MERCURY TRANSIT 2024: త్వరలో ఈ 3 రాశులవారిని బుధుడు ధనవంతులు చేయబోతున్నాడు.. మీది ఉందా?

Budh Gochar In Gemini 2024: మెసెంజర్ ఆఫ్ గాడ్ గా పిలువబడే బుధుడు కదలికలు మనిషి జీవితాన్ని తీవ్ర ప్రభావితం చేస్తాయి. మెర్క్యూరీ మార్పు కొందరికి అనుకూలంగానూ, మరికొందరికి ప్రతికూలంగానూ ఉంటుంది. జూన్ నెలలో బుధుడు తన రాశిని మార్చబోతున్నాడు. ప్రస్తుతం ఉన్న రాశిని విడిచిపెట్టి తన సొంత రాశి అయిన మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడి యెుక్క ఈ మార్పు కారణంగా కొందరి జీవితాల్లో పెను మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. వారు ఇంతకముందు ఎన్నడూ చూడని ప్రయోజనాలను పొందుతారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 

కుంభ రాశి

మెర్క్యురీ సంచారం కుంభ రాశి వారికి అనుకూల ఫలితాలను ఇస్తుంది. ఏదైనా పని లేదా వ్యాపారం మెుదలుపెట్టడానికి ఇదే అనుకూల సమయం. మీ లవ్ సక్సెస్ అయి.. అది పెళ్లికి దారితీస్తుంది. మీ కోరికలను బుధుడు నెరవేరుస్తాడు. మీకు సంతానసుఖం కలుగుతుంది. మీరు కెరీర్ కు సంబంధించిన శుభవార్తను వింటారు. మీకు అదృష్టం కలిసి వచ్చి మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. 

తుల రాశి

బుధుడు రాశి మార్పు తులరాశికి చెందిన వ్యక్తులకు లాభదాయకంగా ఉంటుంది. మీ వెంటే అదృష్టం ఉంటుంది. పెళ్లికానీ యువతీ యువకులకు కోరుకున్న వ్యక్తులతో వివాహం జరుగుతుంది. మీ కీర్తి నలుదిక్కులకూ వ్యాపిస్తుంది. దారిద్ర్యం దూరమవుతుంది, ధనలక్ష్మీ తాండవిస్తోంది. మీరు కెరీర్ కోసం వేసుకున్న ప్రణాళికలన్నీ విజయవంతమవుతాయి. మెుత్తానికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. 

మకర రాశి

మిథునరాశిలోకి బుధుడి ప్రవేశం మకరరాశి వారికి మున్నపెన్నడూ చూడని లాభాలను ఇస్తుంది. మీ కెరీర్ రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. ఆగిపోయిన ప్రమోషన్ వెతుక్కుంటూ మరి వస్తుంది. నిరుద్యోగుల కల ఫలిస్తుంది. మీరు కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఫారిన్ కు వెళ్లాలన్న మీ కోరిక నెరవేరుతుంది. మీరు కోరుకున్న వారినే వివాహం చేసుకుంటారు.

Also Read: Swapna Shastra: మీకు నిద్రలో అలా జరిగినట్లు కల వచ్చిందా.. గొప్ప అదృష్ట యోగం.. జ్యోతిష్యులు ఏమంటున్నారంటే..\

Also read: Jupiter and Venus Conjunction 2024: గురు, శుక్ర గ్రహాల కలయిక.. ఈ రాశువారికి లాభాలే లాభాలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

2024-05-02T13:28:57Z dg43tfdfdgfd