NATURAL FACE PACK AT HOME: కాంతివంతమైన చర్మం కోసం టమాటో, క్యారెట్లతో ఫేస్ ప్యాక్ చేసుకోండిలా!

Face Pack With Tomato And Carrots: మనలో చాలా మంది అందంగా కనిపించడానికి ఎన్నో ప్రొడెక్ట్స్‌ను, క్రీములు, సబ్బులకు ఎంతో ఖర్చు చేస్తుంటారు. కానీ ఇంట్లోనే సహజమైన పద్థతిలో మీరు కాంతివంతమైన, ఆరోగ్యకరమైన  సౌందర్యాన్ని పొందవచ్చు. దీని కోసం మీరు ప్రతిరోజు ఆహారంలో తీసుకొనే టమటో , క్యారెట్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. టమటో,  క్యారెట్లతో తయారు చేసిన ఫేస్ ప్యాక్ చర్మానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. టమటోలో విటమిన్ సి, లైకోపిన్ అధికంగా ఉంటాయి. ఇవి యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి  చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. క్యారెట్లు విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది. ఇది చర్మ కణాల పునరుత్పత్తిని ప్రోత్సహిస్తుంది  మొటిమలను తగ్గిస్తుంది. ఈ ప్యాక్ చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా  ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

కావాల్సినవి:

1 టేబుల్ స్పూన్ టమాట పేస్ట్

1 టేబుల్ స్పూన్ తురిమిన క్యారెట్లు

1/2 టీస్పూన్ పెరుగు

1/2 టీస్పూన్ తేనె

తయారీ విధానం:

ముందుగా ఒక గిన్నెలో అన్ని టమటో పేస్ట్‌ను తయారు చేసుకోవాలి. ఆ తరువాత క్యారెట్‌ ని కూడా పేస్ట్ గా చేసుకోవాలి. దీనిని అప్లై చేసుకొనే ముందు ముఖ్యాన్ని శుభ్రంగా వాటర్‌తో కడుకోవాలి. ఆ తరువాత ఈ ప్యాక్‌ను చర్మంపై రాసుకోవాలి. దీనిని 15-20 నిమిషాలు లేదా ప్యాక్ పూర్తిగా ఆరే వరకు ఉంచండి. గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. మీకు ఇష్టమైన మాయిశ్చరైజర్‌ను అప్లై చేయండి. ఈ ఫేస్ ప్యాక్‌ను వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఉపయోగించవచ్చు.

మరో విధానం: 

టమాటో , క్యారెట్‌తో పాట, ముల్తానీ మట్టి ఫేస్​ ప్యాక్​ తయారీ చేసుకోవచ్చు. దీని కోసం మీరు 

కావాల్సినవి:

ఒక టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి

 ఒక టేబుల్ స్పూన్ క్యారెట్ జ్యూస్‌

ఒక టేబుల్ స్పూన్ టమోట జ్యూస్‌

తయారీ విధానం: 

ముందుగా క్యారెట్ జ్యూస్‌ను తయారు చేసుకోవాలి. అలాగే టమాటోను కూడా జ్యూస్‌ తీయాలి. ఈ రెండు రసాలను తీసుకుని ముల్తానీ మట్టిలో కలిపి ఫేస్‌ ప్యాక్‌ లాగా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని అరగంట పాటు అలాగే ఉంచాలి. తరువాత  వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. 

గమనిక:

మీకు సున్నితమైన చర్మం ఉంటే ఈ ప్యాక్‌ను ఉపయోగించే ముందు మీ మోచేయి లోపలి భాగంలో ప్యాచ్ టెస్ట్ చేయండి.

మీకు ఏవైనా చర్మ సమస్యలు ఉంటే, ఈ ప్యాక్‌ను ఉపయోగించే ముందు వైద్యుడిని సంప్రదించండి.

ఈ ఫేస్ ప్యాక్‌తో పాటు, ఆరోగ్యకరమైన ఆహారం తినడం, పుష్కలంగా నీరు త్రాగడం, సన్‌స్క్రీన్‌ను క్రమం తప్పకుండా ఉపయోగించడం వంటి మంచి చర్మ సంరక్షణ అలవాట్లను అనుసరించడం కూడా ముఖ్యం.

Also Read: PM Modi To Host Dinner Party: ఢిల్లీ పోలీసులకు ప్రధాని మోదీ డిన్నర్ పార్టీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

2024-04-19T16:13:41Z dg43tfdfdgfd