POWER OF SRI CHAKRA: చీకటి పడగానే నగర పర్యటన చేస్తూ సంహారానికి పాల్పడే అమ్మవారి గురించి విన్నారా!

 Madhura Meenakshi and Adi Shankaracharya Story : అష్టాదశ  శక్తిపీఠాల్లో  మధురై మీనాక్షి ఆలయ పీఠం అత్యంత ముఖ్యమైనది. మీనాల్లాంటి విశాలలమైన కళ్లతో మరకతశిలతో అమ్మవారి విగ్రహం చెక్కి ఉంటుంది. మధురైను పాలించే పాండ్యరాజులంతా మీనాక్షి అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా , కులదేవతగా ఆరాధిస్తారు. దేవీ భాగవతపురాణం ఉండే మణిద్వీప వర్ణనను అనుసరిస్తూ ఆలయ నిర్మాణం చేశారు. అయితే చతుష్షష్టి కళానిలయమైన ఆలయం పగలంతా ఎంత ప్రశాంతంగా ఉండేదో...రాత్రి వేళ ఆ దిక్కున చూడాలన్నా భయపడేలా కనిపించేది.పగలంతా పూజలందుకుంటూ భక్తులను అనుగ్రహించే మీనాక్షి అమ్మవారు చీకటి పడేసరికి సంహారం చేసేది. అమ్మవారిని శాంతింపచేసేందుకు పాండ్యరాజులు ఎన్నో యజ్ఞాలు, యాగాలు చేశారు కానీ ఎలాంటి ఫలితం లేదు. దీంతో చీకటి పడిన తర్వాత నగరంలో ఎవ్వరూ తిరగకూడదంటూ నిషేదాజ్ఞలు జారీ చేశారు రాజుగారు. మధురై క్షేత్రానికి క్షేత్రపాలకుడు - అమ్మవారిలో సగభాగం అయిన సుందరేశ్వరుడు (శివుడు) కూడా ఏమీ చేయలేక చూస్తుండిపోయాడు. 

Also Read: అక్షయ తృతీయ ఎప్పుడు - ఈ పండుగ ప్రాముఖ్యత ఏంటి , ఈ రోజు ఏం చేయాలి!

మధురైకి బాల శంకరులు

ఆ సమయంలో మధురైలో అడుగుపెట్టాడు ఆదిశంకరాచార్యులు. ఘనంగా ఆహ్వానించిన పాండ్యరాజు సకల మర్యాదలు చేశాడు. అయితే ఈ రోజు రాత్రి రాజ్యంలోనే బస చేస్తానని చెప్పిన శంకరులు...అమ్మవారి ఆలయంలో ఉండాలి అనుకుంటున్నట్టు చెప్పారు. ఆ మాటకు ఉలిక్కిపడిన పాండ్యరాజు... "వద్దుస్వామీ! మేము చేసుకున్న పాపమో, శాపమో కానీ చల్లని తల్లి చీకటి పడ్డాక సంహారానికి పాల్పడుతోందని చెప్పారు. భిక్ష తీసుకున్న సన్యాసులు గృహస్తుల ఇంట్లో బస చేయకూడదు అందుకే ఆలయంలో ఉంటానని చెప్పారు. చేసేది లేక సరే అన్న పాండ్యరాజు..పరమేశ్వరుడి తేజస్సుతో వెలిగిపోతున్న ఈ బాలుడిని మళ్లీ చూడలేనేమో అనుకుని మనసులోనే బాధపడ్డాడు. ఆ తర్వాత శంకరులు అమ్మవారి ఆలయానికి వెళ్లారు..

చీకటి పడింది - గర్భగుడి నుంచి అమ్మ కదిలింది

సూర్యాస్తమయం అయింది..ఆది శంకరాచార్యులు గర్భగుడి ఎదురుగా ఉన్న మండపంలో ధ్యానంలో కూర్చున్నారు. అప్పటివరకూ ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.గంటలు మోగాయి, మొత్తం దీపాలు వాటంతట అవే వెలిగాయి. గర్భగుడిలో ఉన్న అమ్మవారు... పక్కనే ఉన్న సుందరేశ్వరుడికి నమస్కరించి అడుగులో అడుగు వేసుకుంటూ వస్తోంది...ఎదురుగా మండపంలో కనిపించిన బాలుడిని చూసి..ఎవరీ బాలుడు? తనని చూస్తుంటే పుత్రవాత్సల్యం కలుగుతోంది అనుకుంటూ గర్భగుడి దాటి బయటకు అడుగుపెట్టింది. వెంటనే ఓ మాయస్వరూపం ఆమెను ఆవహించి..ప్రశాంతత మాయమై మహాకాళిగా మారిపోయింది. ఆ క్షణం కళ్లు తెరిచిన శంకరులు అమ్మవారిని చూసి...అమ్మగా భావించి స్తుతించడం మొదలుపెట్టారు. శంకరులను సంహరించాలన్నంత వేగంగా అడుగులు వేస్తున్న మీనాక్షి...ఆ స్తుతి విని ఆగిపోయింది.. ఎవరు నువ్వు , నేను సంహారం చేపట్టే సమయంలో ఇక్కడున్నావెందుకు అని ప్రశ్నించింది.. అప్పుడు కూడా శంకరులు ప్రణామం చేసి..."అంబా శంభవి! చంద్ర మౌళి రబలా అంటూ చదవడం ప్రారంభించారు...ఆ స్తుతికి కరిగిన అమ్మవారు వరం కోరుకోమని అడిగింది. పాచికలాట ఆడుదాం అని ఠక్కున అడిగారు బాలశంకరులు...

Also Rad: అక్షయతృతీయ రోజు బంగారం కొనాల్సిందే అనే మాయలో పడుతున్నారా!

అమ్మవారితో పాచికలాట

నేను ఓడిపోతే నా భర్త ఆజ్ఞమేరకు సంవత్సరకాలం నడుచుకుంటాను. నువ్వు ఓడిపోతే నేనువేసే ప్రశ్నలకు వివరంగా సమాధానం చెప్పాలంది. అలా ఆడుతున్న సమయంలో అమ్మవారి ప్రశ్నలకు శంకరులు చెప్పిన సమాధానమే దేవతాస్తోత్రాలు, కవచాలు, సహస్రనామాలు, అష్టోత్తర శతనామస్తోత్రాలు. అప్పుడు శంకరుల వారు అమ్మా నేను ఓడితే నీకు ఆహారం అవుతాను...నువ్వు ఓడితే ఇక సంహారం ఆపేయాలి అన్నాడు. అదే క్షణం శివుడి నుంచి ఓ కాంతి కిరణం బాల శంకరుడిలో మెరుపులా వచ్చి చేరింది. పాచికలు సృష్టించిన అమ్మవారు ..ఆట పూర్తయ్యేవరకూ గర్భగుడిలోనే ఉంటానంటూ వెనక్కు వెళ్లింది. అప్పుడు శంకరాచార్యుల వారు మీనాక్షి అమ్మవారిని స్మరిస్తూ పాచికలు ఆడుతున్నారు. కాసేపట్లో తెల్లవారుతుందనగా...అప్పటివరకూ ఆటలో మునిగిపోయిన అమ్మవారు.. తెల్లారితే సంహారం ఆపేయాల్సి వస్తుంది త్వరగా వెళ్లాలి అనుకుంటూ ఆటపై దృష్టి పెట్టింది. ఇక ఇదే చివరి పందెం అంటూ పాచికలు వేసిన మీనాక్షి...తానే గెలిచానని చెప్పింది. 

ఓడి గెలిచిన శంకరులు

అమ్మ చేతిలో ఓడిపోవడం కన్నా బిడ్డకు కావాల్సింది ఏముంటుందన్న శంకరులు...ఓసారి ఆటను మొత్తం చూడమ్మా అన్నారు. సంఖ్యాశాస్త్రపరంగా, అక్షరసంఖ్యాశాస్త్ర పరంగా, మంత్రశాస్త్రపరంగా గెలుపునాది" అన్నారు. అక్కడ ఆటలో భాగంగా శ్రీ చక్రం రూపొందించారు.  శ్రీచక్రం నీదేహమైతే, సహస్ర నామావళి నీ నామం..ఈ రాత్రంతా నా తపస్సు శక్తిని ధారపోసి వేసిన శ్రీ చక్రాన్ని నువ్వు తిరస్కరిస్తావా? అలా చేస్తే నాస్తికత పెరిగి ఈ సృష్టి నాశనం అవుతుందని చెప్పి ఆగిపోయారు. అప్పటి వరకూ ఏం జరిగిందో అమ్మవారికి అర్థం కాలేదు. పాచికలు ఆడేందుకు  గీసిన గడులు ఆటకోసం కాదు..అదే శ్రీ చక్రం..అమ్మకు తెలియకుండానే అక్కడ ప్రతిష్టించేశారు. ఆ శ్రీ చక్రం దాటి అమ్మవారు కదిలే పరిస్థితి ఇక లేదన్నమాట. అప్పుడే ప్రత్యక్షమైన సుందరేశ్వరుడు నీ తామస శక్తులను అదుపుచేసేందుకు కారణజన్ముడు దిగివారాలి..అందుకే నా అంశతో జన్మించిన శంకరులు వచ్చారని చెప్పాడు.

Also Read: మేష రాశిలో శుక్ర సంచారం - ఈ 7 రాశులవారికి ఆర్థికలాభం, ఆనందం!

 

శ్రీ చక్రం అంత పవర్ ఫుల్

 రాత్రి ఏం జరిగిందో అనే భయంతో పాండ్యరాజు తెల్లవారేసరికి పరుగులు తీశారు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి  ఆశ్చర్యపోయాడు. ప్రతిష్టించిన శ్రీచక్రానికి కాస్త దూరంలో నిల్చుని పార్వతీపరమేశ్వరులను స్తుతిస్తూ ఆదిశంకరులు కనిపించారు. ఇకపై అమ్మవారు తామస శక్తిగా మారదని అభయం ఇచ్చారు. అందుకే  శ్రీచక్రాన్ని దర్శించుకున్న వారికి తమ న్యాయబద్దమైన కోర్కెలు నెరవేరుతాయంటారు. మీనాక్షి ఆలయంలో గర్భగుడి భూమికింద ప్రతిష్టితమైపోయింది శ్రీ చత్రం. అందుకే ఆ ప్రాంగణంలో ఓ దివ్యశక్తి ఉన్నట్టు అనిపిస్తుంది భక్తులకు.

2024-04-25T09:09:38Z dg43tfdfdgfd