అన్నం వండినప్పుడు మాడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి..?

ఎక్కువ మందికి అన్నం వండి ప్రతిసారీ మెత్తగా అవ్వడమో..లేక పలుకుగా మారడమో, మాడిపోవడమో జరుగుతుంది. అలా అవ్వకుండా ఉండాలన్నా.. మీకు వంట చెయ్యడం కొత్త అయితే... ఈ కింది ట్రిక్స్ ఫాలో అవ్వండి.

 

అన్నం వండటం కూడా ఒక పని ఆ... చిన్న పిల్లలు కూడా వండేస్తారు అని అందులో ఏముంది అనుకుంటూ ఉంటారు. కానీ... ఎప్పుడైనా నీరు ఎక్కువై అన్నం మెత్తగా అయినప్పుడో... నీరు తక్కువై.. మాడిపోయినప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది. ఎక్కువ మందికి అన్నం వండి ప్రతిసారీ మెత్తగా అవ్వడమో..లేక పలుకుగా మారడమో, మాడిపోవడమో జరుగుతుంది. అలా అవ్వకుండా ఉండాలన్నా.. మీకు వంట చెయ్యడం కొత్త అయితే... ఈ కింది ట్రిక్స్ ఫాలో అవ్వండి.

 

బియ్యంలో చాలా రకాలు ఉంటాయి. కొందరు కొంచెం మిగిలాయి కదా అని రెండు, మూడు రకాల బియ్యం కలిపి వండుతారు. దాని వల్ల కూడా బియ్యం సరిగా ఉడకదు. ఎందుకంటే.. అన్ని రకాల బియ్యం ఒకేలా ఉడకదు. కొన్నింటికి నీరు ఎక్కువ అవసరం, కొన్నింటికి తక్కువ నీరు అవసరం అవుతాయి. అందుకే రెండు, మూడు రకాల బియ్యాలను కలపి అన్నం వండకూడదు.

 

బియ్యాన్ని సరిగా ఉడికించడం కూడా తెలిసి ఉండాలి. నీరు సరిగా పోస్తేనే అన్నం సరిగా ఉడుకుతుంది. సాధారణంగా ప్రజలు అనుసరించే నియమం ఏమిటంటే బియ్యం , నీటి నిష్పత్తి 1:2 ఉండాలి. అయితే, బియ్యం రకం, వ్యక్తిగత ప్రాధాన్యతపై ఆధారపడి ఈ నిష్పత్తి మారవచ్చు. మీరు కుక్కర్‌లో లేదా ఇన్‌స్టంట్ పాట్‌లో అన్నం వండుతున్నట్లయితే , మీరు బియ్యాన్ని ముందుగా నానబెట్టినట్లయితే, అప్పుడు నీరు తక్కువ అవసరం అవుతుంది.

 

ఇక.. అన్నం వండటానికి ఉపయోగించే పాత్ర కూడా చాలా ముఖ్యం. కొందరు పలచటి పాత్రల్లో అన్నం వండుతారు. దాని వల్ల గిన్నె త్వరగా వేడి అయ్యి... మాడిపోతుంది. అలా కాకుండా...  ప్రెజర్ కుక్కర్ లాంటివి అయితే... అలా మాడిపోవు. అవి... అడుగు మందంగా ఉంటాయి. దీంతో..తొందరగా మాడిపోవడం జరగదు.

తక్కువ మంట మీద అన్నం ఉడికించాలి

ఆత్రుతలో , చాలా మంది  ప్రజలు తరచుగా పాత్రలను అధిక మంటలో ఉంచుతారు, తద్వారా పాత్ర త్వరగా వేడెక్కుతుంది  త్వరగా ఈలలు వేస్తుంది. అధిక మంటపై పాత్రను వేడి చేస్తే బియ్యం మాడిపోయే  అవకాశం ఉంది. అన్నం బాగా ఉడకాలంటే తక్కువ మంట మీద ఉడికించాలి. తక్కువ మంట మీద అన్నం వండడం వల్ల పాత్రలో ఆవిరి నెమ్మదిగా ఉత్పత్తి అవుతుంది, అది క్రమంగా బియ్యాన్ని గ్రహిస్తుంది. దీని వల్ల తేలికైన , మెత్తటి అన్నం వస్తుంది. అధిక మంటను ఉపయోగించడం ద్వారా వంట ప్రక్రియను హడావిడిగా చేయడం మానుకోండి, ఇది అన్నం అడుగున మాడిపోయేలా చేస్తుంది.

 

ఇది మాత్రమే కాదు... అన్నం మాడిపోతేందేమో అనే అనుమానం ఉంటే...  కుక్కర్‌లో ముందు, తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకోవచ్చు. ఇది కూడా రుచిని పెంచుతుంది. అన్నం మాడిపోదు. మంచిగా ఉడుకుతుంది.  దీని కోసం, బియ్యానికి నీరు జోడించే ముందు, కుక్కర్‌ను తక్కువ మంటపై వేడి చేయండి. అందులో ఒక టీస్పూన్ నెయ్యి వేసి కలపాలి. ఇప్పుడు అందులో నీళ్ళు పోసి వేడి చేసి అన్నం వేయాలి. కావాలంటే పైన ఒక టీస్పూన్ నెయ్యి వేసుకోవచ్చు. దీని వల్ల కూడా అన్నం మాడిపోవడం, మెత్తపడటం లాంటివి జరగగవు.

2024-05-04T05:47:51Z dg43tfdfdgfd