SMARTPHONE: ఇలా చేస్తే మీ పిల్లలు అస్సలు ఫోన్ ముట్టుకోరు..

ప్రతి నివాసంలో చిన్నారులు సెల్ ఫోన్ పట్టుకుని గేములు ఆడటం చూస్తుంటాం. ఈ తరహా అనేది నివాసాల్లో ఎక్కువ అవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఏదో ఒక అలవాటు చేస్తే తప్ప ఆ సెల్‌ఫోన్ గేమ్స్ వదలరని తెలుసు. అయితే ఆ ఉమ్మడి జిల్లాలో ఒక మ్యూజిక్ సంస్థ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పబ్లిక్ ప్రాంతాలలో ఈ విషయాన్ని పూర్తిస్థాయిలో తీసుకు వెళ్తూ విద్యార్థులను ఆహా మనం కూడా ఈ కీబోర్డ్ నేర్చుకుంటే బాగుండేది అని ఆలోచింప చేసేలా ఒక చక్కని మ్యూజికల్ కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంది. అందులో ప్లే చేసే ఆర్టిస్ట్ లంతా దాదాపు 15 సంవత్సరాలు లోపు చిన్నారులే. ఇంతకీ విద్యార్థులు ఏం చేస్తున్నారు.. ఆ విశేషాలు ఏంటి ఒకసారి చూద్దాం.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి కాకినాడ సమీపంలో ఉన్న ఎఫ్ఎం మ్యూజిక్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. గత ఏడాదికాలంగా ఎఫ్ఎం మ్యూజిక్ పేరుతో అనేకమంది విద్యార్థిని విద్యార్థులకు కీబోర్డ్, గిటార్, ప్లే బ్యాక్ సింగర్స్ ఇలా మ్యూజిక్ పై అవగాహన కల్పిస్తూ ప్రత్యేక కార్యక్రమం ఈ ఎఫ్ఎం సంస్థ నిర్వాహకులు సుకుమార్ కల్పిస్తున్నారు.

రైతులకు రూ.54 వేలు.. సింపుల్‌గా ఇలా చేస్తే చాలు!

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా వేసవి సెలవుల నేపథ్యంలో విద్యార్థులను ఈ మ్యూజిక్ పై మళ్లించేందుకు ఓపెన్ ఆడిటోరియం పార్కులో ఓపెన్ మ్యూజికల్ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. ఎక్కడైతే ఎక్కువ విద్యార్థులు, ప్రజలు ఉంటారు. ఆ ప్రాంతానికి ఈ మ్యూజికల్ కిట్స్ తో పాటు వందలాది విద్యార్థులు సైతం తీసుకొచ్చి వారితో సింగింగ్ అదేవిధంగా కీబోర్డ్ గిటార్ ప్లే చేయిస్తూ అందరి దృష్టి ఈమ్యూజిక్ పై ఆకర్షించేలా చేస్తున్నారు.

బంగారం ధర రూ.2,500 ఢమాల్..

దీంతో కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్న అనేక పార్కుల్లో ఓపెన్ ఆడిటోరియం ప్రాంతాలలో ఈ మ్యూజిక్ సంస్థ ఆధ్వర్యంలో ముఖ్యంగా విశేష రోజుల్లో ఈ మ్యూజికల్ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఆ పబ్లిక్ ప్రాంతాల్లో ఈ చక్కని మ్యూజిక్ వాయించారా అటువైపుగా వచ్చిన ప్రజలంతా ఈ చక్కని వాయిద్యాన్ని వింటూ ఎంతో ఉత్సాహంగా గడుపుతున్నారు. అంతేకాకుండా వారి ఇంటిలో సెల్ఫోన్లకు పరిమితం అవుతున్న విద్యార్థులంతా ఈ మ్యూజిక్ నేర్చుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.

ఏదేమైనా టెక్నాలజీ రోజుల్లో ఎవరిని ఏదో రకంగా అట్రాక్షన్ చేయాలని ఆలోచన ప్రతి ఒక్కరు ఉంటుంది. దానిలో భాగంగా చిన్నారులు ఈ మ్యూజిక్ వైపు లాగేందుకు ఆ మాస్టర్ వేసిన ప్లాన్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో ఉంటే సెల్ ఫోన్ కి పరిమితం కావడం టీవీలకు పరిమితం అవుతున్న నేపథ్యంలో ఈ సెలవుల్లో మ్యూజిక్ నేర్చుకుంటూ ముఖ్యంగా ఈ మ్యూజిక్ నేర్చుకోవడం ద్వారా బ్రెయిన్ షార్ప్ గా మారి విద్యపై సైతం దృష్టి ఎక్కువగా పెడతారని మాస్టర్ సుకుమార్ అదే విధంగా తల్లిదండ్రులకు సైతం పేర్కొంటున్నారు.

2024-04-26T13:37:04Z dg43tfdfdgfd