MOTHERS DAY: అమ్మకు ప్రత్యేకమైన బహుమతి ప్లాన్ చేస్తున్నారా? ఈ 5 గిఫ్ట్స్ చాలా బెటర్..

మాతృ దినోత్సవం సమీపిస్తున్న సందర్భంగా, అమ్మకు ప్రత్యేకంగా ఏదైనా బహుమతి ఇవ్వాలని ఆలోచిస్తున్నారా? కానీ, ఖరీదైన బహుమతులు కొనేంత బడ్జెట్ లేక నిరాశ పడిపోతున్నారా! చింతించాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే అమ్మకు నచ్చేలా, ఆమెకు ఉపయోగకరంగా ఉండే టెక్ గ్యాడ్జెట్లను తక్కువ ధరలకే కొనుగోలు చేసి బహుమతిగా ఇవ్వవచ్చు. మరి బడ్జెట్‌కు సరిపోయే ఆ అద్భుతమైన టెక్ గ్యాడ్జెట్స్‌ ఏవో తెలుసుకుందాం.

హానర్ X9b 5G స్మార్ట్‌ఫోన్

హానర్ X9b 5G స్మార్ట్‌ఫోన్ ధర 8GB RAM + 256GB ROM వేరియంట్‌ రూ.21,999కి లభిస్తుంది. మంచి మొబైల్ ఫోన్‌ని అమ్మకు గిఫ్టుగా ఇవ్వవచ్చు. ఇందులో 5800mAh బ్యాటరీ, 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్‌ 6 Gen 1 చిప్‌సెట్, MagicOS 7.2 (ఆండ్రాయిడ్ 13), అడ్రెనో 710 GPU వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో వస్తుంది. ఇందులో 108MP మెయిన్ సెన్సార్, 5MP అల్ట్రావైడ్ లెన్స్, 2MP మాక్రో లెన్స్ ఉంటాయి. 16MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా సెల్ఫీలకు వీడియో కాల్స్‌కు బాగుంటుంది.

జెబ్రానిక్స్ జెబ్-సౌండ్ ఫీస్ట్ 500

దీని ధర కేవలం రూ.3,797 మాత్రమే. పోర్టబుల్, వాటర్‌ప్రూఫ్ స్పీకర్ నచ్చితే దీన్ని అమ్మకు బహుమతిగా ఇవ్వవచ్చు. ఇందులో 70 వాట్ల శక్తితో రెండు 89mm డ్రైవర్స్‌, బ్లూటూత్ v5.0, AUX, microSD కార్డ్ ఇన్‌పుట్లు, కాల్స్‌ కోసం బిల్ట్-ఇన్ మైక్రోఫోన్, పోర్టబుల్ డిజైన్, హ్యాండిల్, రీఛార్జ్ చేయగల బ్యాటరీ, IPX5 వాటర్‌ప్రూఫింగ్, USB పోర్ట్, 50% వాల్యూమ్‌లో 9 గంటల వరకు బ్యాకప్ వంటి ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. 10 మీటర్ల బ్లూటూత్ పరిధి, TWS ఫంక్షన్, RGB లైటింగ్, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్, ఈజీ బటన్ కంట్రోల్స్‌ USB టైప్-సి ద్వారా ఛార్జింగ్, 3.5 గంటల ఛార్జింగ్ సమయం దీనిలోని ఇతర ప్రత్యేకతలు.

నాయిస్ కలర్‌ఫిట్ ప్రో 4 ఆల్ఫా స్మార్ట్‌వాచ్

నాయిస్ కలర్‌ఫిట్ ప్రో 4 ఆల్ఫా స్మార్ట్‌వాచ్‌ను రూ.1,999కే కొనుగోలు చేయవచ్చు. దీనిలో 1.78-అంగుళాల AMOLED డిస్‌ప్లే, వివిధ వాచ్ ఫేస్‌లు, డిజిటల్ క్రౌన్ ఫంక్షన్‌, ట్రూ సింక్ కాల్ ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు. ఇది నాయిస్ బజ్ ఫీచర్ డయల్ ప్యాడ్, కాల్ లాగ్స్‌, 10 కాంటాక్ట్‌ల వరకు సేవ్ చేసే సామర్థ్యాన్ని అందిస్తుంది. ఇన్‌స్టాఛార్జ్‌తో 7 రోజుల బ్యాటరీ లైఫ్ లభిస్తుంది. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్ తర్వాత 24 గంటల పాటు ఉపయోగించవచ్చు.

రియల్‌మీ P1 5G స్మార్ట్‌ఫోన్

ఈ మొబైల్ 6GB RAM + 128GB ROM వేరియంట్‌ ధర రూ.16,467. బడ్జెట్ రూ.20,000లోపు ఉంటే దీన్ని బహుమతిగా ఇవ్వవచ్చు. ఇందులో 2TB వరకు ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 6.67-అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 2000 nits బ్రైట్నెస్, TUV రైన్‌లాండ్ ఐ-ప్రొటెక్షన్ సర్టిఫికేషన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ అందించారు. ఈ మొబైల్‌లో 50MP మెయిన్ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్, 16MP ఫ్రంట్ కెమెరాలతో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 45W సూపర్ VOOC ఫాస్ట్ ఛార్జింగ్, టెక్స్చర్డ్ ఫెదర్ పాటర్న్ డిజైన్, IP54 వాటర్ రెసిస్టెన్స్, 7-లేయర్ VC కూలింగ్ సిస్టమ్ దీనిలోని ఇతర ప్రత్యేకతలు.

వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 2r TWS ఇయర్‌బడ్స్‌

పాటలు వినడం ఇష్టపడే అమ్మల తల్లులకు ఇయర్ బర్డ్స్ బహుమతిగా అందించవచ్చు. వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 2r రూ.2,000లోపే దొరుకుతున్నాయి. ఈ ఇయర్‌బడ్స్‌ను అమెజాన్‌లో రూ.1,799కే కొనుగోలు చేయవచ్చు. 12.4mm డ్రైవర్లు స్పష్టమైన, మెరుగైన బేస్ సౌండ్ క్వాలిటీని అందిస్తాయి. సౌండ్ మాస్టర్ ఈక్వలైజర్స్ బోల్డ్, బేస్, బ్యాలెన్స్‌డ్‌ వంటి మూడు ఆడియో ప్రొఫైల్స్‌ను అందిస్తుంది. సింగిల్ ఛార్జీతో 38 గంటల వరకు బ్యాటరీ లైఫ్ వస్తుంది. IP55 రేటింగ్ నీటి, చెమట మంచి వీటిని రక్షిస్తుంది.

2024-05-04T09:37:50Z dg43tfdfdgfd