PICTURE PUZZLE: ఈ వాచ్‌లో పెద్ద తప్పు.. అది కనిపెడితే మీరు మామూలుతోపు కాదు

Picture Puzzle:  సోషల్ మీడియాలో రకరకాల పజిల్స్ వైరల్ అవుతుంటాయి వాటిలో పిక్చర్ పజిల్స్ (Picture Puzzle) గమ్మత్తుగా ఉండి చాలామందిని ఆకర్షిస్తాయి. ఇవి మెదడుకు పనిపెడుతూ మెంటల్ స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తాయి. మెదడుకు ఒక రకమైన వ్యాయామం లాంటి ఈ పజిల్స్ క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్-సాల్వింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తాయి. వీటిని క్రమం తప్పకుండా పరిష్కరించడం ద్వారా ఏకాగ్రత పెరుగుతుంది, తెలివితేటలు పెరిగే అవకాశం కూడా ఉంది. ఇవి ఇమేజ్‌లో దాగి ఉన్న వస్తువులను గుర్తించమని సవాలు విసురుతాయి, లేదంటే ఏదైనా తప్పులను గుర్తించమని ఛాలెంజ్ చేస్తాయి. ఈరోజు ఇలాంటి ఒక ఛాలెంజింగ్ పిక్చర్ పజిల్‌ను మీకోసం తీసుకొచ్చాం.

---- Polls module would be displayed here ----

సాధారణంగా పిక్చర్ పజిల్స్ చాలా రకాలుగా ఉంటాయి. ప్రతి ఒక్కటి మెదడులోని ఒక ప్రత్యేకమైన నైపుణ్యాన్ని పరీక్షిస్తుంది. చాలా పాపులర్ అయిన పిక్చర్ పజిల్స్‌లో లోపాలను గుర్తించడం ఒకటి. ఇది ఒక చిత్రంలో చిన్న చిన్న లోపాలను గుర్తించమని అడుగుతుంది. దాగిన కోడ్స్‌ను అర్థం చేసుకోవడం మరో రకం. ఇందులో చిత్రంలో దాగి ఉన్న మెసేజ్‌లు గుర్తించాలి. దాగిన వస్తువులను కనుగొనడం పిక్చర్ పజిల్స్‌లోని ఇంకో రకం. ఈ బ్రెయిన్ టీజర్లు మెదడును ఏకాగ్రత కేంద్రీకరించడానికి, చిన్న చిన్న విషయాలను గుర్తించడానికి శిక్షణ ఇస్తాయి. చాలా సార్లు కళ్ళ ముందే ఉన్న విషయాలను గుర్తించకపోవచ్చు. అయితే ఇవి ఆ విషయాలను త్వరగా గుర్తించేలా బ్రెయిన్‌కు ట్రైనింగ్ ఇస్తాయి.

Source: Bright Side

ఈ పజిల్ పరిశీలనా నైపుణ్యాలకు పరీక్షకు పెడుతుంది. IQ టెస్ట్‌లా పనిచేస్తుంది. ఇమేజ్‌లో ఒక వాచ్ ఫేస్ కనిపిస్తోంది. రౌండ్ షేప్డ్ వాచ్ ఫేస్‌లో రోమన్ నంబర్స్‌ ఉన్నాయి. చూడగానే ఈ గడియారంలో ఎలాంటి తప్పు లేదనిపిస్తుంది కానీ అందులో ఒక పొరపాటు ఉంది. దానిని గుర్తించడమే ఈ పజిల్ టాస్క్. ఇందుకు 3 సెకన్ల సమయం మాత్రమే ఉంది. ఇది మీరు చిన్ని చిన్న వివరాల పట్ల ఎంత బాగా దృష్టి పెడుతున్నారో టెస్ట్ చేస్తుంది.

లోపాన్ని గుర్తించారా? లేకపోతే, చూస్తూ ఉండాలి. అన్ని వివరాలను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి. చాలా తక్కువ మంది మాత్రమే ఈ మిస్టేక్ కనిపెట్టగలరు. అబ్జర్వేషన్ స్కిల్స్, డీటైల్స్ పట్ల దృష్టి పెట్టగల సామర్థ్యం ఉంటేనే దీనిని మూడు సెకన్లలో సాల్వ్ చేయడం సాధ్యమవుతుంది. పరిష్కరించలేని వారు మరోసారి ప్రయత్నించవచ్చు, అప్పటికీ కనుగొనలేకపోతే కింద అందించిన సొల్యూషన్ చెక్ చేయవచ్చు.

* సొల్యూషన్

Source: Bright Side

జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత వాచ్ ఫేస్‌లో 9 (IX) గంటల సంఖ్యను చూపించాల్సిన ప్లేస్‌లో 11 (XI).. 11 గంటల సంఖ్యను ప్రదర్శించాల్సిన స్థానంలో 9 మారినట్లు అర్థం చేసుకోవచ్చు. ఇదే ఈ పిక్చర్‌లోని తప్పు.

ఈ పజిల్‌ను ఎంజాయ్ చేసి ఉంటే స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోవచ్చు. ఎవరు అత్యంత పదునైన కంటి చూపును కలిగి ఉన్నారో టెస్ట్ చేయవచ్చు. ఇలాంటి మరెన్నో ఛాలెంజింగ్ బ్రెయిన్ టీజర్ల కోసం న్యూస్ 18 తెలుగు వెబ్‌సైట్ చెక్ చేయవచ్చు.

2024-03-29T08:01:00Z dg43tfdfdgfd