NAIL CUTTING: సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కట్ చేయకూడదు! ఎందుకో తెలుసా?

Nail cutting: భారతదేశంలో సంప్రదాయాలు, ఆచారాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఎందుకంటే తరతరాల నుంచి మన పూర్వీకులు పాటించడంతో అవి మన జీవనవిధానంలో భాగమయ్యాయి. నేటికీ ఈ అవాట్లను, పద్ధతులను పాటిస్తున్నారు. ఉదాహరణకు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత గోళ్లను కత్తిరించరు. పురాతనకాలం నుంచి ఈ ఆచారం ఉంది. కొందరు దీన్ని మూఢనమ్మకంగా భావించినప్పటికీ చాలా మంది ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. సూర్యాస్తమయం తర్వాత గోళ్లను కత్తిరించకపోవడానికి ఉన్న కారణాలేంటో ఇప్పుడు పరిశీలిద్దాం.

* ప్రతికూల శక్తి

సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించకుండా ఉండటానికి ఉన్న సాధారణ కారణాల్లో ప్రతికూల శక్తి ఒకటి. ఈ సమయంలో గోళ్లు కట్ చేస్తే, దురదృష్టం వెంటాడుతుందని చాలా మంది నమ్ముతారు. దుష్టశక్తులు, ప్రతికూల శక్తుల ప్రభావం రాత్రిపూట అధికంగా ఉంటుంది. ఆ సమయంలో గోళ్లను కత్తిరిస్తే వాటి ప్రభావం మీ మీద పడుతుంది. ఫలితంగా లేనిపోని సమస్యల్లో ఇరుక్కుంటారు. ఇంట్లో వాతావరణం దెబ్బతినవచ్చు.

* సంస్కృతి

హిందూమతం సంస్కృతి, సంప్రదాయాలకు నిలయం. చాలా మంది వాటిని ఎంతో నిష్టతో పాటిస్తుంటారు. సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించడం అనేది దేవుడిని అగౌరవపరిచినట్లు భావిస్తారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఈ పని చేయరు. రాత్రిపూట గోళ్లు కత్తిరించడం అనేది దేవతల ఆత్మలకు భంగం కలిగిస్తుందని మన పూర్వీకులు నమ్మేవారు.

* ధూళి, దుమ్ము

సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కట్ చేసుకోకపోవడానికి మరో కారణం శుభ్రత. నిత్యం మనం ఎన్నో పనులు చేస్తుంటాం. ఫలితంగా ధూళి, దుమ్ము వంటి కణాలు చేతి, కాలి గోళ్లలో చేరే అవకాశం ఉంటుంది. రాత్రి సమయాల్లో గోళ్లను కత్తిరించడం వల్ల వాటిలో ఉండే దుమ్ము ఇన్‌ఫెక్షన్స్‌కు దారితీస్తుంది. రాత్రి సమయాల్లో గోళ్లు కత్తిరించకపోవడానికి ఇదొక కారణం.

15 ఏళ్లకే ఇంటి నుంచి పారిపోయి..పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. గామర్ ఇండస్ట్రీలో క్వీన్ గా ఎదిగిన ఈ స్టార్ నటి ఎవరో తెలుసా

* గాయాలు

సాయంత్రం సమయాల్లో వెలుతురు సరిగా ఉండదు. ఈ సమయంలో గోళ్లు కత్తిరించడం శ్రేయస్కరం కాదు. పదునైన వస్తువులతో గోళ్లు కత్తిరిస్తాం కాబట్టి గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది. గోళ్లను కత్తిరించిన తర్వాత సేకరించడం, పారవేయడం కష్టమవుతుంది. గోళ్ లుఆహారంలో కలిస్తే అలెర్జీలకు కారణమవుతుంది. సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించడం అనేది శాంతియుత వాతావరణానికి విఘాతం కలిగించవచ్చు.

* చంద్రుని శక్తి

పురాణాల ప్రకారం గోళ్లు కత్తిరించడానికి, చంద్రుని శక్తి మధ్య నిర్దిష్ట సంబంధం ఉంటుంది. చంద్రుడు ప్రశాంతత, హీలింగ్‌కి ప్రతీక. సాయంత్రం సమయాల్లో చంద్రుని శక్తి గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఈ సమయంలో గోళ్లు కత్తిరించడం చంద్రుని శక్తికి అంతరాయం కలిగించవచ్చు. ఇది ఆరోగ్యం, శ్రేయస్సుపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు.

---- Polls module would be displayed here ----

* ధన దేవత ఆశీస్సులు

సాయంత్రం వేళల్లో లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని మన పూర్వీకుల నమ్మకం. ఐశ్వర్యం ప్రాప్తి కోసం రాత్రి సమయాల్లో అప్పులు చేయడం, గోళ్లు, వెంట్రుకలు కత్తిరించడం వంటి పనులు చేయరు. ఈ ఆచారం తరతరాలుగా వస్తోంది.

* కంటికి కనిపించవు

గోళ్లు కత్తిరించినప్పుడు వాటి ముక్కలు నేలపై పడే అవకాశం ఉంటుంది. రాత్రి సమయాల్లో అవి కనపడవు. పదునైన గోళ్లు కాళ్లకు అంటుకోవచ్చు, గుచ్చుకోవచ్చు.

2024-05-04T11:38:01Z dg43tfdfdgfd