VENUS TRANSIT 2024: మే 19 నుంచి ఈ 3 రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహంతో జరగబోయేది ఇదే..

Venus Transit 2024:  సంపద, కీర్తి, ప్రేమకు సూచికగా భావించే శుక్రుడు మేషరాశిలో కదలికలు జరుపబోతున్నాడు. శుక్రుడు రాశి సంచారం, తీరుగమనం చేయడం కారణంగా ఎంతో ప్రత్యేకమైన ప్రభావం ఏర్పడుతూ ఉంటుంది. దీనివల్ల వ్యక్తుల జాతకాలు శుక్రుడు శుభ స్థానంలో ఉన్న వారికి లాభాలు, చెడు స్థానంలో ఉన్న వారికి నష్టాలు కలుగుతూ ఉంటాయి. ఇదిలా ఉండగా మే 19న శుక్రుడు తన సొంత రాశిని వదిలి వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం రెట్టింపబడమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం లభించబోతోంది. అలాగే ఎంతో ప్రాముఖ్యత కలిగిన కొన్ని రాశుల వారికి మే 19 నుంచి విపరీతమైన ధన లాభాలు కలగబోతున్నాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి.

కర్కాటక రాశి:

కర్కాటక రాశి వారికి మేష రాశిలో శుక్రుడు మే 19న సంచారం చేయడం కారణంగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. అలాగే వీరికి అనేక ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభించే అవకాశాలున్నాయి. దీంతో పాటు మీ తోటి ఉద్యోగుల సపోర్టు లభించి కెరీర్ పరంగా అనేక రకాల లాభాలు పొందుతారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారు ఈ సమయంలో విదేశాలకు కూడా వెళ్లే ఛాన్స్ ఉంది. దీంతో పాటు ఎలాంటి పనులైనా చాలా సులభంగా చక్కగా చేయగలుగుతారు. అయితే మీరు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడవచ్చు.

మేష రాశి:

మేష రాశి వారికి కూడా శుక్రుడి సంచార ప్రభావం మే 19వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన విపరీతమైన ఆధారాన్ని పొందుతారు. దీని కారణంగా మీ స్థిరాస్తులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇంట్లో ఆనందంతో పాటు శాంతి వాతావరణం కూడా నెలకొంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తుల నుంచి అనేక శుభవార్తలు అందుతాయి. దీంతో పాటు స్నేహితుల సహాయంతో జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదిగేందుకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. అలాగే ఈ సమయంలో కష్టపడి పని చేయడం కారణంగా విపరీతమైన లాభాలు పొందగలుగుతారు.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

వృషభ రాశి:

శుక్రుడు సంచారం కారణంగా వృషభ రాశి వారికి అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి ఏళ్ల తరబడి నిలిచిపోయిన పనులు కూడా ఈ సమయంలో పూర్తవుతాయి. అంతేకాకుండా వీరు కొత్త పనులు కూడా ప్రారంభించగలుగుతారు. దీని కారణంగా అనేకమైన ఆర్థిక లాభాలు పొందుతారు. అలాగే మనసులో శాంతి ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. ఇక ఈ రాశి వారికి ధనలక్ష్మి అనుగ్రహం లభించి కెరీర్ కు సంబంధించిన విషయాల్లో పురోగతి లభిస్తుంది. దీంతోపాటు ఉద్యోగాలు చేస్తున్న వారికి పెద్ద పోస్టుల్లో ప్రమోషన్స్ లభిస్తాయి. అలాగే ఆర్థిక సమస్యలు కూడా ఈ సమయంలో పరిష్కారమవుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

2024-04-28T04:41:28Z dg43tfdfdgfd