SLEEPLESSNESS : రాత్రుళ్ళు నిద్రపట్టడం లేదా? అయితే ఇది తెలుసుకోవాల్సిందే

Sleep Tips : ఈమధ్య కాలంలో పని ఒత్తిడి, ఫోన్ లేదా లాప్ టాప్ లు ఎక్కువగా చూడటం, ఎప్పుడు కూర్చుని పని చేసుకోవడం వంటి వాటి వల్ల.. చాలామంది యువతకి నిద్రలేమి సమస్యలు ఏర్పడుతున్నాయి. ఎంత రాత్రి అయినా కూడా నిద్ర పట్టక చాలామంది మంచం మీద అటు ఇటు దొర్లుతూనే ఉంటారు. 

ఎంతసేపు ప్రయత్నించినా కనీసం కళ్ళు కూడా మూసుకోవు. ఉదయం అయ్యే సరికి త్వరగా లేయలేము. ఇలా నిద్ర లేక చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారి కోసమే కొన్ని మంచి చిట్కాలు ఉన్నాయి. అవి ఫాలో అయితే చాలా వరకు నిద్ర సమస్యలు తీరిపోతాయి. అందరికీ చక్కగా నిద్ర కూడా వస్తుంది.  మరి ఆ చిట్కాలు ఏవో ఒకసారి చూద్దాం..

త్వరగా నిద్ర రావడానికి చిట్కాలు:

పడుకునే ముందు నాటు ఆవు నెయ్యిని గోరువెచ్చగా చేసి రెండు ముక్కు రంధ్రాల్లో రెండు చుక్కల చొప్పున వేసుకోవాలి. ఇలా చేస్తే చాలా సులువుగా నిద్రలోకి జారుకుంటాము. ఇక గసగసాలను దోరగా వేయించి ఒక పల్చని బట్టలో వేసుకుని నిద్రపోయే ముందు వాసన పీల్చినా కూడా చక్కగా నిద్ర వస్తుందట.

చేతి వేళ్ళతో లేదా దువ్వెనతో తల వెంట్రుకలను మృదువుగా దువ్వుకోవాలి. ఇలా చేసిన మనం మైండ్ బాగా ప్రశాంతతకు లోనై త్వరగా నిద్ర పడుతుంది.

ఇక చేతులతో అరికాళ్ళను మెల్లగా మసాజ్ చేసుకోవడం కూడా ఉత్తమం. దానికోసం కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె వాడుకోవచ్చు. ఇక నిద్రపోయే కాసేపటి ముందు గోరువెచ్చగా పాలు తాగాలి. 

ఇక వీటన్నిటికన్నా ఎక్కువ ముఖ్యంగా మనం పాటించవలసింది ఏమిటి అంటే నిద్రపోయే కనీసం ఒక గంట ముందు నుంచి సెల్ ఫోన్లు.. లాప్ టాప్ లు వంటిది చూడటం మానేయాలి. పడుకున్నప్పుడు కూడా తల పక్కన మొబైల్స్ ఉండకూడదు. ఆ రేడియేషన్ వల్ల కూడా నిద్ర సరిగ్గా రాదు. పడుకునే ముందు కళ్ళు మూసుకుని దైవస్మరణ చేసుకోవడం ఉత్తమమైన పని. ఓంకారం లేదా స్లో మ్యూజిక్ పెట్టుకుని కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెడితే త్వరగా నిద్రలోకి జారుకుంటాము. 

ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించటం వల్ల చాలామంది నిద్రలేమి నుంచి బయటపడిన వారు అవుతారు.

Also read: Janasena Glass Symbol: రెబెల్స్‌కు గాజు గ్లాసు గుర్తు, కూటమి అభ్యర్ధుల్లో ఆందోళన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

2024-04-30T14:35:57Z dg43tfdfdgfd