WORK FROM HOME MISTAKES: ఇంటి దగ్గర ల్యాప్‌టాప్‌ను ఆ విధంగా ఉపయోగించారంటే.. మీ లైఫ్ డేంజర్ లో ఉన్నట్లే..

Work From Home Mistakes: కరోనా వచ్చినప్పటి నుంచి చాలా మంది ఇంటి నుంచే పని చేయడం ప్రారంభించారు. ఇప్పటికీ చాలా కంపెనీలు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతిని కొనసాగిస్తున్నాయి. ఎక్కువ మంది ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయడానికి మెుగ్గుచూపుతున్నారు. ఈ పని విధానం సౌకర్యవంతంగా అనిపించినప్పటికీ..ఇది ఆరోగ్యానికి హానిచేస్తుందని అంటున్నారు నిపుణులు.

ఆఫీసులో వర్క్ ఎట్మాస్పియర్ కు, ఇంట్లో పని విధానానికి చాలా తేడా ఉంటుంది. ఆఫీసుకు వెళ్లేవారు ఆ కంపెనీ రూల్స్ ప్రకారం డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది. వర్క్ ఫ్రం హోం చేసేవారు ఎవరికి నచ్చినట్లు వారు ఉంటారు. కొంత మంది కూర్చీలో కూర్చుని పనిచేస్తే.. మరికొందరు బెడ్ మీద పడుకుని వర్క్ చేస్తారు. ఇలా చేయడం వల్ల వారు కొన్ని వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. 

వర్క్ ఫ్రం హోం చేయడం వల్ల కలిగే నష్టాలు

బరువు పెరగటం

ఇంటి నుండి పని చేయడం వల్ల మీరు శారీరకంగా పెద్ద కష్టపడరు. దీని వల్ల మీరు బరువు పెరిగే అవకాశం ఉంది. మీరు గంటల తరబడి మంచం మీద ఉండి వర్క్ చేయడం వల్ల మీ నడుమ చుట్టు కొవ్వు మరింత పెరుగుతుంది. 

సోమరితనం వస్తుంది

మంచం మీద కూర్చుని లేదా పడుకుని పని చేయడం వల్ల మీకు బద్దకం పెరుగుతుంది. శీతాకాలంలో మీరు మరింత సోమరులుగా తయారవుతారు. ఇది మీకు మంచిది కాదు.

Also Read: Diabetes: ఈ రసంతో మధుమేహం శాశ్వతంగా ఒంట్లో నుంచి పారిపోవడం ఖాయం!

వెన్ను నొప్పి రావచ్చు

మీరు మంచం మీద కూర్చుని ల్యాప్‌టాప్‌లో పనిచేసేటప్పుడు మీ నడుము మరియు వీపు సరిగ్గా లేకుంటే వెన్నునొప్పి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు కుర్చీపై కూర్చుని పని చేయండి.

(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also read: Tips For Bright Teeth: మెరిసే, శుభ్రమైన దంతాల కోసం ఇలా చేయండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

2023-06-02T06:21:48Z dg43tfdfdgfd