TIRUMALA: 17 ఏళ్ల కీర్తన... 1,00,01,116 సార్లు స్వామి వారి నామాలు రాసింది

హైందవ వ్యాప్తి…. మత మార్పిడులకు అడ్డుకట్ట వేసే విధంగా టీటీడీ ఎన్నో చర్యలు చేపట్టింది. హైందవ సంప్రదాయం చిన్ననాటి నుంచే చిన్నారులు, యువతలో చిన్ననారి నుంచే పరిమళించేలా తిరుమల శ్రీ‌వారి ఆల‌యం నుంచే టీటీడీ కార్యాచరణ రూపొందించింది. సనాతన సంస్కృతిపై అవగాహన పెంచుతూనే, హైందవ సంప్రదాయాల ఆవశ్యకత, ఆచార వ్యవహారాలు అర్థం అయ్యే రీతిలో హిందుత్వ వ్యాప్తి కొరకు టీటీడీ అహర్నిశలు కృషి చేస్తోంది.

పూర్వం నుంచి ఉన్న శ్రీ రామ కోటి తరహాలో.. గోవింద కోటి రాసే విధంగా టీటీడీ పాలకమండలి యువతకు, చిన్నారులను ప్రోత్సహిస్తోంది. ఇందుకు కొన్ని నిబంధనలు సైతం టీటీడీ త్వరలోనే విడుదల చేయనుంది. తిరుమ‌ల శ్రీ‌వారిని క్ష‌ణకాలం ద‌ర్శించుకుంటే జీవిత‌కాల ఆనందం సొంత‌మ‌వుతుంద‌ని, అలాంటిది బోర్డు స‌భ్యులుగా అవ‌కాశం రావ‌డం మ‌హ‌ద్భాగ్యమ‌ని, ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుని టీటీడీ ప్ర‌తిష్ట‌ను మ‌రింత ఇనుమ‌డింప‌చేయాల‌ని టీటీడీ కోరుతోంది.

Tirupati Trains: తిరుపతి వెళ్లేవారికి అలర్ట్... ఈ రైళ్ల దారి మళ్లింపు... కొత్త రూట్ ఇదే

ఇందు కోసం టీటీడీ కొన్ని ప్రత్యేక నియమాలను సూచించింది. గోవింద కోటి రాసే వారి వయస్సు 25 ఏళ్ల లోపు ఉండాలని మొదటి సూచన చేసింది. ఒక్కసారి గోవింద కోటి పూర్తి అయినా భక్తునితో పాటుగా..వారి కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఒక‌సారి స్వామివారి బ్రేక్ ద‌ర్శ‌నం టీటీడీ కల్పిస్తుంది. గోవింద కోటిని రాసిన గ్రంథాన్ని తిరుమలలోని ఆర్జితం కార్యాలయంకు అందజేయాలి. పూర్తి స్థాయిలో అధికారులు పరిశీలించిన పిమ్మట రాసిన వ్యక్తితో పాటుగా… వారి కుటుంబ సభ్యులల్లో ఐదుగురికి దర్శన భాగ్యాన్ని టీటీడీ కల్పిస్తుంది.

శ్రీవారికి సమర్పించిన మొదటి గోవింద కోటి… 6 నెలల్లో 1,00,01,116 సార్లు రాసిన 17 ఏళ్ల చిన్నారి

మొట్టమొటి గోవింద కోటి రాసిన పుస్తకాన్ని శ్రీవారికి సమర్పించారు భక్తులు. బెంగళూరుకు చెందిన 17 ఏళ్ళ చిన్నారి వీ. కీర్తన 6 నెలల వ్యవధిలోనే గోవిందకోటి పూర్తి చేసి సోమవారం నాడు తిరుమలలోని ఆర్జితం కార్యాలయంలో సమర్పించారు. దీంతో పాలకమండలి నిర్ణయం మేరకు కీర్తనతో పాటుగా చిన్నారి కుటుంబ సభ్యులకు శ్రీవారి విఐపీ బ్రేక్ దర్శనభాగ్యం కల్పించింది టీటీడీ.

బస్సులో తిరుపతి టూర్... తిరుమలలో శ్రీవారి శీఘ్రదర్శనం ఉచితం

మంగళవారం ఉదయం విఐపీ విరామ సమయంలో కీర్తన స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు సమర్పించుకున్నారు. దర్శన అనంతరం గోవిందకోటి రాసిన కీర్తన మీడియాతో మాట్లాడుతూ….. మొదటి గోవింద కోటి రాయడం చాలా సంతోషంగా ఉందన్నారు. మా ఇలవేల్పు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి గోవింద కోటి రాయాలని అనుకున్న తెలిపారు. నేనే మొదటి వ్యక్తి కావడం చాలా గర్వంగా ఉందని తన ఆనందని వ్యక్త పరిచారు. 10001116 సార్లు స్వామి వారి నామాలు వ్రాసి టీటీడీకి సమర్పించానని తెలిపారు.

2024-05-01T05:25:27Z dg43tfdfdgfd