MUDRAS: ఈ ముద్రతో ఏకాగ్రత, శక్తి పెరుగుతాయట..సెలబ్రిటీల సీక్రెట్ ఇదే..

యోగా చేయడం వల్ల బాడీ ఫ్లెక్సీబుల్‌గా మారడమే కాదు. కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. అందులో ఏకాగ్రత పెరగడం. అందుకోసం ఏ యోగా చేయాలో తెలుసుకోండి.

నేటి ఫాస్ట్ ఫార్వర్డ్ లైఫ్‌లో ప్రతి ఒక్కరూ కూడా ఒత్తిడి, ఆందోళనతో సతమతమవుతున్నారు. దీని వల్ల చాలా ఆరోగ్య సమస్యలొస్తున్నాయి. అయితే, ఎంత బిజీగా ఉన్నా కొందరు ఫోకస్డ్‌గా వారి పనులు వారు చేసుకోగలుగుతారు. దీనికి గల కొన్ని కారణాలలో యోగా ముద్రలు అని కూడా చెప్పొచ్చు. ముద్రలు మన బాడీలో శక్తిని పెంచుతాయి. మనసుని ఏకాగ్రతగా ఉంచుతాయి. వీటిని చేయడం వల్ల కొంతమందిలో అంతర్గత శక్తి పెరుగుతుంది. అలాంటి శక్తిముద్రల గురించి తెలుసుకోండి. శక్తిముద్ర..

శక్తి ముద్ర అనేది కేవలం శరీరానికే కాదు. మనసుకి కూడా ముఖ్యమే. దీని వల్ల శరీరంలో శక్త ప్రసరణ కంట్రోల్ అవుతుంది. ఈ కారణంగా మీరు మరింత శక్తివంతంగా ఉంటారు. ఏకాగ్రత పెరుగుతుంది. జీవితంలో స్పష్టత కోరుకునేవారికి ఈ ముద్ర ఆచరించడం మంచిది. దీని వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది.

యోగాతో ఆరోగ్యం​ ​

ఎలా చేయాలి?

ఈ శక్తి ముద్ర చేయడం చాలా ఈజీనే. కానీ, దీని వల్ల కలిగే ప్రయోజనాలు అద్భుతమనే చెప్పాలి. రెగ్యులర్‌గా చేస్తే తప్పకుండా ఫలితాలుంటాయి. ముందుగా ఇందుకోసం నేలపై నిటారుగా కూర్చోవాలి. వీపుని నిటారుగా, భుజాలని సరిగ్గా ఉంచాలి. మోకాళ్ళని తీసుకొచ్చి అరచేతులపై ఉంచండి. ఇప్పుడు చూపుడు వేలి కొనతో బొటనవేలుని తాకండి. ఇతర వేళ్ళు రిలాక్స్డ్‌గా ఉంటాయి. ఈ ముద్రలో కొన్నిసార్లు శ్వాస తీసుకోవాలి. ప్రశాంతంగా చేయాలి. శక్తి వేలి ద్వారా ప్రవహించి శరీరంలోకి చేరుతుంది. శరీరంలోకి మాత్రమే కాదు. ​Also Read : సమ్మర్‌లో జిమ్‌కి వెళ్ళేవారు వీటిని మరువొద్దు..

అంతర్గత శక్తి..

ప్రతి ఒక్కరి శరీరంలో కూడా ఈ అంతర్గత శక్తి ఉంటుంది. కానీ, దానిని ఎప్పుడూ వాడాలో తెలియదు. శక్తి ముద్రని చేసినప్పుడు అది శరీరంలో అంతర్గత శక్తిని ప్రసరింపజేస్తుంది. దీనిని చేస్తే ఈ శక్తి ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కోవడానికి సాయపడుతుంది. రెగ్యులర్‌గా చేస్తే మనలో దాగి ఉన్న శక్తి సామర్థ్యాలు బయటికి వస్తాయి.

ప్రముఖులు..

ఈ శక్తి ముద్ర గొప్పదనం తెలుసు కాబట్టే, చాలా మంది ప్రముఖులు, సినీ నటులు, రాజకీయ నేతలు ఈ ముద్రని చేస్తారు. చాలా మంది సెలబ్రిటీస్ ఇంటర్య్వూల్లో ఈ ముద్రని వేసి మాట్లాడడం చూసే ఉంటారు. ​Also Read : Weight Loss Breakfast : ఈ 5 బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్స్‌తో ఈజీగా బరువు తగ్గుతారు..

ధ్యానం..

శక్తి ముద్రని చాలా మంది చేస్తారు. కానీ, ధ్యానంతో చేస్తేనే ప్రయోజనాలు ఉంటాయి. ధ్యానంతో పాటు శక్తి ముద్రని వాడితే ఆధ్యాత్మికంగా బెనిఫిట్స్ పొందొచ్చు. శ్వాస, ఏకాగ్రతతో చేస్తే మనశ్శాంతిగా ఉంటారు. దీని వల్ల అంతర్గత బలం పెరుగుతుంది. ధ్యానం వల్ల స్పష్టత పెరుగుతుంది. గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Read More : Health News and Telugu News

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-23T11:08:14Z dg43tfdfdgfd