MOST STOLEN ITEM: ప్రపంచంలో ఎక్కువగా దొంగతనానికి గురవుతున్న వస్తువు ఏమిటో తెలుసా? తెలిస్తే ఆశ్చర్యపోతారు

Most stolen item: ప్రతి దేశంలోనూ దొంగతనాలు జరగడం సహజం. ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ ప్రతి రోజూ ఏదో ఒకచోట దొంగతనాలు జరుగుతూనే ఉంటాయి. అయితే అన్ని దొంగతనాల్లోనూ ఎక్కువగా దోపిడీకి గురవుతున్న వస్తువు ఏదో తెలిస్తే ప్రతి ఒక్కరికీ ఆశ్చర్యం వేస్తుంది. అందరూ బంగారమో, వెండో, డబ్బులో దొంగతనానికి గురవుతూ ఉంటాయని భావిస్తారు. ఈ మూడింటికీ మించి చీజ్ అధికంగా దొంగతనానికి గురవుతోంది... అనేక దేశాల్లో చీజ్‌ను దొంగలిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది.

నెదర్లాండ్స్‌లోని ఓ షాపు నుంచి 17 లక్షల విలువ చేసే చీజ్ లారీలతో వచ్చి ఎత్తుకెళ్లిపోయారు. చీజ్ ఎంతగా వినియోగిస్తారో అంతగా కొరత కూడా ఏర్పడుతోంది. అందుకే చీజ్ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

పాశ్చాత్య దేశాల్లో చీజ్ అమ్మకాలు వాడకం ఎక్కువ. ఏ షాపుకు వెళ్లిన చీజ్‌ను దొంగిలించే వారు ఉంటూనే ఉంటారు. అంతే కాదు దొంగిలించిన చీజ్‌ను ఈజీగా ఆన్లైన్లో అమ్మి... డబ్బులు చేసుకుంటున్నారు. అలాగే బ్లాక్ మార్కెట్లో చీజ్‌ను అమ్మే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది.

ప్రపంచంలో ఎక్కువగా దొంగతనానికి గురవుతున్న ఉత్పత్తుల్లో చీజ్ మొదటి స్థానంలో ఉండగా, తర్వాతి స్థానంలో మాంసం ఉంది. ఇక మూడో స్థానంలో చాక్లెట్, నాలుగో స్థానంలో ఆల్కహాల్ ఉన్నాయి.

చీజ్‌ను మనం తక్కువగానే వినియోగిస్తున్నా... పాశ్చాత్య దేశాల్లో మాత్రం ఇది రోజువారీ ఆహారం. చీజ్ ఉంటేనే వారి బ్రేక్ ఫాస్ట్ పూర్తవుతుంది. అందుకే కొన్ని వందల కోట్ల రూపాయల మార్కెట్ చీజ్ మీదే నడుస్తోంది. ప్రతి ఏడాది ఉత్పత్తి చేసే చీజ్‌లో నాలుగు శాతం దోపిడీకే గురవుతోంది. 43 దేశాల్లో ఎక్కువగా చీజ్‌ను దొంగిలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక అమెరికాలో చీజ్ వాడకం చాలా ఎక్కువ. దాదాపు 25 బిలియన్ల డాలర్ల చీజ్‌ను అక్కడ ఉన్న ప్రజలు తినేస్తారు.

పాలలో ఉండే ప్రోటీన్ కేసైన్ వల్ల చీజ్ తయారవుతుంది. ఇది ఇప్పుడే కాదు వందల ఏళ్ల నాటి నుంచి ఆహారంలో భాగమై ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. దేశాల్లో ప్రతి వ్యక్తి ఏడాదికి 25 కిలోల చీజ్ ను సులువుగా తినేస్తున్నారు.

చీజ్ లో అనేక రకాల ఉన్నాయి. చెద్దార్ చీజ్, మోజారెలా చీజ్, స్మోక్డ్ చీజ్... ఇవన్నీ కూడా చీజ్ రకాలు. కాస్త ఉప్పుగా ఉండే చీజ్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బ్రెడ్ పై ఈ చీజ్‌ను చల్లుకొని కాస్త వేడి చేసి తింటే రుచి అదిరిపోతుంది.

2024-04-16T09:10:04Z dg43tfdfdgfd