OATS VADA RECIPE : టేస్టీ, క్రంచీ ఓట్స్ వడలు.. నూనె పీల్చుకోకుండా ఉండాలటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Tasty South Indian Breakfast Recipe : టేస్టీ బ్రేక్​ ఫాస్ట్​ను తక్కువ సమయంలో చేయడానికి ఓట్స్ వడలు (Oats Vada Recipe) ఓ మంచి ఆప్షన్. పైగా ఇవి హెల్తీ కూడా. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినగలిగే ఈ వడలు టేస్టీగా, క్రంచీగా ఉంటాయి. బ్రేక్​ఫాస్ట్​ చేయడానికి ఎక్కువ సమయం లేదనుకున్నప్పుడు వీటిని చేసి చక్కగా బాక్స్​లో పెట్టేయొచ్చు. ఓట్స్​తో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాటిని మరింత రుచిగా మీరు పిల్లలకు పెట్టవచ్చు. మరి హెల్తీ, టేస్టీ ఓట్స్ వడలను ఏ విధంగా తయారు చేయాలి? నూనె పీల్చుకోకుండా ఉండేందుకు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి. వంట చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

కావాల్సిన పదార్థాలు

శనగపప్పు - అరకప్పు 

ఓట్స్ - ముప్పావు కప్పు

ఉల్లిపాయలు - అర కప్పు 

కొత్తమీర - చిన్న కట్ట

ధనియాలు - 1 స్పూన్ 

ఉప్పు - రుచికి తగినంత 

పచ్చిమిర్చి - 2 రెండు 

కారం - 1 స్పూన్

నీరు - తగినంత 

నూనె - డీప్ ఫ్రైకి సరిపడ

తయారీ విధానం

ముందుగా పచ్చి శనగపప్పును రెండుగంటల ముందు నానబెట్టండి. అనంతరం నీటిని వడకట్టి వాటిని మిక్సీలో వేసి బరకగా ఫ్రై చేయండి. దానిలో నీరు వేయకుండా మిక్సీ చేసుకోవాలి. శనగపప్పులు కొన్ని పిండి కాకపోయినా అలాగే ఉంచేయాలి. దీనివల్ల వడలు వేసుకున్నప్పుడు అవి కరకరలాడుతూ మంచి రుచిని ఇస్తాయి. ఇలా రుబ్బుకున్న శనగపప్పును ఓ మిక్సింగ్ బౌల్​లోకి తీసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీరను సన్నగా తురుముకోవాలి. మీకు ఇష్టముంటే ఓ అంగుళం అల్లం కూడా ఈ వడల్లో వేసుకోవచ్చు. 

ఇప్పుడు మిక్సింగ్ బౌల్​లో శనగపప్పు పిండి, ఓట్స్ వేసి బాగా కలపాలి. దానిలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కారం, నలిపిన ధనియాలు వేసి బాగా మిక్స్ చేయాలి. ఓకేసారి నీరు వేయకుండా.. కొంచెం కొంచెంగా నీటిని వేసి కలపాలి. పిండిలో నీరు ఎక్కువైతే పిండి విడిపోతుంది కాబట్టి చూసుకుని నీటిని వేస్తే మంచిది. కొంచెం కొంచెంగా.. వడగా చేసుకోవడానికి పిండి సిద్ధమనుకునేంత వరకు మాత్రమే నీటిని వేయాలి. ఏమాత్రం ఎక్కువైనా వడ విడిపోతుంది. అంతేకాకుండా నూనెను పీల్చుకుంటుంది. నీరు సమానంగా వేస్తే మాత్రం నూనె ఏమాత్రం పీల్చుకోదని గుర్తుపెట్టుకోవాలి. చివరిగా కొత్తిమీర తురుము వేసి పిండిని బాగా కలుపుకోవాలి. 

స్టౌవ్ వెలిగించి దానిలో నూనె వేయండి. నూనె బాగా వేడి అయిన తర్వాత.. మీడియం ఫ్లేమ్​లో మంటను ఉంచాలి. వడలను చేతితో ఒత్తుకుంటూ నూనెలో వేయాలి. ఇలా ఓ ఐదారు వేసుకున్న తర్వాత దానిలో గరిట పెట్టకూడదు. అవి బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత గరిట సహాయంతో మరో వైపు తిప్పి ఫ్రై చేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ ఓట్స్ వడలు రెడీ. వీటిని అల్లం చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. టీతో కలిపి కాంబినేషన్​గా తీసుకున్నా మంచిగా ఆస్వాదించవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ టేస్టీ, హెల్తీ ఓట్స్ వడలను తయారు చేసేయండి.

Also Read : ఎప్పుడూ హెల్తీగా, ఫిట్​గా ఉండాలంటే.. ఈ 10 సింపుల్ టిప్స్ ఫాలో అయిపోండి

2024-04-24T02:34:46Z dg43tfdfdgfd