అక్షయ తృతీయ రోజు బంగారం కొనడానికి డబ్బులు లేవా? ఇవి కొన్నా లక్ష్మీకటాక్షం పొందొచ్చు

వైశాఖ శుద్ధ తదియ రోజున అక్షయ తృతీయను చాలా విశిష్టంగా జరుపుకుంటారు. ఈ రోజున సూర్యోదయమునకు ముందే లేచి శుచిగా స్నానం చేసి విష్ణుమూర్తి ని ప్రార్థిస్తే సకల సంపదలు కలుగుతాయి. పురాణాలలో నారదుడు ఒకసారి విష్ణుమూర్తిని అడిగాడట ఓ నారద అక్షయ తృతీయ విశిష్టత ఏమిటని తెలియజేయమన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి ఇలా అన్నాడట క్షయ కానిది అనగా తరిగిపోనిది అక్షయ తృతీయ అంటారు..ఈరోజు సిరి సంపదలను కొని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే సంపద తరగదని అందుకే అక్షయ తృతీయ రోజున బంగారం లేదా వెండి ఇతర వస్తువులు కొనుగోలు చేస్తారని కరీంనగర్ అభయాంజనేయ స్వామి అర్చకులు ప్రకాష్ బాబు లోకల్ 18కి తెలిపారు.

అక్షయ తృతీయ నాడు బంగారం కొనలేకుంటే బాధ పడొద్దు. అయితే ప్రస్తుతం విపరీతంగా పెరిగిన బంగారం ధరలతో అక్షయ తృతీయ పండుగ నాడు బంగారాన్ని కొనుగోలు చేయడానికి సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడే అవకాశాలు లేకపోలేదు. బంగారం కొనుగోలు చేసేంత డబ్బు లేని వారు అక్షయ తృతీయనాడు బంగారం కొనుగోలు చేయలేదని బాధపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు.

Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజు ఈ మూడు రాశుల వాళ్లకు పట్టిందల్లా బంగారమేనట

వీరు ఉప్పు ను కూడా కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు అక్షయ తృతీయ పండుగ నాడు కొబ్బరికాయను తీసుకువచ్చి, లక్ష్మీదేవి రూపంగా భావించి పూజ చేస్తే లక్ష్మీదేవి కటాక్షం మెండుగా ఉంటుందని చెబుతున్నారు. అర్చకులు ప్రకాష్ బాబు. ఆ ఇంట్లో సిరిసంపదలు ఉంటాయని చెబుతున్నారు.

Tirumala Annadanam: తిరుమలలో ఒక రోజు అన్నదానానికి ఎంత ఖర్చవుతుందో తెలుసా?

ఇక అక్షయ తృతీయ పండుగ నాడు బంగారాన్ని కొనుగోలు చేయలేని వారు కొత్త కుండను కొనుగోలు చేసి తెచ్చుకుంటే మంచిదని, ఇంటికి శ్రీ యంత్రాన్ని తెచ్చుకుంటే మంచిదని వీటివల్ల మనం ఊహించని గొప్ప ఫలితాలు వస్తాయని అంటున్నారు.కాబట్టి అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేని వారు వీటిని కొని తెచ్చుకుంటే అంత శుభమే జరుగుతుందని పండితులు ప్రకాష్ బాబు లోకల్ 18 కు తెలిపారు.

2024-05-07T09:18:24Z dg43tfdfdgfd