అందం కోసం అరాచకం.. ఈ అమ్మాయిలు ఏం చేస్తారో తెలిస్తే ఒళ్ళు జలదరిస్తుంది

ఈ రోజుల్లో అమ్మాయిలు అందానికే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. అందంగా తయారవడం కోసం వివిధ రకాల క్రీమ్స్, డైట్స్ చేస్తుండటం కామనే. కానీ ఇండోనేషియాలోని అమ్మాయిలు మాత్రం అందం కోసం ఏకంగా పాము రక్తం తాగేస్తారట. అందానికి, ఆరోగ్యానికి పాము రక్తం ఎంతో మేలు చేస్తుందని వారు భావిస్తారట.
విషపూరితమైన పాము రక్తాన్ని టీ, కాఫీ కంటే ఇష్టంగా తాగుతారట ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఉండే అమ్మాయిలు. పాము రక్తంతో అందం రెట్టింపవుతుందనేది వారి ప్రగాఢ నమ్మకం. అందుకే వాళ్ళు పాము రక్తాన్ని నిత్యం సేవిస్తుంటారట.
శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి, అందమైన చర్మాన్ని పొందడానికి ఇండోనేషియన్లు పాము రక్తం తాగుతారు. అక్కడ పాము రక్తాన్ని దుకాణాల్లో కూడా అమ్ముతారట. ఈ దుకాణాల వల్ల నిత్యం ఎంతో రద్దీ ఉంటుంది. పాము రక్తం తాగడం తమ అలవాటుగా మార్చుకున్నారు అక్కడి యువతులు.
జకార్తాలో విషపూరితమైన నాగుపాముల రక్తాన్ని తాగే ప్రత్యేకమైన ట్రెండ్ ఉంది. ఉదయం, సాయంత్రం వాకింగ్ చేస్తున్నప్పుడు పాము రక్తం తాగుతుంటారు. అందుకే ఇక్కడ చాలా ప్రాంతాల్లో నాగుపాము రక్తాన్ని విక్రయిస్తుంటారు కూడా.
ఇండోనేషియాలో పాము రక్తం తాగే సంప్రదాయం చాలా పురాతనమైంది. పాములను ఆహారంగా కూడా తీసుకుంటారు ఇక్కడి ప్రజలు. పాము అనేది ఆరోగ్యానికి దివ్యమైన ఔషధం అని ప్రతిఒక్కరూ నమ్ముతుంటారు. అందుకే అక్కడ పాములకు, పాము రక్తానికి చాలా డిమాండ్ ఉంటుంది.

2024-03-28T08:28:47Z dg43tfdfdgfd