PUZZLE: మీ కంటిని మోసం చేసే పజిల్.. ఈ ఫోటోలో 3 ఇంగ్లీష్ పదాలను కనిపెట్టగలరా?

Puzzle:  సోషల్ మీడియాలో బ్రెయిన్ టీజర్లు (Brain teasers), పజిల్స్ (Puzzles) తరచుగా వైరల్ అవుతుంటాయి. వీటిలో లాజిక్, ట్రిక్కీ, ఆప్టికల్ ఇల్యూషన్స్‌, విజువల్, మ్యాథ్ పజిల్స్ బాగా పాపులర్ అయ్యాయి. హిడెన్ వర్డ్స్ లేదా ఆబ్జెక్ట్ పజిల్స్ కూడా నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. చిత్రాలలో దాగిన పదాల (Hidden words)ను కనుగొనడమే ఈ పజిల్స్ టాస్క్. ఇవి దృష్టి శక్తి, తెలివితేటలను పరీక్షిస్తాయి. వీటిని పరిష్కరించడానికి లాజికల్ స్కిల్స్, క్రియేటివిటీని ఉపయోగించాల్సి ఉంటుంది. ఇవి పరిశీలనా నైపుణ్యాలు, విశ్లేషణా సామర్థ్యాన్ని టెస్ట్ చేస్తాయి.

---- Polls module would be displayed here ----

ఫోటోల్లో హిడెన్ వర్డ్స్ కనుగొనడం సరదాగా అనిపిస్తుంది. అలానే ఇది మెదడును చురుకుగా ఉంచుతుంది. సమస్య పరిష్కార నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. ఈరోజు ఒక అదిరిపోయే హిడెన్ వర్డ్స్ పజిల్ మీకోసం ఇస్తున్నాం. కింద ఇచ్చిన ఇమేజ్‌లో టాస్క్ చూడండి.

Source: Puzzles World

ఈ ఇమేజ్‌లో ఒక లివింగ్ రూమ్ కనిపిస్తుంది. ఇందులో టీవీ, సోఫా, అల్మరా, కర్టెన్లు, పూల కుండీలు, పుస్తకాలు, ఫొటో ఫ్రేమ్‌లు కనిపిస్తున్నాయి. అయితే ఈ చిత్రంలో మూడు ఆంగ్ల పదాలు కూడా దాగి ఉన్నాయి. వాటిని కనుగొనడమే ఈ పజిల్ టాస్క్. 11 సెకన్లలోనే వీటిని కనుగొనాలి. ఇంగ్లీష్ వర్డ్స్ చిత్రంలో తెలివిగా కలిసిపోయాయి కాబట్టి వాటిని వెంటనే కనిపెట్టడం అంత ఈజీ ఏం కాదు.

దీనిని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తే చాలు కంటి చూపు, క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ మెరుగుపరచుకోవచ్చు. వర్డ్స్‌ను గుర్తించాలంటే చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. అక్షరాలను విభిన్న మార్గాల్లో కలపడానికి ప్రయత్నించాలి. పదాలు నిలువుగా, అడ్డంగా, పైన ఇలా ఏ దిశలోనైనా దాగి ఉండవచ్చు. ఇమేజ్ నుంచి జూమ్ చేసి ప్రతి వివరాన్ని దగ్గరగా పరిశీలిస్తేనే దీనిని సాల్వ్ చేయడం కుదురుతుంది.

ఒక పదం కనుగొంటే, మిగిలినవి కనిపెట్టడానికి ప్రయత్నించాలి. కనిపెట్టలేకపోతే కొంత సమయం విరామం తీసుకొని తిరిగి ప్రయత్నించాలి. రీజనింగ్ స్కిల్స్ అప్లై చేయాల్సి కూడా ఉంటుంది. ఈ బ్రెయిన్ టీజర్ సాల్వ్ చేసేవారి ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీని అంచనా వేస్తుంది. దీనిని ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి కూడా సాల్వ్ చేయవచ్చు. ఇచ్చిన టైమ్‌లోగా కనుగొన్నారా... అయితే అభినందనలు! ఓన్లీ హై లెవెల్ క్రిటికల్ థింకింగ్, అబ్సర్వేషన్, లాజికల్ థింకింగ్ స్కిల్స్, మెరుగైన కంటి చూపు ఉన్నవారే వీటిని కనిపెట్టగలరు. ఒకవేళ ఫెయిల్ అయితే టైమర్ ఆఫ్ చేసి ప్రశాంతంగా ప్రయత్నించవచ్చు. ఎప్పటికీ కనిపెట్టలేని వారి కోసం మేం కింద ఒక సొల్యూషన్ పిక్చర్ ఇచ్చాం.

* సొల్యూషన్

Source: Puzzles World

పైన ఇచ్చిన ఇమేజ్‌లో 3 వర్డ్స్ రెడ్‌ సర్కిల్‌తో హైలైట్ చేశాం. వీటిలో షాపింగ్ (Shopping), హ్యాపీనెస్ (Happiness), ఈజ్‌ (IS) అనే పదాలు దాగి ఉన్నాయి. పరిష్కరించిన వారు ఇవే పదాలను కనుగొన్నారో లేదో చెక్ చేసుకోవచ్చు. ఈ పజిల్‌ను ఎంజాయ్ చేసి ఉంటే బంధుమిత్రులతో పంచుకోవచ్చు. ఇలాంటి మరెన్నో పజిల్స్‌ పరిష్కరించుకుంటూ మెంటల్ హెల్త్ బెనిఫిట్స్ పొందాలనుకుంటే న్యూస్18 తెలుగు వెబ్‌సైట్ చెక్ చేయవచ్చు. ఇక్కడ డైలీ సరికొత్త పజిల్స్ షేర్ చేస్తుంటాం.

2024-04-19T10:20:17Z dg43tfdfdgfd