RESTAURANT STYLE BITTER GOURD CURRY: రెస్టారెంట్ స్టైల్‌లో కాకరకాయ వేపుడుని ఇలా తయారు చేసుకోండి.. లొట్టలు వేసుకొని తింటారు

Restaurant style Bitter gourd curry: కాకరకాయ రుచికి చేదుగా ఉంటుంది దీని పిల్లలే కాదు కొంతమంది పెద్దలు కూడా తినడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇది అంత చేదుగా ఉంటుంది అయితే కాకరకాయలో ఎన్నో పోషకాలు ఉంటాయి

Restaurant style Bitter gourd curry: కాకరకాయ రుచికి చేదుగా ఉంటుంది దీని పిల్లలే కాదు కొంతమంది పెద్దలు కూడా తినడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇది అంత చేదుగా ఉంటుంది అయితే కాకరకాయలో ఎన్నో పోషకాలు ఉంటాయి ఇది మన శరీరానికి ఎంతో ఆరోగ్య కరం ఈ చేదు కాకరకాయను లొట్టలు వేసుకొని తినేలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం

రెస్టారెంట్ స్టైల్ లో కాకరకాయ వేపుడు ఎలా తయారు చేసే విధానం

కావలసిన పదార్థాలు

కాకరకాయ - 1/4 kg

పెద్ద ఉల్లిపాయ-1

టమాటాలు-2

వెల్లుల్లి రెబ్బలు- 10 

ఆవాలు, జీలకర్ర, శనగపప్పు -తాలిపంపునకు

కరివేపాకు, కొత్తిమీర- కొద్దిగా

నూనె - కూరకు సరిపడా

నువ్వుల నూనె- ఒక స్పూన్

ఉప్పు రుచికి సరిపడా

ఎంతో టెస్ట్ అయినా కాకరకాయ వేపుడు తయారు చేసుకునే విధానం..

కాకరకాయను రౌండ్ గా కట్ చేసుకుని మజ్జిగలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని మీడియం మంటపై పెట్టుకోవాలి. నూనె వేడి అవ్వగానే ఆవాలు, జీలకర్ర వేసుకొని చిటపటలాడించాలి.ఇప్పుడు అందులో వెల్లుల్లి రెబ్బలు వేసి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేవరకు వేయించుకోవాలి ఆ తర్వాత ఇందులోనే శనగపప్పు కూడా వేసుకొని ఎర్ర రంగులోకి వచ్చేవరకు వేయించుకోవాలి.

ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు కూడా వేసి దోరగా వేయించుకోవాలి.ఈ ఉల్లిపాయల రంగు కూడా బంగారు రంగు వర్ణంలోకి వచ్చాక కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఓ ఐదు నిమిషాల తర్వాత ఇందులోకి పసుపు, కారం, ఉప్పు వేసి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కూరలో నూనె పైకి తే కాకరకాయ ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కాకరకాయ ముక్కలకు కూర అంతా బాగా పట్టే వరకు వేయించుకోవాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: బాదం.. పోషకాలకు పవర్‌హౌజ్.. ప్రతిరోజూ 4 తింటే ఈ షాకింగ్‌ రిజల్ట్స్‌ మీ సొంతం..

ఇప్పుడు కావాలంటే ఇందులోకి మీరు కొన్ని నీళ్లు కూడా పోసుకోవచ్చు చివరగా ఇందులో కొత్తిమీర కూడా వేసి మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు రుచికరమైన ఎంతో టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్ కాకరకాయ వేపుడు రెడీ అయినట్టే పైనుంచి కాస్త నువ్వుల నూనె కూడా వేసుకొని దీన్ని రుచి చూస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది చేదు కాకరకాయ ఎంతో టేస్టీగా తయారవుతుంది నీకు కావాలంటే రైస్ లేదా చపాతీ లోకి వేసుకొని ఆస్వాదించండి

ఇదీ చదవండి: ఈ ఎరుపురంగు ఆహారాలు తింటే మీకు స్ట్రోక్‌ రాకుండా కాపాడతాయి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

2024-05-02T14:59:03Z dg43tfdfdgfd