OATS BREAKFAST: మ్యాంగో ఓట్స్ స్మూతీ బౌల్, బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ ఇది

Oats Breakfast: వేసవిలో దాహం అధికంగా వేస్తుంది. దోశలు, పూరీలు, వడలు, బోండాలు... వంటి ఆయిల్ లో వేయించిన ఆహారాలు తినబుద్ధి కాదు. సింపుల్‌గా, తేలికగా ఉండేది ఏదైనా తినాలనిపిస్తుంది. అలాంటివారు మ్యాంగో ఓట్స్ స్మూతీ బౌల్ ట్రై చేయండి. దీన్ని సులువుగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఒక బౌల్ తింటే చాలు, ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి. ఉదయాన్నే అన్ని పోషకాలు కలిగిన ఈ బ్రేక్ ఫాస్ట్‌ని తినడం వల్ల బరువు కూడా త్వరగా తగ్గొచ్చు. ఒక్కసారి దీన్ని తిని చూడండి. మీకు నచ్చడం ఖాయం. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ బ్రేక్ ఫాస్ట్. రెసిపీ అని చెప్పవచ్చు.

మ్యాంగో ఓట్స్ స్మూతీ బౌల్ రెసిపీకి కావలసిన పదార్థాలు

మామిడిపండు ముక్కలు - ఒక కప్పు

ఓట్స్ - ఒక కప్పు

పెరుగు - ఒక కప్పు

తేనె - రెండు స్పూన్లు

పుదీనా తరుగు - ఒక స్పూను

అరటిపండు - ఒకటి

ఆపిల్ - అర ముక్క

బ్లూ బెర్రీస్ - గుప్పెడు

చియా విత్తనాలు - ఒక స్పూను

కొబ్బరి తురుము - ఒక స్పూను

ఐస్ క్యూబ్స్ - ఐదు

మ్యాంగో ఓట్స్ స్మూతీ బౌల్ రెసిపీ

1. ఇది చాలా సింపుల్ రెసిపీ. వండాల్సిన అవసరమే లేదు. సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు.

2. ముందుగా అన్ని పండ్లను కడిగి చక్కగా తొక్కను తీసి, చిన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు బ్లెండర్లో మామిడి పండ్లు, పెరుగు, ఓట్స్, ఐస్ క్యూబ్స్, తేనె కలిపి మెత్తని స్మూతీలా మార్చుకోవాలి.

4. దీన్ని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి.

5. దానిపై బ్లూ బెర్రీస్, చియా గింజలు, కొబ్బరి తురుము, పుదీనా తురుము, ఆపిల్ ముక్కల తురుము, అరటిపండు తురుము వేసుకొని కలుపుకోవాలి.

6. అంతే టేస్టీ మ్యాంగో ఓట్స్ స్మూతీ బౌల్ రెడీ అయినట్టే.

7. దీన్ని తినే కొద్ది మరింతగా తినాలనిపిస్తుంది. ఇది చాలా తీపిగా ఉంటుంది.

8. కాబట్టి పిల్లలకు కూడా నచ్చుతుంది. పంచదార వేసుకోకుండా తినడమే ఇది మంచిది.

9. బరువు తగ్గాలని అనుకునేవారు దీన్ని వారంలో రెండు మూడు సార్లు తింటే మంచిది.

10. ఒక్కొక్కసారి ఐస్ క్రీమ్ కూడా జోడించుకుంటే రుచి అదిరిపోతుంది.

2024-04-20T00:58:43Z dg43tfdfdgfd