YOUR WEEKLY HOROSCOPES: ఓ రాశివారికి సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి

Your Weekly Horoscopes: రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ వారం రాశి ఫలాలు లో తెలుసుకుందాం

వార ఫలాలు  :   28-4-2024   నుండి 04-5-2024 వరకు

 

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):

నామ నక్షత్రాలు

ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9

 

శారీరక మానసిక అనారోగ్యం సమస్యలు ఏర్పడగలవు. చెడు దారులు తొక్కే అవకాశం ఉంటుంది.మనసునందు అనేక చెడు ఆలోచనలు కలుగుతాయి.ఇంటా బయట కలహాలు ఏర్పడును.తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడి నష్టం వాటిల్లుతుంది.ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి పెరుగుతుంది.గృహంలో పెద్దవారి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.సంఘంలో గౌరవ ప్రతిష్టలు తగ్గును.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.స్థిరాస్తి కొనుగోలు విషయంలో పెద్దల యొక్క సలహాలు తీసుకోవాలి.  అనవసరమైన ఖర్చులు తగ్గించుకుని వ్యవహరించడం మంచిది. పిల్లల యొక్క చదువు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):

నామ నక్షత్రాలు(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)

ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6

 

వృత్తి వ్యాపారాల్లో ధనలాభం కలుగుతుంది. అభివృద్ధి కార్యక్రమంలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.తలపెట్టిన పనులు అన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి.వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.కోర్టు వ్యవహారాలు అనుకూలంగా తీర్పు రావచ్చు.సమాజంలో మృదువుగా మాట్లాడితే మీయొక్క పనులన్నీ పూర్తి కాగలవు.నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.దూరపు ప్రయాణాలు అనుకూలిస్తాయి.విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది.రాజకీయ వ్యవహారాలు కలిసివస్తాయి.శారీరకంగా మానసికంగా ఆనందంగా గడుపుతారు.

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):

నామ నక్షత్రాలు(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)

ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5

 

శుభవార్తలు వింటారు.సంఘంలో మీ ప్రతిభకు తగ్గ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో ధన లాభం కలుగుతుంది.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.ప్రత్యర్ధులు మీద పై చేయి సాధిస్తారు.నూతన అభివృద్ధి కార్యక్రమాలు ఆలోచనలు ఫలిస్తాయి.నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు.కోర్టు వ్యవహారాలు అనుకూలంగా తీర్పు రావచ్చు. రావలసిన మొండి బకాయిలు చాకచక్యంగా వసూలు చేసుకోవాలి.భూ గృహ క్రయవిక్రయాలు కలిసి వస్తాయి.బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అందిస్తారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):

నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)

ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2

 

చీకు చింత పెరుగుతాయి.సమాజంలో అవమానం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తుంది.నిరాశ నిస్పృహలకు లోనవుతారు.అవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ రుణాలు చేయవలసి వస్తుంది.తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడును.దీర్ఘకాలిక అనారోగ్యం ఇబ్బందులుంటాయి. వృత్తి వ్యాపారాలు లో ధన నష్టం ఏర్పడవచ్చు. పెద్దల యొక్క సూచన మేరకు పెట్టుబడులు పెట్టవలెను. వచ్చిన అవకాశాన్ని అంది పుచ్చుకోవాలి. బంధుమిత్రులతో మనస్పర్థలు ఏర్పడుతాయి.చేయు వ్యవహారాల్లో తెలివితేటలు తగ్గి వ్యవహారాలు చెడిపోవును. నీచమైన ఆలోచనలు కలుగును.

 

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):

నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)

ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1

 

మానసిక బాధలుంటాయి.ఆకస్మికంగా ప్రయాణాలు ఏర్పడతాయి.కీలకమైన సమస్యలు ఆందోళన కలిగిస్తాయి.ఇతరులతో సంభాషణ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకొనవలెను.ఆచితూచి వ్యవహారం చేయాలి.సమాజంలో చేయని పనులు కు బాధ్యత వహించాల్సి వస్తుంది.శారీరిక శ్రమ పెరిగి అలసట పొందుతారు.ప్రత్యర్థులు అపకారి ప్రయత్నాలు చేస్తారు.ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకొనవలెను. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. రుణాలు చేయవలసి వస్తుంది.చేయు పనులు బుద్ధి కుశలత తగ్గి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ‌.

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):

నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)

ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5

 

అన్ని విధాల శుభం చేకూరుతుంది.ధైర్య సాహసాలతో తలపెట్టిన పనులు అన్నీ సాధిస్తారు.వృత్తి వ్యాపారాలు లో ఆదాయం బాగుంటుంది.సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి శారీరకంగా మానసికంగా బలపడతారు. శారీరక శ్రమ తగ్గి ప్రశాంతత లభిస్తుంది.చేయు పనుల్లో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు.అనుకోని ప్రయాణాలు కలిసి వస్తాయి.బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాలు లో సహోద్యోగుల యొక్క సహాయ సహకారాలు వలన అధికార ప్రాప్తి కలుగును.నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):

ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6

నామ నక్షత్రాలు (రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)

 

అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు నత్త నడకగా సాగును. బంధుమిత్రులతో అకారణంగా విరోధాలు రాగలవు. ముఖ్యమైన వస్తువులు యందు జాగ్రత్త అవసరం.జీవిత భాగస్వామితో మనస్పర్థలు ఏర్పడగలవు.ఇతరులతో సంభాషణ చేసేటప్పుడు మాటలు తూల కొండ చూసుకోవాలి. గొడవలకు దూరంగా ఉండటం మంచిది.ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.దూర ప్రయాణాలు వలన చికాకులు గా ఉంటుంది.పుత్ర పుత్రిక తో గొడవలు ఏర్పడతాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికారులు తో గొడవలు ఏర్పడును.సన్నిహితులే అపకారం చేయాలని చూడు వారు ఎక్కువ అవుతారు.అనవసరమైన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి.ఇంటా బయట గౌరవం తగ్గుతుంది.పని యందు అలసత్వం పెరుగుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):

నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)

ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9

 

తలపెట్టిన పనులు అన్నీ విజయవంతంగా పూర్తి అవుతాయి.గృహంలో ఆహ్లాదకరమైన వాతావరణం. ఉద్యోగులకు అనుకూలమైన మార్పులు అధికార వృద్ధి కలుగును. వృత్తి వ్యాపారాల్లో అనుకోని ధన లాభం కలుగుతుంది. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు.అభివృద్ధి సంబంధిత  నిర్ణయాలలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది.భూ గృహ నిర్మాణం పనులు సానుకూలంగా ముందుకు సాగుతాయి. సమాజంలో బహుమానాలు పొందగలరు.కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. విద్యార్థుల ప్రతిభ కనబరుస్తారు.మంచి సౌకర్యాలు పొందుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు.

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):

నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)

ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3

 

ఊహించిన రీతిలో ధనాన్ని ఖర్చులు పెరుగుతాయి.వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.ఆర్థిక ఇబ్బందులు ఏర్పడవచ్చును.వివాదాలకు దూరంగా ఉండాలి.సమాజంలో అవమానాలు జరుగవచ్చు.మనస్సునందు అనేక విధముల బాధలు. మిత్రులతో సన్నిహితంగా ఉండాలి.పనులలో ఆటంకాలు ఏర్పడతాయి.ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది.గృహ మార్పులు చేస్తారు.భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి మనస్పర్థలు రాగలవు.నిరాశ నిస్పృహలకు లోనవుతారు.పొదుపు చేసిన ధనాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది.శత్రు మూలముగా ఇబ్బందులు ఏర్పడతాయి.

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):

నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)

ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8

 

ఇతరుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. విద్యార్థుల ప్రతిభ పాటలు కనబరుస్తారు.శారీరక మానసిక శాంతి లభించును.కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.వృత్తి వ్యాపారాల్లో ఊహించని ధన లాభం కలుగుతుంది. ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది.అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. అనుకున్న పనులు సకాలంలో జరుగుతాయి. ఉద్యోగాలలో అధికార అభివృద్ధి. నూతన వస్తు వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు.ఆత్మీయ బంధువర్గం పెరుగుతుంది.విద్యార్థుల ప్రతిభ పాటలు కనబరుస్తారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు.దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగును.సమాజంలో సన్మానాలు బహుమానాలు అందుకుంటారు.ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు.పుణ్యక్షేత్ర సందర్శనం.బంధువర్గంలో మీ యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది.

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):

నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)

ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8

 

ఆర్థిక వ్యవహారాలు బాగుంటాయి.శారీరక శ్రమ తగ్గి ప్రశాంత లభించును.కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.సమాజంలో ప్రతిభ తగ్గ ప్రతి గౌరవం లభిస్తుంది.వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి.మిత్రుల యొక్క ఆదర అభిమానం పొందుతారు.కుటుంబ అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది.నూతన వస్తు వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో మంచి ప్రోత్సాహం లభించును.శుభకార్యాలలో పాల్గొంటారు.నూతన పరిచయాలు కలిసి వస్తాయి. చేయు పనులు లో ఎంతటి కష్టమైనా  పట్టుదలతో విజయం సాధిస్తారు.వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. మానసికంగా శారీరకంగా బలపడతారు.

 

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):

నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)

ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8

 

ఆర్థిక వ్యవహారాలు బాగుంటాయి.శారీరక శ్రమ తగ్గి ప్రశాంత లభించును.కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.సమాజంలో ప్రతిభ తగ్గ ప్రతి గౌరవం లభిస్తుంది.వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి.మిత్రుల యొక్క ఆదర అభిమానం పొందుతారు.కుటుంబ అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది.నూతన వస్తు వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో మంచి ప్రోత్సాహం లభించును.శుభకార్యాలలో పాల్గొంటారు.నూతన పరిచయాలు కలిసి వస్తాయి. చేయు పనులు లో ఎంతటి కష్టమైనా  పట్టుదలతో విజయం సాధిస్తారు.వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. మానసికంగా శారీరకంగా బలపడతారు.

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):

నామ నక్షత్రాలు (దీ--దూఝ-దా-దే-దో-చా-చి)

ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3

 

ఇంటా బయట గౌరవం తగ్గుతుంది.తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి.మనస్సునందు అనేక  ఆలోచనలు.ఆర్థిక ఇబ్బందులు ఎదురు కోవాల్సి వస్తుంది. రుణాలు చేయవలసి వస్తుంది.స్థిరాస్తి విషయంలో గొడవలు ఏర్పడతాయి. ఇతరుల యొక్క విషయాల్లో జోక్యం తగదు. గృహ క్రయ విక్రయాల యందు ఆచితూచి వ్యవహరించాలి .కీలకమైన సమస్య ను బుద్ధి కుశలతతో పరిష్కరించుకోవాలి.కుటుంబంలో ప్రతికూలత వాతావరణం.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. భవిష్యత్ ప్రణాళికలు గూర్చి ఆలోచన చేస్తారు. అనుకోని కలహాలు ఏర్పడగలవు.

మనకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్న వారు  జోశ్యుల రామకృష్ణ. ఈయన ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

2024-04-28T04:39:00Z dg43tfdfdgfd