SKIN RASHES IN SUMMER: వేస‌విలో వ‌చ్చే చర్మ సమస్యల‌ను త‌గ్గించుకునేందుకు ఈ చిట్కాలను పాటించండి..!

Summer Skin Rashes Home Remedies: వేసవికాలంలో చాలా మంది వివిధ చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా చర్మంపై దురద, చెమట, చర్మం ఎర్రగా మారడం వంటి సమస్యలు కలుగుతాయి. అయితే ఈ సమస్యలు రావడానికి కారణం వేసవికాలంలో శరీర ఉష్టోగ్రత వల్ల శరీరం నుంచి చెమట ఎక్కువగా కలగడం. దీని వల్ల గాలిలో ఉండే బ్యాక్టీరియా చర్మంపై చేరుతాయి. ఈ సమస్య నుంచి బయటపడడానికి మార్కెట్‌లో లభించే  పౌడ‌ర్ ల‌ను ఉపయోగిస్తుంటారు. ఇవి తాత్కాలిక ఉపశమనం కలిగిస్తాయి. అయితే మీరు ఈ సమస్యలకు చెక్‌ పెట్టాలి అనుకుంటే ఈ సింపుల్‌ టిప్‌ను పాటించండి. 

ముల్తానీ మట్టి చర్మ సమస్యలకు మంచి పదార్థం. దీనిని ఉపయోగించి ఫేస్‌ మాస్క్‌గా ఒక గంట పాటు ఉంచాలి. ఇలా చేయడం వల్ల చర్మం చల్లదనంగా ఉంటుంది. అలాగే శరీర ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఈ మాస్క్‌ వల్ల చర్మంపై పేరుకుపోయిన ట్యాన్‌ సులువుగా తొలుగుతుంది. అంతేకాకుండా ఇది చర్మంపై కలిగే దద్దుర్లు, చెమటకాయలు ఇతర సమస్యలను తగ్గిస్తుంది. చర్మంపై ఎక్కువగా బ్యాక్టీరియా చేరడంను తగ్గిస్తుంది. 

ప్రతిరోజు వేప ఆకులతో స్నానం చేయడం వల్ల చర్మంపైన చేరిన బ్యాక్టీరియా, ఫంగస్‌ తొలిగిపోతుంది. వేపాకులులో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ లక్షణాలు ఉంటాయి. దీనిని స్నానం సమయంలో నీటిలో ఉపయోగించడం వల్ల ఇన్ఫెక్షన్‌లు తొలుగుతాయి. 

తీవ్రమైన దద్దుర్లు ఉన్నప్పుడు వంటసోడాను తీసుకుని అందులో నీళ్లు పోసి పేస్ట్‌లాగా చేసుకోవాలి. దీని వల్ల చర్మం శుభ్రంగా తయారు అవుతుంది. రెండు నుంచి మూడు రోజుల పాటు ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ విధంగా మీరు వేసవికాలంలో ఈ చిట్కాలు పాటించడం వల్ల చర్మ సమస్యలను నుంచి ఉపశమనం పొందవచ్చు. 

ఆపిల్ సైడర్ వెనిగర్ లో యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ-బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి దద్దుర్లను తగ్గించడంలో సహాయపడతాయి. ఒక కప్పు నీటిలో కొన్ని టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ కలపండి. ఈ ద్రావణంలో ఒక శుభ్రమైన గుడ్డను ముంచి, దానిని ప్రభావిత ప్రాంతానికి 10-15 నిమిషాలు పాటు ఉంచండి. అలోయెరా జెల్ యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ-బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి దద్దుర్లను తగ్గించడంలో సహాయపడతాయి. ప్రభావిత ప్రాంతానికి అలోయెరా జెల్‌ను సాధారణంగా రాయండి.

ఓట్‌మీల్ యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ-బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి దద్దుర్లను తగ్గించడంలో సహాయపడతాయి. ఒక గిన్నెలో గోరువెచ్చని నీటిని నింపి, అందులో 1 కప్పు ఓట్‌మీల్ కలపండి. 20 నిమిషాలు నానబెట్టి, ఆపై స్నానం చేయండి.దద్దుర్లు తీవ్రంగా ఉన్నట్లయితే లేదా వారం తర్వాత కూడా మెరుగుపడకపోతే, వైద్యుడిని సంప్రదించండి.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

2024-04-23T12:53:30Z dg43tfdfdgfd