OPTICAL ILLUSION: ఈ పెయింటింగ్‌లో 11 జంతువులు ఉన్నాయి.. 11 సెకన్లలో కనిపెట్టగలరా..?

కళ్ళకు కనిపించేది మాత్రమే నిజమని ఎవరన్నారు? ఆప్టికల్ ఇల్యూషన్స్ (Optical illusions) చూస్తే కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయనే సంగతి అర్థమవుతుంది. ఒకే ఇమేజ్‌ అయినా, ఒకరికి ఒకలా, ఇంకొకరికి ఇంకొకలా కనిపిస్తే ఎలా ఉంటుంది? ఆప్టికల్ ఇల్యూషన్స్ మనుషుల మెదడును అలానే ట్రిక్ చేస్తాయి. కళ్ళముందే ఉన్న వివరాలను గుర్తించకుండా పక్కదారి పట్టిస్తాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా! అంతేకాదు, ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్ మన తెలివితేటలు పెంచడానికి కూడా సహాయపడతాయి. ఇవి మెదడుకు మంచి ఎక్సర్‌సైజ్‌గా నిలుస్తాయి. అబ్జర్వేషన్, విజువల్ పర్సెప్షన్ స్కిల్స్‌ను టెస్ట్ చేస్తాయి.

ఈ పజిల్స్ సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతుంటాయి. తాజాగా మరొక ఛాలెంజింగ్ పజిల్ ఇంటర్నెట్‌లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. ఆ పజిల్ జంతు ప్రేమికులకు ఒక ప్రత్యేకమైన సవాలును విసురుతోంది. ఈ పజిల్ ఇమేజ్‌ను కింద అందించాం.

Source: The Post

ఇందులో ఒక అద్భుతమైన పెయింటింగ్ ఉంది, ఇందులో ఒక పురుషుడు, స్త్రీ ముఖం, ఏనుగు, సింహం ముఖాలు కూడా కనిపిస్తాయి. ఇంకా ఈ పెయింటింగ్‌లో చాలానే వివరాలు ఉన్నాయి. ఈ పెయింటింగ్‌లో మొత్తంగా 11 జంతువులు తెలివిగా దాక్కున్నాయి. వాటన్నిటినీ గుర్తించడమే ఈ పజిల్ టాస్క్. దీనికి టైమ్‌ లిమిట్ కూడా ఉంది. ఈ పజిల్‌ను కేవలం 11 సెకన్లలో దాగి ఉన్న అన్ని జీవులను గుర్తించాలి. అన్ని డిస్ట్రాక్షన్స్ పక్కనపెట్టి సిద్ధంగా ఉన్నప్పుడు టైమర్ సెట్ చేసి పజిల్‌ను సాల్వ్ చేయడం ప్రారంభించాలి.

ఈ పజిల్ పరిశీలనా నైపుణ్యాలను పరీక్షిస్తుంది. చురుకైన చూపు, హై లెవెల్ విజువల్ పర్సెప్షన్ ఉన్నవారు మాత్రమే నిర్ణీత సమయంలో అన్ని జంతువులను పట్టుకోగలుగుతారు. ఇతరులకు 11 సెకన్ల కంటే ఎక్కువ సమయం పట్టవచ్చు లేదా వారు అన్ని జంతువులను కనుగొనలేకపోవచ్చు.

పరిశీలన, ఏకాగ్రత, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ సహా వివిధ మానసిక నైపుణ్యాలకు పదును పెట్టడానికి ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ పజిల్స్ సాల్వ్ చేయడం ఒక అద్భుతమైన మార్గం. ఈ పజిల్స్ వినోదాన్ని అందించడమే కాకుండా చురుకైన మెదడును డెవలప్ చేసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా, ఆప్టికల్ ఇల్యూషన్స్‌ తరచుగా IQ పరీక్షలు.. పర్సనాలిటీని అంచనా వేసే టెస్టులలో ఉపయోగిస్తారు.

* 11 సెకన్లలో 11 జంతువులను గుర్తించారా?

ఇచ్చిన సమయం అయిపోయింది. ఇమేజ్‌ను బాగా పరిశీలించారా? అన్ని జంతువులను గుర్తించగలిగారా? అలా అయితే, మీ పదునైన దృష్టి, అద్భుతమైన ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ స్కిల్స్‌కి అభినందనలు! ఇప్పటికీ వాటి కోసం వెతుకుతున్న వారు చింతించాల్సిన అవసరం లేదు. టైమర్ ఆఫ్ చేసే ప్రశాంతంగా వీటిని సాల్వ్ చేయడానికి ప్రయత్నించవచ్చు. ఈ పజిల్ కోసం మేము ఎలాంటి హింట్ ఇవ్వడం లేదు అలా చేస్తే పజిల్ అత్యంత సులభంగా మారుతుంది. ఇమేజ్‌ను జూమ్ చేసి బాగా పరిశీలించడం ద్వారా జంతువులను కనుగొనవచ్చు. ఒకవేళ ఇప్పటికీ కనిపెట్ట లేకపోతే కింద సొల్యూషన్ ఇమేజ్ ఇస్తున్నాం, చెక్ చేయవచ్చు.

* సొల్యూషన్

Source: The Post

ఇప్పటికే 11 జంతువులను గుర్తించిన వారు పైన ఇచ్చిన సొల్యూషన్ ఇమేజ్ లో ఒకసారి సరి చూసుకోవచ్చు. అన్ని జంతువులు కనిపెట్టలేని వారు మిస్ అయిపోయిన వాటిని గుర్తించవచ్చు. ఈ పజిల్ ఎంజాయ్ చేసి ఉంటే ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయవచ్చు. ఇలాంటి మరిన్ని పజిల్స్ కోసం న్యూస్ 18 వెబ్‌సైట్ విజిట్ చేయవచ్చు.

2024-03-28T05:13:25Z dg43tfdfdgfd