WOMEN BEAUTY : జుట్టుకు శక్తిని ఇచ్చే ప్రక్రియే హెయిర్ డిటాక్స్.. ఇంట్లో చేసుకోవచ్చా.. ఎలా చేయాలంటే..!

Women Beauty : జుట్టుకు శక్తిని ఇచ్చే ప్రక్రియే హెయిర్ డిటాక్స్.. ఇంట్లో చేసుకోవచ్చా.. ఎలా చేయాలంటే..!

నేటి కాలంలో చాలా మందిలో కనిపించే సమస్య జుట్టు రాలడం లేదా తెల్లబడటం, కాలుష్యం, ఆహారం, మానసిక ఒత్తిడి వంటి అనేక కారణాల వల్ల చిన్న వయసు వారిలోనూ ఈ సమస్యలొస్తున్నాయి. యువతీ యువకుల్లో జుట్టుకు సంబంధించిన సమస్యలు అనేకం. జుట్టును ఆరోగ్యంగా ఉంచేందుకు 'హెయిర్ డిటాక్స్' కూడా అవసరమే. అంటున్నారు నిపుణులు..

జుట్టు ప్రతి రోజూ పెరుగుతుంటుంది. శిరోజాల సౌందర్యం అనగానే షాంపూ చేసుకోవడం, హెయిర్ అయిల్, కండీషనర్స్ వాడటం మాత్రమే అనుకుంటారు. అయితే శిరోజాలు అందంగా ఉండాలంటే ఇది మాత్రమే చాలదు. హెయిర్ డిటాక్స్ కూడా కావాలి. వెంట్రుకలకు బయటి నుంచే కాదు.. వాటి మూలాల నుంచి కూడా శక్తి కావాలి. జుట్టు కుదుళ్లు కూడా ఆరోగ్యంగా ఉండాలి. శారీరక సౌందర్యం, ఆరోగ్యాలకు బాడీ డిటాక్స్ ఎలాగో... శిరోజాలకు హెయిర్ డిటాక్స్ లా. 

హెయిర్ డిటాక్స్ అంటే?

శిరోజాలకు కొత్త శక్తిని అందించే ప్రక్రియే "హెయిర్ డిటాక్స్", జుట్టుపై పేరుకుపోయిన మలినాలను పూర్తి స్థాయిలో తొలగించి, లోపలి కుదుళ్లకు తగిన శక్తిని అందిస్తుంది ఈ ప్రక్రియ. జుట్టు ఎంత ఆరోగ్యంగా ఉన్నా రోజూ దుమ్ము ధూళి ప్రభావానికి గురవుతుంది. రోజూ షాంపూ చేసుకోవడం వల్ల పూర్తిగా ఇవి తొలగిపోవు. పైగా రసాయనాలతో కూడిన షాంపూలు, కండీషనర్లు కూడా కొంత హాని కలిగిస్తాయి. అందువల్ల కొన్ని డిటాక్స్ పద్ధతులు అనుసరిస్తే జుట్టును అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

బేకింగ్ సోడా 

అరకప్పు బేకింగ్ సోడా, మూడు కప్పుల వేడి నీళ్లు కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. దీన్ని జుట్టుకు పూర్తిగా పట్టించాలి. కొద్దిసేపు మసాజ్ చేసి, రెండు నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత నీటితో కడిగేసి కండీషనర్ వాడాలి. వారానికి లేదా రెండు వారాలకోసారి ఇలా చేయొచ్చు. దీనివల్ల వెంట్రుకలు లోపలి నుంచి శుభ్రపడుతాయి. చుండ్రు కూడా తొలగిపోతుంది. దీన్ని పూర్తి స్థాయిలో అప్లై చేసే ముందు... కొద్ది పరిమాణంలో తీసుకుని పరీక్షించుకోవాలి.

యాపిల్ సిడర్ వెనిగర్

పావు కప్పు యాపిల్ సిడార్ వెనిగర్, రెండు కప్పుల నీళ్లు కలిపి పక్కన ఉంచుకోవాలి. షాంపూ చేసుకుని లేదా కండిషనర్ రాసుకుని కొద్దిసేపు ఆగాలి. తర్వాత యాపిల్ సిడార్ కలిపిన నీటిని కొద్దిగా జుట్టుకు పట్టించాలి. ఆ తర్వాత కొద్ది సేపటికి నీళ్లతో కడిగాలి. ఇలా చేయడం వల్ల జుట్టు పొడిబారదు. హెయిర్ డిటాక్స్ కు ఇది చాలా సులభమైన పద్ధతి. దీన్ని అనుసరించేందుకు సల్ఫేట్ ఫ్రీ షాంపూలనే వాడాలి. వారానికోసారి ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 

హనీ షాంపూ

ఒక టేబుల్ స్పూన్ దా హనీ, మూడు టేబుల్ స్పూన్ల ఫిల్టర్ వాటర్, అర టేబుల్ స్పూన్ వరకు ఏదైనా ఎసెన్షియల్ అయిల్ కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. జుట్టు కుదుళ్లకు బాగా అంటేలా చూసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత వేడి లేదా చల్లటి నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలి. ఈ మిశ్రమంలో ఉన్న తేనె జుట్టుకు తేమ అందిస్తుంది. రెగ్యులర్ షాంపూలకు బదులు అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తే బాగుంటుంది.

దోస- నిమ్మరసం

ఒక మీడియం సైజు దోసకాయను పైన తొక్క తొలగించాలి. ఒక పెద్ద నిమ్మకాయ నుంచి రసం పిండాలి. దోసను మొత్తగా చేసి దానిలో నిమ్మరసం కలపాలి. దీనిలో ఏదైనా హెయిర్ ఆయిల్ కలిపి తలకు పట్టించాలి. కొంత సేపటి తర్వాత నీటితో కడుక్కోవాలి. నిమ్మలోని సిట్రిక్ యాసిడ్ జుట్టును శుభ్రపరిస్తే, దోని మృదుత్వాన్ని అందిస్తుంది. చుండ్రు నివారణకు, జుట్టు పెరుగుదలకు ఈ విధానం ఉపయోగపడుతుంది. అప్పుడప్పుడు షాంపూ బదులుగా ఇది వాడొచ్చు.

©️ VIL Media Pvt Ltd.

2024-04-20T08:46:19Z dg43tfdfdgfd