MONEY ASTROLOGY: వీరికి అన్ని పనుల్లో ఏకాగ్రత అవసరం

Money Astrology (ధన జ్యోతిషం): (Bhoomika Kalam: భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) జ్యోతిష్యులు గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా రాశి ఫలాలు, ధన జ్యోతిష్యం ఫలితాలు చెబుతారు. ఏప్రిల్ 25వ తేదీ, గురువారం నాటి ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలించండి.

మేషం (Aries):

ఈరోజు మీరు వ్యాపారంలో కొత్త అవకాశాలను పొందుతారు. కాబట్టి మీ పనిపై దృష్టి పెట్టండి. బిజినెస్‌లో కొత్త లాభాలు పొందే అవకాశం ఉంది. అకౌంటింగ్‌లో పారదర్శకత అవసరం.

పరిహారం: - గాయత్రీ మంత్రాన్ని 108 సార్లు జపించండి.

వృషభం (Taurus):

ఈరోజు వ్యాపారంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి మరింత కష్టపడాలి. కష్టపడి సమస్యలను పరిష్కరించుకుంటారు.

పరిహారం:- వినాయకునికి దూర్వా సమర్పించండి.

మిథునం (Gemini):

వ్యాపార వ్యవహారాల్లో సమస్యలు అలాగే ఉంటాయి. ప్లానింగ్ ప్రకారం మీ పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఉద్యోగుల గాసిప్స్‌ నమ్మవద్దు, మీ సొంత సామర్థ్యంపై నమ్మకం ఉంచండి.

పరిహారం:- హనుమంతునికి కొబ్బరికాయను సమర్పించండి.

కర్కాటకం (Cancer):

వ్యాపార విస్తరణ గురించి ప్లాన్ చేసి, దాని అమలుపై తీవ్రంగా పని చేయండి. ప్రస్తుత గ్రహ స్థానం అనుకూలంగా ఉంటుంది. మార్కెటింగ్, ప్రజా సంబంధాల పరిధిని విస్తరించాల్సిన అవసరం ఉంది. ఆఫీసు పనులు ఇంట్లో కూడా చేయాల్సి రావచ్చు.

పరిహారం:- దుర్గమ్మకు ఎర్రని చున్రీ నైవేద్యంగా పెట్టండి.

సింహం (Leo):

వ్యాపారంలో చాలా సీరియస్‌గా పని చేయాల్సిన అవసరం ఉంది. మీ ప్లాన్లు అన్నింటినీ పునఃపరిశీలించాల్సిన సమయం ఇది. ఏదైనా పెద్ద లేదా చిన్న నిర్ణయం తీసుకునేటప్పుడు పెద్దల సలహా, గైడెన్స్ తీసుకోవడం అవసరం.

పరిహారం:- చిన్నారులకు ఖీర్ తినిపించండి.

కన్య (Virgo):

ఏదైనా వ్యాపార సంబంధిత ప్రయాణం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. దాని వల్ల మంచి ఫలితాలు కూడా వస్తాయి. ఆస్తి సంబంధిత వ్యాపారంలో పెద్ద డీల్ ఉండవచ్చు. అజాగ్రత్త, దాతృత్వం వ్యాపారానికి హానికరం. ఈ సమయంలో ఏకాగ్రతతో ఉండటం ముఖ్యం.

పరిహారం:- అరటి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించండి.

తుల (Libra):

పేమెంట్స్ లేదా అప్పుగా ఇచ్చిన డబ్బు ఈ రోజు తిరిగి ఇస్తారు. పని చేసే ప్రాంతంలో మీ సత్తా చూపించే అవకాశం మీకు లభిస్తుంది. వ్యక్తులతో సంబంధాలు బలంగా ఉంటాయి. ఆఫీసులో ఫైల్ వర్క్ చేస్తూ పొరపాటు పడే అవకాశం ఉంది.

పరిహారం:- లక్ష్మీదేవికి తామరపూలు సమర్పించండి.

వృశ్చికం (Scorpio):

వ్యాపారాన్ని విస్తరించే ప్లాన్లు ఫలవంతం కావడానికి ఇది సరైన సమయం. ప్రభుత్వ పనులకు సంబంధించిన పేపర్లు, డాక్యుమెంట్లు చదవకుండా సంతకం చేయవద్దు. అధికారిక ప్రయాణం గురించి ఒక ఆర్డర్ కూడా అందుకోవచ్చు.

పరిహారం:- నూనెతో చేసిన ఇమర్తిని నల్ల కుక్కకు ఇవ్వండి.

ధనస్సు (Sagittarius):

మీ ప్లాన్లపై పనిచేయడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. కొత్త పనులు కూడా ప్రారంభమవుతాయి. ఉద్యోగస్తులు అధికారులతో సత్సంబంధాలు కలిగి ఉండాలి. ప్రమోషన్ అవకాశాలు కూడా క్రియేట్ అవుతున్నాయి.

పరిహారం:- శారీరక వికలాంగులకు సేవ చేయండి.

మకరం (Capricorn):

పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లో సామరస్యాన్ని కాపాడుకోండి. ఇది మీ వ్యాపారాన్ని ప్రభావితం చేయవచ్చు. వ్యాపారంలో పెద్ద డీల్ లేదా ఆర్డర్ పొందే అవకాశం ఉంది. కాబట్టి మీ పరిచయాలు, మూలాలను మరింత బలోపేతం చేయండి. రిస్క్ ఉండే పని పట్ల ఆసక్తి చూపవద్దు.

పరిహారం:- పంచదార కలిపిన పిండిని చీమలకు తినిపించండి.

కుంభం (Aquarius):

బిజినెస్ అడ్వాన్స్ టెక్నాలజీకి సంబంధించిన ప్లాన్ల గురించి సమాచారం అందుబాటులో ఉంటుంది. కొత్త యంత్రాలు లేదా కొత్త టెక్నాలజీ మొదలైన వాటిని ఉపయోగించడంలో విజయం సాధిస్తారు. ఏదైనా ఫీల్డ్‌లో కొత్తగా సక్సెస్ అవుతారు.

పరిహారం:- చేపలకు ఆహారం ఇవ్వండి.

మీనం (Pisces):

బిజినెస్ ప్రాజెక్ట్‌కు సంబంధించి సమస్యలు తలెత్తవచ్చు. అయితే మీరు వాటిని తెలివిగా మేనేజ్ చేయగలరు. వ్యాపారంలో ఉత్పత్తితో పాటు మార్కెటింగ్ సంబంధిత పనులపై శ్రద్ధ పెట్టడం అవసరం.

పరిహారం:- సూర్య భగవానుని ఆరాధించండి.

Disclaimer:

ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.

2024-04-24T22:15:19Z dg43tfdfdgfd