్బర్ట్ ఐన్​స్టీన్ కాలేజ్ ఆఫ్ మెడిసన్​కు చెందిన న్యూరో సైంటిస్ట్​లు ఎలుకపై కొన్ని ప్రయోగాలు చేశారు. దీనిలో భాగంగా మనం కొత్తగా ఏదైనా గుర్తు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తే.. అది మెదడుపై ప్రతికూలంగా ప్రభావం చూపి.. మెదడుకణజాలానికి హాని చేస్తున్నట్లు గుర్తించారు. ఇది మెదడులోని హిప్పోకాంపస్​లో జరుగుతున్నాయని కనుగొన్నారు. దీనిని జ్ఞాపకాలను ప్రాథమికంగా నిల్వ ఉంచే లాకర్​గా చెప్తారు. కానీ మెదడులోని హిప్పోకాంపల్ ప్రాంతంలోని కొన్ని న్యూరాలన్లపై ప్రభావం చూపి.. మెదడు కణజాలాన్ని ఇబ్బంది పెడుతున్నట్లు గుర్తించారు. 

వారంపాటు కొనసాగిన పరిశోధనలు

ఈ పరిశోధనలో ఉపయోగించిన ఎలుకలలోని ఇన్​ఫ్లమేటరీ ఎడిటింగ్ మెకానిజమ్ వారం పాటు కొనసాగయట. ఆ తర్వాత మెమరీ నిల్వ చేసే న్యూరాన్లు నిరోధకతని చూపించినట్లు కనుగొన్నారు. ఎలుకలు మానవ మెదడును పోలి ఉంటాయి కాబట్టి.. మానవ మెదడులో కూడా ఇలాంటిదేదో జరిగే అవకాశముందని తెలిపారు. జ్ఞాపకాలను ఎన్కోడ్ చేసే న్యూరాన్లు.. ఇప్పటికే తాము సంపాదించిన సమాచారాన్ని భద్రపరచాలి. కానీ కొత్త ఇన్​పుట్​ల ద్వారా పరధ్యానంలోకి వెళ్లిపోయే అవకాశముందని వెల్లిడించారు. 

జ్ఞాపకాలను ట్రిగర్ చేసేందు ఎలక్ట్రిక్ షాక్

న్యూరాన్లు దీర్ఘకాలిక జ్ఞాపకాలను చేయడానికి చాలా అవసరమని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మనం నిత్యం తెలిసో తెలియకుండా ఏదొక సమాచారాన్ని మెదడుకు చేరవేస్తాము. కాబట్టి ఈ విషయంలో మరిన్ని పరిశోధనలు చేయాలంటున్నారు. ఎలుకల జ్ఞాపకాలను ట్రిగర్ చేయడానికి వాటికి తేలికపాటి విద్యుత్ షాక్​లు ఇచ్చారని తెలిపారు. ఆ సమయంలోనే న్యూరాన్​లపై విశ్లేషణ చేశామని.. అప్పుడే ఇన్​ఫ్లమేటరీ సిగ్నలింగ్​కు సంబంధించిన ముఖ్యమైన గ్రాహక మార్గాలలో జన్యువులు క్రియాశీలతను చూపించినట్లు వెల్లిడించారు. కొత్త జ్ఞాపకాల వల్ల మెదడు కణజాలంపై ఎక్కువ ప్రభావం పడి.. అది మెదడు న్యూరాన్​ల వాపునకు దారి తీస్తుందని తెలిపారు. ఇది అల్జీమర్స్, పార్కిన్సన్స్ వ్యాధి వంటి నాడీ సంబంధిత సమస్యలకు దారి తీస్తుందని న్యూరో సైంటిస్ట్​లు తెలిపారు. 

దీర్ఘకాలికంగా ఏదైనా గుర్తుపెట్టుకునే ప్రక్రియను మెదడుపై చూపిస్తే.. దానివల్ల నాడీ కణాలలో DNA దెబ్బతింటుందని కొత్త అధ్యయనం తెలిపింది. మెదడులోని డీఎన్​ఏ తరచూ విచ్ఛిన్నమవుతాయి. అయినా సరే అవి త్వరగానే మరమ్మత్తులు అవుతాయి. అయితే సాధారణంగా డీఎన్​ఏ విచ్ఛిన్నమవడం అనేది.. జ్ఞాపకాల వల్ల అవుతున్నా.. అది లేట్​గానే అవుతున్నట్లు గుర్తించారు. అయితే కొత్త జ్ఞాపకాల సంగతేమో కానీ.. ఉన్న మెదడు కరాబ్ అవుతుందని చెప్తున్నారు. కానీ జ్ఞాపకశక్తి అనేది ఎంత అవసరమో అందరికీ తెలిసిందే. అందుకే పరిణామం సమయంలో హిప్పోకాంపల్​ న్యూరాన్లు రోగనిరోధక ప్రతిస్పందన డీఎన్​ఏ సెన్సింగ్ మార్గాన్ని.. డీఎన్​ఏ రిపేర్ సెంట్రోసోమ్​ ఫంక్షన్​తో కలపడం ద్వారా కణాలపై ప్రభావం పడకుండా ఈ రోగనిరోధకత ఆధారిత మెమరీ మెకానిజం హెల్ప్ చేస్తుందని తెలిపారు. అయితే దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

Also Read : సమ్మర్​లో పుదీనా నీరు తాగితే ఎన్ని ప్రయోజనాలో.. బరువు, వేడిని తగ్గించుకునేందుకు ఇలా చేసేసుకోండి

2024-04-24T09:35:54Z dg43tfdfdgfd