అత్తగారింట్లో గొడవలు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..

పెళ్లయ్యాక ప్రతి ఆడపిల్ల అత్తగారింటికి వెళ్తుంది. అక్కడ గొడవలు కాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.

ప్రతి ఒక్కరి ఇంట్లో చిన్న చిన్న గొడవలు కామన్. అయితే, పుట్టినప్పట్నుంచి ఓ ఇంట్లో పెరిగి పెళ్లయ్యాక మరో ఇంటికి చేరిన ఆడపిల అక్కడ అడ్జస్ట్ అవ్వడానికి చాలానే సమయం పడుతుంది. ఈ మధ్యలో కొన్ని విషయాల్లో గొడవలు వస్తుంటాయి. అలా రాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అవేంటో తెలుసుకోండి. అర్థం చేసుకోవడం..

ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంటుంది. వీటిని అర్థం చేసుకునే విధంగా అర్థం చేసుకుని మాట్లాడి వాటిని పరిష్కరించుకోవాలి. కలిసి మాట్లాడుకోవడం వల్ల చాలా వరకూ అపార్థాలు తొలగిపోతాయి. అసలు గొడవ ఎక్కడ మొదలైంది అనేది వెతకాలి. ఆ మూలాధారం తెలుసుకుంటే దానిని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు.

ప్రతి విషయాన్నీ భర్తకి చెప్పడం..

కొంతమందికి ఓ అలవాటు ఉంటుంది. ప్రతి చిన్న విషయాన్ని బయటికెళ్ళి వచ్చిన భర్తకి చెబుతారు. దీంతో మొదట్లో బానే ఉన్నా.. రాను రాను మిమ్మల్ని మీ హజ్బెండ్ కంప్లైంట్ బాక్సులా చూస్తారు. కాబట్టి, ఏదైనా పెద్ద సమస్య అయినప్పుడే వారివరకూ చేర్చండి. ​Also Read : ఎండాకాలంలో శృంగార కోరికలు పెరగడానికి కారణాలివే..

తప్పుగా చూడడం..

అవును, కొన్నిసార్లు మనం తప్పుగా ఆలోచించొచ్చు. మనలో నెగెటివిటీ ఉంటే ప్రతీ విషయం మనకి తప్పుగానే అనిపిస్తుంది. కాబట్టి, ఎదుటివారు ఏం చెబుతున్నారో అర్థం చేసుకోండి. వాటికి వెంటనే రియాక్ట్ అవ్వడం, బాధపడడం చేయకుండా, కొన్నింటిని చూసీచూడకుండా వదిలేయండి.

కూల్‌గా అర్థం చేసుకోవడం..

కోపంలో చాలా మంది మాటలు తూలుతుంటారు. అలా చేయడం, తర్వాత బాధపడడం మంచిది కాదు. దీని వల్ల మీ గుణాలే పిల్లలకి వస్తాయని గుర్తుపెట్టుకోండి. పెద్దలు ఏదైనా తప్పుగా మాట్లాడినా వాటిని అర్థం చేసుకుని వివరించే ప్రయత్నం చేయండి. ​Also Read : కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా.. ఇలా చేయండి..

అత్తమామల్ని..

మీ అమ్మనాన్న అంటే ఎంతిష్టమో.. మీ అత్తమామల్ని కూడా అంతే ఇష్టంగా చూడండి. వారికి ఉన్న అవసరాలని గుర్తించి ముందే పరిష్కరిస్తే మీరు మీ పార్టనర్‌తో సంతోషంగా ఉంటారు. ఎందుకంటే కన్న తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకునే భార్యని ప్రతీ భర్త ఇష్టపడతాడని గుర్తుంచుకోండి.

​Read More : Relationship News and Telugu News

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-03T12:17:26Z dg43tfdfdgfd