RELATIONSHIP VASTU: భార్యాభర్తలు ఒకే ప్లేటులో తినకూడదా? కారణం ఏంటో తెలుసా?

Relationship Vastu: మన పూర్వ కాలం నుంచి భార్యాభర్తలు ఒకే ప్లేటులో తినడం. భర్త తిన్న కంచంలోనే భార్య తినడం వంటివి చూస్తాం. అయితే, వాస్తు ప్రకారం ఇలా తినకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఇలా తినడం వల్ల దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కానీ, వాస్తు ప్రకారం ఈ నియమం తప్పు.

ఇలా ఒకే ప్లేటులో తినడం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుందని అనుకుంటారు. సాధారణంగా వారి ప్రేమ అభిమానం ఎక్కువగా ఉన్నప్పుడే కలిసి తింటారు. కానీ, వాస్తు ప్రకారం ఒకరు తిన్న కంచంలో మరొకరు తినకూడదు అంటారు.  ఇది అంపశయ్యపై పడుకున్న సమయంలో కూడా భీష్మ పితామహుడు కూడా చెప్పాడు. ప్రస్తుత వైవాహిక జీవితంలో ఇది అందరికీ ఆచరణాత్మకం.

వాస్తు ప్రకారం భార్యాభర్తలు కలిసి ఒకే కంచంలో తినడం వల్ల ఇంట్లో గొడవలు వస్తాయి.  భార్యాభర్తలు కలిపి భోజనం చేయవచ్చు కానీ, ఇద్దరూ కలిసి ఒకే ప్లేటులో తినకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇలా తినడం వల్ల గ్రహాల ప్రభావం పడుతుంది. ఇది దంపతుల మధ్య అన్యోన్యతను పెంచుతుంది కానీ, వారి వైవాహిక జీవితంపై రాహువు ప్రభావం పడుతుంది. ఈ గ్రహం వల్ల సంబంధంలో చీలిక ఏర్పడుతుంది. జోతిష్య శాస్త్రంలో రాహు గ్రహాన్ని నీచగ్రహంగా పరిగణిస్తారు. 

ఇదీ చదవండి: సంకష్టహర చతుర్థి.. వినాయకుని ప్రసన్నం చేసుకోవడానికి ఇదొక్కటే మార్గం..

దంపతుల మధ్య అన్యోన్యత పెంచుకోవటానికి అనేక మార్గాలు ఉన్నాయి. కానీ, ఒకే కంచంలో తినకుండా ఉండటం నయం. ఎందుకంటే భర్త తిన్న తర్వాత అందులో మిగిలిన అన్నం కూరలు ఉంటే అదే కంచంలో తినడం కొందరికి అలవాటుగా ఉండే వాళ్లు ఉన్నారు. కానీ, ఇలా చేయకూడదు. ఒకరు తిన్న కంచంలో మరొకరు తినకూడదు. అంతేకాదు వాస్తు ప్రకారం తిన్న కంచంలో చేయి కూడా కడగకూడదు. ఇది చాలామందికి అలవాటు ఉంటుంది. ఇలా చేయడం పాపం. తిన్న కంచంలోనే చేయి కడగకూడదు 

ఇదీ చదవండి: తమలపాకును దిండు కింద పెట్టుకుని పడుకుంటే ఏమవుతుందో తెలుసా?

వాస్తు ప్రకారం రాత్రి తిన్నవెంటనే గిన్నెలు శుభ్రం చేసుకోవాలి. లేదంటే ఆ కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడతాయి. లేకపోతే ఉదయం లేచిన వెంటనే అంటే సూర్యోదయానికి ముందే పాచి గిన్నెలు శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో చిందరవందరగా ఉండే ఇంట్లోని వస్తువులు ఆ ఇంటి వాస్తు దోషానికి కూడా కారణం కావచ్చు. అందుకే ఇంటి కిచెన్ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కానీ, ప్రతి మంగళవారం, శుక్రవారం రోజుల్లో వంటగదిని శుభ్రం చేయకూడదు. ఎందుకంటే ఈరోజులు లక్ష్మీదేవికి ఇష్టమైన రోజులుగా పరిగణిస్తారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

2024-03-29T10:33:21Z dg43tfdfdgfd