WEDNESDAY MOTIVATION: అనుబంధాల విషయంలో ఆంజనేయుడును చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది

Wednesday Motivation: ఆంజనేయుడును కేవలం ఆధ్యాత్మిక ప్రతిరూపంగానే చూడకండి. అతని నుండి ఎన్నో అనుబంధ పాఠాలను నేర్చుకోవచ్చు. తద్వారా మీ జీవితంలోని స్నేహాలను, బంధుత్వాలను కాపాడుకోవచ్చు. రాముడి పట్ల ఆయనకున్న అచంచలమైన భక్తి, జీవితంలో ఎలాంటి అడ్డంకులనైనా అధిగమించే శక్తి, ధైర్యం ఇవన్నీ హనుమంతుడి లక్షణాలు. రాముడు, సీత పట్ల ఆయనకున్న ప్రేమ, భక్తి అసాధారణమైనది. హనుమంతుడు రాముని సేవకు తనను తాను అంకితం చేసుకున్నట్టే... మనం కూడా భక్తి ,విధేయతతో మన అనుబంధాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. వాటిని గౌరవించాలి.

రామాయణంలో హనుమంతుడు రాముడికి చేసిన సేవలు స్వార్థమైనది. సీతలను కనిపెట్టడంలో, లంకలో రావణుడితో జరిగిన యుద్ధంలో సహాయం చేయడంలో... తన నిస్వార్థతను చూపించాడు. ఇతరులకు సహాయపడటం చాలా ముఖ్యమని చాటి చెప్పాడు. సొంత అవసరాల కంటే అనుబంధాలను కాపాడుకోవడం కోసం, వారితో బంధాలను బలోపేతం చేయడం కోసం ఎంత త్యాగాన్ని అయినా నిస్వార్ధంగా చేయాలని నిరూపించాడు.

హనుమంతుడు నిర్భయంగా, ధైర్యంగా జీవించమని తన జీవితం ద్వారానే చాటి చెబుతున్నాడు. ముఖ్యంగా ప్రతికూల పరిస్థితుల్లో ధైర్యంగా ఉండాలనీ, ఎలాంటి సవాళ్లు వచ్చినా, అడ్డంకులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలని హనుమంతుడు తన కర్మల ద్వారా వివరిస్తున్నాడు.

హనుమంతుడికి ఎంత గొప్ప శక్తి ఉన్నా ఎక్కడ అహంకారాన్ని చూపించలేదు. వినయాన్నే ప్రదర్శించాడు. అందరినీ గౌరవప్రదంగా చూశాడు. దీనివల్ల పరస్పర అభిమానాలు పెంచుకోవడంలో ఇతరుల ప్రేమను, అనుబంధాలను కాపాడుకోవడంలో ఆయన ముందున్నాడు. హనుమంతుడి వల్లే వానర సేన మొత్తం రాముడి వెనక కదిలింది. హనుమంతుడి మాటకు అంత విలువ ఉంది. అనుబంధాల విషయంలో ఆంజనేయుడి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి.

హనుమంతుడికి ఎంత శారీరక శక్తి ఉన్నా కూడా... మానసికంగా కూడా ఆయన ధైర్యంగా ఉండేవాడు. తనను తాను నమ్మేవాడు. అలాగే మీరు కూడా మీమీద నమ్మకం ఉంచుకోవాలి. ఒక్కసారి స్నేహం చేశాక ఆ స్నేహాన్ని జీవితాంతం నిలబెట్టుకోవాలి. రాముడి స్నేహం కోసం హనుమంతుడు ఎన్నో సార్లు సాయం చేశాడు.

వానర సేనను నడిపించడం అంత సులభమైన విషయం కాదు. హనుమంతుడు అందరితోనూ మర్యాదగా, ప్రేమ పూర్వకంగా నడుచుకోవడం వల్లే వందల మంది వానర సేన అతని పిలుపు మేరకు రాముడి వెంట నడిచింది. అలాగే మీ బంధువుల్లో, స్నేహితుల్లో అందరితో మర్యాదగా నడచుకుకోవాలి. ఎప్పుడు ఎవరి అవసరం పడుతుందో తెలియదు.

2024-04-30T23:42:36Z dg43tfdfdgfd