అక్షయ తృతీయ రోజు బంగారం ఎందుకు కొనుగోలు చేస్తారంటే..!!

హిందూ సాంప్రదాయంలో అక్షయ తృతీయ చాలా మంచి రోజు. ఈ రోజున అన్ని రకాల శుభ కార్యాలు చేయవచ్చు. ఈరోజు పవిత్రమైన రోజుగా భావిస్తారు. కనుక ఈ రోజు ఏ పని చేయడానికైనా మంచి ఘడియ. అక్షయ తృతీయ రోజున బంగారు, వెండి ఆభరణాలు, గృహాలు, వాహన మొదలైనవి కొనుగోలు చేసే సంప్రదాయం ఆనాదిగా వస్తుంది. ఆ రోజున బంగారు ఆభరణాలను ఎక్కువగా కొనుగోలు చేస్తారు. కొన్ని కారణాల వల్ల బంగారం కొనలేకపోయిన చాలా మంది ఈ రోజున వెండి కొనుగోలు చేస్తారు.

అక్షయ తృతీయ రోజున బంగారం లేదా వెండి కొనుగోలు చేయడంవలన అంత శుభం జరుగుతుందని ప్రజల ప్రగాఢ నమ్మకం. మరి అక్షయ తృతీయ రోజు బంగారం ఎందుకు కొనాలి.. దీనివలన లాభం ఏంటి అనే విషయం ప్రధాన అర్చకులు రాపెల్లి వామన శర్మ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..బంగారం లక్ష్మీదేవి రూపంగా కూడా పరిగణించబడుతుంది.ఈ నమ్మకం వెనుక ఉన్న చరిత్ర ఏమిటంటే దేవతలు, రాక్షసుల మధ్య సాగర మథనం సమయంలో బంగారం కూడా బయటకు వచ్చింది.

Rythubandhu: అందరికీ రైతుబంధు.. ప్రభుత్వం కీలక నిర్ణయం..

దీనిని విష్ణువు స్వీకరించాడు.అందుకే బంగారాన్ని లక్ష్మీదేవిరూపంగా భావించేవారు.ఈ కారణంగా అక్షయ తృతీయ, ధన్హేరస్ సందర్భంగా బంగారం కొనుగోలు చేసే సంప్రదాయం ఉంది.బంగారం లేదా బంగారంతో చేసిన ఆభరణాలను కొనుగోలు చేసి ఇంటికి తీసుకువచ్చినప్పుడు.. దానితో పాటు లక్ష్మీదేవి కూడా ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్మకం.అక్షయ తృతీయ రోజున ఏదైనా డబ్బు,ఆస్తిని కొనుగోలు చేసినా అది ఎప్పటికీ మీ వద్దనే ఉంటుంది.

దానిలో ఎటువంటి తగ్గింపు ఉండదు అనే నమ్మకం కూడా అక్షయ తృతీయకు సంబంధం అర్చకులు రాపల్లి వామన శర్మ లోకల్ 18కి తెలిపారు..కాబట్టి అక్షయ తృతీయ రోజున ధనిక, పేద,లేకుండా చాలామంది వీలైనంత వరకు బంగారం లేదా వెండి వస్తువులను కొనుక్కో ఇంట్లో దేవుని దగ్గర పెట్టి పూజ చేస్తారు..

2024-05-04T07:37:28Z dg43tfdfdgfd