SPRING CLEANING TIPS : ఇంటిని ఇలా శుభ్రం చేసుకుంటే అలెర్జీలు దరి చేరవట.. మానసికంగా కూడా ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయట

Spring Cleaning Tips 2024 : బయటికి వెళ్లేప్పుడు కాలుష్యం ఎలాగో తప్పదు. కానీ ఇంట్లో ఉన్నప్పుడైనా కాలుష్యాన్ని తగ్గించుకోవాలిగా. నిజం చెప్పాలంటే బయటకి వెళ్లినప్పుడు కలిగే అలెర్జీల కన్నా.. ఇంట్లోని దుమ్మూ, ధూళివల్లనే చాలా మంది అలెర్జీల బారిన పడుతున్నారు అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా వాతావరణం మారే సమయంలో ఈ విషయంపై కచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలంటున్నారు. చిన్నపిల్లలు, పెద్దలు త్వరగా అలెర్జీల బారిన పడతారు కాబట్టి.. ఈ విషయంలో రాజీ పడకపోవడమే మంచిది అంటున్నారు. 

ఇంట్లోని ప్రతి గదిని.. పైనుంచి కింది వరకు ఉన్న ధూళిని తొలగించుకోవాలి. ఇంట్లో అనవసరమైన వస్తువులను, దుస్తులను వేరే వాళ్లకి ఇచ్చినా.. బయటపడేసినా మంచిదే. లేదంటే వాడని వస్తువులు ఎక్కువగా ఇంట్లో ఉంచుకోవడం వల్ల దుమ్ము పేరుకుపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కార్పెట్లు, పుస్తకాలు ఉంచే అల్మారాలను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. అయితే ఇంటిని దుమ్ము, ధూళినుంచి ఎలా దూరంగా ఉంచుకోవాలో.. అలెర్జీలు రాకుండా ఇంటిని ఎలా సిద్ధం చేసుకోవాలో చెప్తున్నారు డైసన్ శాస్త్రవేత్తలు. ఇంటిని శుభ్రంగా ఉంచుకునేందుకు కొన్ని చిట్కాలు ఇస్తున్నారు. అవేంటంటే..

ఎక్స్​పోజర్​ను తగ్గించుకోవాలి.. 

దుమ్ము, ధూళి ఎక్కువగా ఉంటున్నప్పుడు గదిని బాగా క్లీన్ చేసి.. దుమ్ము లోపలికి రాకుండా కిటికీలు, తలుపులు మూసి వేయాలి. లేదంటే డస్ట్ అలెర్జీతో జలుబువంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. బయటకు వెళ్తే మాస్క్ ధరించుకుని వెళ్లాలి. 

వాక్యూమ్ చేయండి..

మీరు ఎంతగా ఊడ్చినప్పటికీ.. ఇంట్లో దుమ్ము ఉండిపోతుంది. అలాంటి సమయంలో మీరు వాక్యూమ్స్​ ఉపయోగించవచ్చు. ఇవి అలెర్జీ కారకాలను తీసేస్తాయి. కిటికీలు, ఫర్నిచర్, కార్పేట్స్ వంటి వాటిపై నుంచి దుమ్మును సమర్థవంతంగా తొలగిస్తాయి. హై పవర్, బూస్ట్ మోడ్​తో ఉన్న వాక్యూమ్స్ పురుగులు, అలెర్జీ కారకాలను ఈజీగా తొలగిస్తాయి. వాక్యూమ్​ని ఎప్పుడూ పై నుంచి దిగువకు చేయాలి. ఇలా చేస్తే అంటుకున్న ధూళిని లాగేస్తుందని అర్థం. వాక్యూమ్​తో మూలాలు, ఫర్నిచర్, వస్తువుల చుట్టూ శుభ్రం చేయడం సులభం అవుతుంది.

మూలలు మరచిపోవద్దు.. 

ఇల్లంతా శుభ్రం చేస్తారు కానీ.. కొన్ని ప్రాంతాలు మాత్రం శుభ్రం చేయరు. మూలలు, బెడ్స్, సోఫా కింద, దుప్పట్లు, దీపాలు, బాత్రూమ్స్ వంటి వాటిని జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలి. కీలకమైన ప్రాంతాలను శుభ్రం చేసేందుకు యాంటీ టాంగిల్ హెయిర్ స్క్రూ టూల్స్​ను ఉపయోగించవచ్చు. ఇవి ధూళిని వదిలించి.. తొలగించడంలో బాగా హెల్ప్ చేస్తాయి. 

ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఉపయోగిస్తే మంచిది.. 

దుమ్ము రాకూడదని తలుపులు మూసేస్తే గాలి ఎలా అందుతుంది. ఆ సయమంలో మీరు ఎయిర్ ప్యూరిఫైయర్స్​ని ఉపయోగించుకోవచ్చు. ఇవి ఇంట్లోని గాలి నాణ్యతను మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా అధునాతన, సాంకేతికతతో కూడిన ఎయిర్ ప్యూరిఫైయర్స్​ మీ ఆరోగ్యంలో గణనీయమైన మార్పులు తీసుకువస్తాయి. 

ఈ సింపుల్​ టిప్స్​తో మీ ఇంటిని సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇళ్లు శుభ్రంగా ఉంటే పాజిటివ్ ఆలోచనలు పెరుగుతాయి. శారీరకంగానే కాకుండా.. మానసికంగా కూడా హెల్తీగా ఉంటారు. 

Also Read : ఈ ఇంటి చిట్కాలు మీకు తెలుసా? పాతవే అయినా ఇప్పటికీ ఎఫెక్టివ్​గా పనిచేసే టిప్స్ ఇవే

2024-03-27T17:34:54Z dg43tfdfdgfd