SUMMER DRINKS : కప్పు పెరుగుతో ఇన్ని చేసుకోవచ్చా.. అదిరిపోయే సమ్మర్ డ్రింక్స్..

Curd Summer Drinks : ఈ వేసవి కాలంలో ఎండల వేడికి ఎంత వీలైతే అంత చల్లగా ఏదైనా తాగాలి అనిపిస్తూ ఉంటుంది. కానీ అదే సమయంలో కూల్ డ్రింక్స్ తాగుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకునే కంటే ఇంట్లోనే వేసవి పానీయాలు తయారు చేసుకుని తాగటం చాలా మంచిది. ముఖ్యంగా వేసవికాలంలో పెరుగు మజ్జిగ వంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. కానీ రోజు అదే మజ్జిగ తాగాలంటే బోర్ కొడుతుంది. అలాకాకుండా పెరుగుతో బోలెడు వెరైటీలు చేసుకోవచ్చు. అటు రుచిగా ఉంటూ ఇటు ఆరోగ్యానికి మేలు చేసే పెరుగుతో చేసిన పానీయాలు చాలానే ఉన్నాయి. అందులో కొన్ని మనం తెలుసుకుందాం. 

పెరుగుతో మజ్జిగ కాకుండా లస్సి చేసుకుంటే చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తాగేస్తారు. పెరుగుని బాగా గిల కొట్టి కొంచెం నీళ్లు వేసి చిటికెడు యాలుకల పొడి కూడా వేసి ఒక స్పూన్ పంచదార వేసి బాగా కలుపుకుంటే లస్సీ రెడీ అయిపోతుంది. నచ్చిన వాళ్ళు అందులో కొంచెం కుంకుమపువ్వు కూడా వేసుకొని తాగొచ్చు. 

ఉట్టి మజ్జిగ కంటే పెరుగు ను బాగా గెలకొట్టి నీళ్లు పోసి మజ్జిగలా చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం వేయించిన జీలకర్ర పొడి, కొన్ని తరిగిన పుదీనా ఆకులు వేసి బాగా కలుపుకొని తాగితే కడుపుకి ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. 

ఒక కప్పు పెరుగుని తేనె లేదా బెల్లం తురుము వేసి అరటి పండ్లు, పైనాపిల్ ముక్కలు వేసి బ్లెండ్ చేసి స్మూతీలా కూడా తాగొచ్చు. ఫ్రూట్స్ తో పాటు బెల్లం కూడా వేస్తున్నాం కాబట్టి స్మూతీ ఇంకా రుచిగా ఉంటుంది. 

ఒకవేళ ఉట్టిగా లస్సీ నచ్చని వారు కూడా కప్పు పెరుగులో మామిడికాయ గుజ్జును కూడా వేసి మరిగించిన పాలు కూడా పోసి కొంచెం యాలుకల పొడి, పావు స్పూన్ పంచదార కూడా వేసుకుంటే చక్కటి టేస్టీ మాంగో లస్సీ తయారవుతుంది. కాసేపు ఫ్రిజ్ లో పెట్టి చల్లగా తాగుతూ ఉంటే చాలా హాయిగా ఉంటుంది. 

వేసవికాలంలో పుచ్చకాయ కూడా శరీరానికి చాలా మంచిది. కప్పు పెరుగులో పుచ్చకాయ ముక్కలను వేసి బ్లెండ్ చేసిన తర్వాత పైన కొంచెం చియా గింజలను కూడా చల్లండి ఫ్రిజ్లో పెట్టుకుని చల్లగా అయ్యాక తాగుతూ ఉంటే ఈ స్మూతీ కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది.

Also read: Pink Mooon: ఆకాశంలో అద్భుతం, తెల్లవారుజామునే పింక్ మూన్, ఎన్ని గంటలకంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

2024-04-25T09:00:05Z dg43tfdfdgfd