PROTEIN FOODS: ఈ ఐదు హెల్తీ ఫుడ్స్ ఉంటే చాలు ప్రోటీన్ పౌడర్ అవసరం రాదు

Protein Foods: శరీర నిర్మాణం, ఎదుగుదల, ఆరోగ్యంలో ప్రోటీన్లు కీలక భూమిక వహిస్తాయి. కండరాలను బలోపేతం చేయడం, కణజాలం మరమ్మత్తు, ఎంజైమ్స్ తయారీ ప్రోటీన్లు లేనిదే సాధ్యం కాదు. ప్రోటీన్లు అనేవి మనం తీసుకునే ఆహార పదార్ధాల్లోనే ఉంటాయి. తరచూ అలసట రావడం. నీరసంగా ఉండటం జరుగుతుంటే ప్రోటీన్ లోపం ఉందని అర్ధం చేసుకోవచ్చు. ప్రోటీన్ లోపాన్ని సరిచేసేందుకు ప్రోటీన్ పౌడర్ అవసరం లేదు. కొన్ని ఆహార పదార్ధాలు డైట్‌లో ఉంటే చాలంటున్నారు న్యూట్రిషనిస్టులు.

చికెన్

చికెన్ అనేది ప్రోటీన్‌కు కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. చికెన్ బ్రెస్ట్ అనేది ప్రోటీన్లకు సరైన ప్రత్యామ్నాయం. చికెన్ ఏ రూపంలో తీసుకున్నా ప్రోటీన్ లోపం సరిచేయవచ్చు.

డ్రై ఫ్రూట్స్

ఇందులో ప్రోటీన్లు, ఫైబర్‌తో పాటు హెల్తీ ఫ్యాట్ కూడా పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా బాదం, వాల్‌నట్స్, జీడిపప్పు, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్‌ను స్నాక్స్ రూపంలో తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. అంతేకాకుండా సోయాబీన్స్, పాలు, పెరుగు, ఆకు పచ్చని కూరగాయల్లో కూడా ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. ప్రోటీన్ల పరిమాణం అనేది మనిషి వయసు, బరువును బట్టి మారుతుంటుంది. 

పప్పులు

పప్పులు ప్రోటీన్లకు బెస్ట్ సోర్స్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా మసూర్ దాల్, శెనగ పప్పు, మూంగ్ దాల్ వంటివాటిలో ప్రోటీన్లు చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. దాంతోపాటు ఫైబర్, విటమిన్లు, మినరల్స్ కూడా ఉంటాయి. 

చేపలు

చేపల్లో ప్రోటీన్లతో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి గుండె ఆరోగ్యానికి చాలా చాలా మంచివి. సాల్మన్, ట్యూనా, మ్యాక్రెల్, సార్డిన్ చేపల్లో ఎక్కువగా లభిస్తుంది. 

గుడ్లు

ఇక గుడ్లు ప్రోటీన్లకు మరో మంచి ప్రత్యామ్నాయం. దాదాపు అందరికీ ఆమోదయోగ్యమైంది. గుడ్డు తెల్లని భాగంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. పసుపు భాగంలో మాత్రం విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. గుడ్లను ఏ రూపంలో తీసుకున్నా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. 

Also read: Sunscreen Lotion: ఎండాకాలంలో సన్‌స్క్రీన్ లోషన్ ఎలా రాస్తే మంచి ఫలితాలుంటాయి

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

2024-04-24T15:42:29Z dg43tfdfdgfd